Indian batsmen
-
ఏ జట్టులోనైనా సూర్యకు చోటు ఖాయం.. ఎందుకంటే: ఆసీస్ దిగ్గజం
దుబాయ్: భారత బ్యాటర్ సూర్యకుమార్ యాదవ్‌పై ఆస్ట్రేలియా దిగ్గజం రికీ పాంటింగ్ ప్రశంసలు కురిపించాడు. అతని ఆట తనను ఎంతో ఆకట్టుకుందని, విధ్వంసకర శైలి ఏబీ డివిలియర్స్‌ను గుర్తుకు తెస్తోందని పాంటింగ్ అన్నాడు. భారత జట్టు తరఫున అతను నాలుగో స్థానంలో ఆడటమే సరైందని పాంటింగ్ సూచించాడు. ‘సూర్యకుమార్ కూడా డివిలియర్స్ తరహాలోనే మైదానమంతా 360 డిగ్రీ షాట్లు ఆడతాడు. ల్యాప్ షాట్, కట్ షాట్, ర్యాంప్ షాట్ల గురించి ప్రత్యేకంగా చెప్పేదేముంది. లెగ్‌సైడ్ వైపు మరింత అద్భుతంగా ఆడే సూర్య అటు పేస్ బౌలింగ్, ఇటు స్పిన్‌ను సమర్థంగా ఎదుర్కోగలడు. ఏ జట్టులోనైనా సూర్యకు చోటు ఖాయం. షాట్లు ఆడే సమయంలో ఎక్కడా వెనక్కి తగ్గకుండా ఆడే సూర్యకుమార్ ఆత్మవిశ్వాసం నన్ను ఆకర్షించింది. నాకు తెలిసి అతను మిడిలార్డర్లో ఆడటం సరైంది. మ్యాచ్‌ను సరిగా నడిపించడంతో పాటు చివర్లో క్రీజ్‌లో ఉంటే చెలరేగిపోగలడు’ అని ఆసీస్ మాజీ కెప్టెన్ విశ్లేషించాడు. చదవండి: Hasin Jahan: ఇండియా పేరు మార్చండి.. ప్రధాని మోదీకి క్రికెటర్ షమీ ‘భార్య’ అభ్యర్ధన -
గెలిపించేదెవరు..?
ఇంగ్లండ్‌తో టెస్టు సిరీస్‌లో నాలుగు ఇన్నింగ్స్‌లలో కెప్టెన్ విరాట్ కోహ్లిని మినహాయిస్తే స్పెషలిస్ట్ బ్యాట్స్‌మెన్‌లో ఒక్కరు కూడా కనీసం 30 పరుగులు దాటలేకపోయారు. లార్డ్స్ టెస్టులో వోక్స్ అజేయంగా చేసినన్ని పరుగులు కూడా టీమిండియా మొత్తం కలిపి ఒక్క ఇన్నింగ్స్‌లోనూ చేయలేకపోయింది. నంబర్‌వన్ టీమ్, విదేశీ గడ్డపై చెలరేగే సత్తా ఉందంటూ సిరీస్‌కు ముందు కోచ్ రవిశాస్త్రి ఎంత ఊదరగొట్టినా... మన బ్యాట్స్‌మెన్ ఆట చూస్తే మాత్రం మళ్లీ పాత రోజులే గుర్తుకు తెచ్చాయి. అన్నీ మరచి సిరీస్ స్కోరును 2–1గా చేయడమే ప్రస్తుతం తమ కర్తవ్యమంటూ కెప్టెన్ ఆత్మవిశ్వాసంతో చెబుతున్నా మానసికంగా దుర్బలంగా మారిన ఈ జట్టును గెలిపించే బాధ్యత ఎవరు తీసుకోగలరు? సాక్షి క్రీడా విభాగం: ఇంగ్లండ్ గడ్డపై ప్రస్తుతం ఆడుతున్న టెస్టు సిరీస్‌ను 0–5తో చిత్తుగా కోల్పోయినా భారత జట్టు నంబర్‌వన్ ర్యాంక్ మాత్రం చెక్కుచెదరదు! సొంతగడ్డపై ఎదురు లేని ప్రదర్శనతో సాధించిన వరుస విజయాలు అందుకు కారణమని ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ర్యాంక్ మారదు సరే కానీ తమ స్థాయికి తగినట్లుగా ఆడటం మాత్రం మన వల్ల కావడం లేదు. 2011లో వయసైపోయిన ఆటగాళ్ల వల్లే అన్నారు. 2014లో ఇంకా కుర్రాళ్లే, నేర్చుకుంటున్నారని సమాధానం వినిపించింది. మరి ఇప్పుడు ఏమని వివరణ ఇవ్వగలరు? పైగా దక్షిణాఫ్రికాతో సిరీస్ అనుభవం నేపథ్యంలో ముందుగా వెళ్లి సన్నద్ధమవుతామని జట్టు అడిగితే బీసీసీఐ అన్ని ఏర్పాట్లు చేసింది. కోరినట్లుగా ముందు టి20లు, ఆ తర్వాత వన్డేలు ముగిశాక టెస్టు సిరీస్ ఆడతామంటే ప్రత్యర్థి అయినా ఇంగ్లండ్ బోర్డు కూడా షెడ్యూల్‌ను దానికి అనుగుణంగా మార్చింది. కానీ ఫలితం మాత్రం దక్కలేదు. సరిగ్గా చెప్పాలంటే నాలుగేళ్లలో మన జట్టు ఏమాత్రం మెరుగు పడలేదు. ఎవరిని నమ్మాలి... ఈ ఏడాది దక్షిణాఫ్రికాతో మూడు టెస్టులు, తాజాగా ఇంగ్లండ్‌లో రెండు టెస్టులు కలిపి చూస్తే ఉపఖండం బయట భారత బ్యాట్స్‌మెన్ ప్రదర్శన సాధారణ స్థాయిలో కూడా లేదని అర్థమవుతుంది. ప్రధాన బ్యాట్స్‌మెన్ అంతా విఫలమవుతున్న వేళ ఎవరిని తప్పించి ఎవరికి అవకాశం ఇవ్వాలో కూడా అర్థం కాని పరిస్థితి ప్రస్తుతం మన జట్టులో కనిపిస్తోంది. విదేశాల్లో ఓపెనర్‌గా భారత్‌కు శుభారంభం అందిస్తాడని భావించిన మురళీ విజయ్ తన ఆట ఎప్పుడో మరచిపోయాడు. 10 ఇన్నింగ్స్‌లలో కలిపి అతను 128 పరుగులు చేశాడు. ఇక ధావన్ (17.75 సగటు) గురించి కూడా ఎంత చెప్పుకున్నా తక్కువే. పుజారా క్రీజ్‌లో పాతుకుపోయే అలవాటు ఉన్నా, ఆ ఆరంభాన్ని సరిగ్గా వాడుకోనేలేదు. 8 ఇన్నింగ్స్‌లలో కలిపి ఏకంగా 454 బంతులు ఆడిన అతను 118 పరుగులు మాత్రమే చేశాడు. రెండు సార్లు మాత్రం 20 పరుగులు (ఒక అర్ధ సెంచరీ) దాటగలిగాడు. రహానేలాంటి క్లాస్ ఆటగాడిపై పెట్టుకున్న నమ్మకం కూడా వృథా అయింది. ఇక ఎంతో కాలం తర్వాత పునరాగమనం చేసిన దినేశ్ కార్తీక్ ఓనమాల దశలోనే ఉండిపోయినట్లున్నాడు. ఏమాత్రం ప్రాధాన్యత లేని నిదాహస్ ట్రోఫీ ఫైనల్లో ఆఖరి బంతికి కొట్టిన సిక్సర్ అతనికి కొత్త జీవితాన్నిచ్చిందే గానీ టెస్టులకు మాత్రం పనికి రాలేదు. ఈ ఐదు టెస్టుల్లో కలిపి కోహ్లి ఒక్కడే 505 పరుగులు చేస్తే మిగతా టాప్–5 ఆటగాళ్లంతా కలిపి 526 పరుగులు మాత్రమే చేయగలిగారు. లార్డ్స్‌లో కూడా కోహ్లి ఎలా ఆడాలో చెబితే తప్ప ఇతర ఆటగాళ్లు ఆడలేని పరిస్థితి కనిపించింది. ఒకవేళ కోహ్లి వెన్ను నొప్పితో తర్వాతి టెస్టుకు దూరమైతే ఫలితం ఎలా ఉంటుందో ఊహించుకోవడానికే ఇబ్బందిగా ఉంది. వీరికి బాధ్యత లేదా... 2014లో ఘోర వైఫల్యం తర్వాత బౌలింగ్, ఫీల్డింగ్ కోచ్ జో డాస్, పెన్నీలను బీసీసీఐ తప్పించింది. మరి ఇప్పుడు జట్టు సహాయక సిబ్బందిలో ఎవరు దీనికి బాధ్యత వహిస్తారనేది చూడాలి. స్లిప్స్‌లో మనోళ్లు క్యాచ్‌లు వదిలేస్తున్న తీరు ఫీల్డింగ్ కోచ్ శ్రీధర్ పనితీరును ప్రశ్నిస్తుండగా, సంజయ్ బంగర్ బ్యాటింగ్ కోచ్‌గా ఏం చేస్తున్నాడనేది ప్రశ్నార్ధకం. అతను వచ్చిన నాలుగేళ్లలో ఒక్క బ్యాట్స్‌మన్ కూడా బంగర్ వల్ల తన ఆట మెరుగైనట్లుగా చెప్పలేదు! అన్నింటికి మించి హెడ్ కోచ్‌గా రవిశాస్త్రి పాత్రపైనే స్పష్టత లేదు. కోహ్లి చెప్పిన అన్నింటికీ తలూపడం మినహా శాస్త్రి కోచ్‌గా ఏం చేస్తున్నాడనేదానిపై అందరికీ సందేహాలే ఉన్నాయి. తన కెప్టెన్సీలో 37 టెస్టుల్లో వరుసగా రెండు మ్యాచ్‌లలో ఒకే జట్టును కొనసాగించని కోహ్లి శైలి, దానికి కోచ్ మద్దతు ఆటగాళ్లలో అభద్రతా భావాన్ని కూడా పెంచింది. లార్డ్స్ టెస్టులో వాతావరణం చూసిన తర్వాత కూడా రెండో స్పిన్నర్ వైపు మొగ్గు చూపడంలో కోచ్ వైఫల్యం కూడా ఉంది. మావాళ్లు సూపర్ అంటూ ఇంటర్వ్యూలలో చెలరేగిపోయే శాస్త్రి తనలోని కామెంటేటర్‌ను పక్కన పెట్టి కోచ్‌గా ఆలోచించాలనేది విస్తృత అభిప్రాయం. తామెవరికీ జవాబుదారీ కాదని కెప్టెన్, కోచ్ అనుకోవచ్చు గానీ తాజా పరిస్థితిపై తమకు తామే సమాధానం ఇచ్చుకుంటేనే సిరీస్‌లో మున్ముందు సానుకూల ఫలితాలకు దారులు తెరచుకుంటాయేమో! తప్పులు సరిదిద్దుకునేందుకు మాకు తర్వాతి టెస్టులో అవకాశం ఉంది. ఆటగాళ్లు చేయగలిగింది ఇదే. నాకు తెలిసి మనోళ్ల బ్యాటింగ్‌లో ఎలాంటి సాంకేతిక లోపాలు లేవు. వాతావరణ పరిస్థితుల గురించి నేను మాట్లాడను. టాస్, వాతావరణం మన చేతుల్లో ఉండవు కదా. మనం సన్నద్ధమై వస్తే ఇలాంటివి ఇబ్బందిగా అనిపించవు. అయినా వీటి గురించి ఆలోచిస్తే భవిష్యత్తు గురించి ఏమీ చేయలేం. ఐదు రోజుల్లో వెన్నునొప్పినుంచి కోలుకుంటాననే నమ్మకముంది. అయితే 100 శాతం ఫిట్‌గా ఉండాలని కోరుకుంటున్నా. – విరాట్ కోహ్లి -
మ్యాచ్ మజా మిస్సయితేనేం...
సాక్షి, హైదరాబాద్ : నిర్ణయాత్మక టీ-20 మ్యాచ్.. ఉప్పల్ మైదానం అనుకూలించకపోవటంతో రద్దు కావటంతో అభిమానులు తీవ్ర నిరాశ చెందారు. అయితే ఫ్యాన్స్ ను ఊరడించేందుకు టీమిండియా బ్యాట్స్ మెన్లు చేసిన ఓ పని మాత్రం అమితంగా ఆకట్టుకుంది. టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ, ధోనీ, రోహిత్ శర్మ, హర్దిక్ పాండ్యా కలిసి మైదానంలో సరదాగా ప్రాక్టీస్ చేశారు. మాములుగా చేస్తే ఏం కిక్కుంటుందో అనుకున్నారో ఏమో ఎడమ చేతి వాటంను ప్రదర్శించారు. సరదాగా ఎడమ చేతి బ్యాటింగ్‌తో కాసేపు అలరించారు. ముందు మైదానంలోకి దిగిన రోహిత్ శర్మ కాస్త తడబడినప్పటికీ.. తర్వాత వచ్చిన కోహ్లీ మాత్రం ఫర్వాలేదనిపించాడు. ఇక తర్వాత దిగిన హర్దిక్ బ్యాట్‌ను బాగానే ఝుళిపించాడు. అటుపై వచ్చిన ధోనీ కూడా కాస్త కష్టపడ్డాడు. మొత్తానికి నలుగురిలో పాండ్యానే బెటర్ ఫెర్ ఫార్మెన్స్ ఇచ్చాడన్న మాట. బీసీసీఐ తన అధికార ట్విట్టర్ లో ఆ ఫోటోలను పోస్ట్ చేసింది. ఇక పాపం కోహ్లీ ఎడమ చేతి వాటంను చూపించేస్తూ.. డీసెంట్ ప్రదర్శన అంటూ ఓ వీడియోను సోషల్ మీడియాలో వైరల్ చేస్తున్నారు. Some left handed batting practice for the Captain and vice-captain as we wait for a further update on the start of play #INDvAUS pic.twitter.com/pG82JVyZIP — BCCI (@BCCI) October 13, 2017 And @msdhoni joins the party #INDvAUS pic.twitter.com/slN7dJqIdr — BCCI (@BCCI) October 13, 2017 Decent shot that by a left handed @imVkohli ! pic.twitter.com/clMoX4M5SQ — Saurabh Malhotra (@MalhotraSaurabh) September 4, 2017 -
విజయానికి 7 వికెట్లు
శ్రీలంక గడ్డపై 22 ఏళ్ల టెస్టు సిరీస్ విజయం నిరీక్షణకు తెరదించే సమయం వచ్చేసింది. దిగ్గజ క్రికెటర్లు తమ కెరీర్లో సాధించలేకపోయిన ఘనతకు యువ భారత్ చేరువయింది. శ్రీలంకతో ఆఖరి టెస్టులో భారత్ జట్టు విజయం దిశగా సాగుతోంది. ఆఖరి రోజు ఏడు వికెట్లు తీస్తే... కోహ్లి ఖాతాలో తొలి టెస్టు సిరీస్ విజయం చేరుతుంది. భారీ వర్షం పడితేనో... అద్భుతమేదైనా జరిగితేనో తప్ప శ్రీలంక ఓటమి నుంచి గట్టెక్కడం కష్టం. - మూడో టెస్టులో గెలుపు దిశగా భారత్ - శ్రీలంక లక్ష్యం 386... ప్రస్తుతం 67/3 - సమష్టిగా రాణించిన భారత బ్యాట్స్‌మెన్ కొలంబో: నాటకీయ మలుపులు తిరుగుతోన్న మూడో టెస్టులో భారత్ జట్టు అన్ని విభాగాల్లోనూ ఆకట్టుకుంది. టాప్ ఆర్డర్ విఫలమైన చోట మిడిలార్డర్ బ్యాట్స్‌మెన్‌తో పాటు టెయిలెండర్లు సమయోచితంగా రాణించడంతో... భారత జట్టు శ్రీలంకకు 386 పరుగుల భారీ లక్ష్యాన్ని నిర్దేశించింది. బ్యాట్స్‌మెన్ కష్టానికి మరింత వన్నె తెస్తూ ఇషాంత్ శర్మ మరోసారి చెలరేగడంతో శ్రీలంక టాప్ ఆర్డర్ మరోసారి తడబడింది. సింహళీస్ స్పోర్ట్స్ క్లబ్ (ఎస్ఎస్సీ) మైదానంలో జరుగుతున్న ఈ మ్యాచ్‌లో నాలుగో రోజు సోమవారం ఆట ముగిసే సమయానికి శ్రీలంక రెండో ఇన్నింగ్స్‌లో 18.1 ఓవర్లలో మూడు వికెట్లకు 67 పరుగులు చేసింది. సిల్వ (24 బ్యాటింగ్), మ్యాథ్యూస్ (22 బ్యాటింగ్) క్రీజులో ఉన్నారు. భారత బౌలర్లలో ఇషాంత్ రెండు వికెట్లు, ఉమేశ్ ఒక్క వికెట్ తీశారు. అంతకుముందు భారత్ రెండో ఇన్నింగ్స్‌లో 76 ఓవర్లలో 274 పరుగులకు ఆలౌటయింది. రోహిత్ (72 బంతుల్లో 50; 4 ఫోర్లు, 1 సిక్సర్), స్పిన్నర్ అశ్విన్ (87 బంతుల్లో 58; 7 ఫోర్లు) అర్ధసెంచరీలు సాధించారు. బిన్నీ (49), నమన్ ఓజా (35), అమిత్ మిశ్రా (39) రాణించారు. లంక బౌలర్లలో ప్రసాద్, ప్రదీప్ నాలుగేసి వికెట్లు తీసుకున్నారు. తొలి ఇన్నింగ్స్ ఆధిక్యం 111 పరుగులు కలుపుకుని భారత్‌కు మొత్తం 385 పరుగుల ఆధిక్యం సమకూరింది. ఆట చివరి రోజు శ్రీలంక గెలవాలంటే మరో 319 పరుగులు చేయాలి. భారత్ గెలవాలంటే 7 వికెట్లు తీయాలి. సమష్టిగా... గౌరవప్రదంగా ఓవర్‌నైట్ స్కోరు 21/3తో ఇన్నింగ్స్‌ను ప్రారంభించిన భారత్ రోహిత్, కోహ్లి నిలకడగా ఆడటంతో భారీస్కోరు దిశగా సాగింది. కోహ్లి (21) అవుటైనా... రోహిత్, బిన్నీ కలిసి బాగా ఆడారు. ముఖ్యంగా బిన్నీ బౌలర్లపై ఎదురుదాడి చేశాడు. లంచ్ విరామానికి ముందు రోహిత్ అవుటైనా... నమన్ ఓజా, బిన్నీ కలిసి బాగా ఆడారు. లంచ్ తర్వాత ఈ ఇద్దరూ బాగా దూకుడు పెంచారు. ఈ క్రమంలో బిన్నీ ఒక్క పరుగు తేడాతో అర్ధసెంచరీని కోల్పోగా... ఓజా కూడా భారీ షాట్ ఆడబోయి అవుటయ్యాడు. దీంతో భారత్ 179 పరుగుల వద్ద ఏడో వికెట్ కోల్పోయింది. ఈ సమయంలో లంక శిబిరంలో మ్యాచ్‌పై ఆశలు పెరిగాయి. అయితే అశ్విన్, మిశ్రా అద్భుతంగా ఆడారు. ఈ స్పిన్నర్లిద్దరూ సమయోచితంగా స్ట్రయిక్ రొటేట్ చేయడంతో పాటు అడపాదడపా బౌండరీలతో ఎనిమిదో వికెట్‌కు 55 పరుగులు జోడించారు. మిశ్రా అవుటైన తర్వాత అశ్విన్... ఉమేశ్, ఇషాంత్‌ల సహాయంతో భారత్‌కు మంచి స్కోరు అందించి ఆఖరి వికెట్‌గా వెనుదిరిగాడు. భారత్ రెండో ఇన్నింగ్స్‌లో అనూహ్యంగా టెయిలెండర్ల పుణ్యమాని 274 పరుగుల స్కోరుతో మ్యాచ్‌పై పట్టు బిగించింది. ఆరంభంలో వికెట్లు భారీ లక్ష్యంతో రెండో ఇన్నింగ్స్‌ను ప్రారంభించిన శ్రీలంకకు తొలి ఓవర్లోనే ఎదురుదెబ్బ తగిలింది. ఇషాంత్ బౌలింగ్‌లో తరంగ అవుటయ్యాడు. మరో ఎండ్‌లో ఉమేశ్ బౌలింగ్‌లో కరుణరత్నే కూడా పెవిలియన్‌కు చేరడంతో 2 పరుగులకే 2 వికెట్లు కోల్పోయింది. చండీమల్ (17 బంతుల్లో 18; 3 ఫోర్లు) ఎదురుదాడి చేసే ప్రయత్నంలో ఇషాంత్ బౌలింగ్‌లో అవుటయ్యాడు. మరో ఓపెనర్ సిల్వ, మ్యా థ్యూస్ జాగ్రత్తగా ఆడి మరో వికెట్ పడకుండా రోజును ముగించారు. వెలుతురు సరిగా లేకపోవడంతో మరో 4 ఓవర్లు ఉన్నా ఆట నిలిపివేశారు. స్కోరు వివరాలు భారత్ తొలి ఇన్నింగ్స్: 312; శ్రీలంక తొలి ఇన్నింగ్స్: 201; భారత్ రెండో ఇన్నింగ్స్: పుజారా (బి) ప్రసాద్ 0; రాహుల్ (బి) ప్రదీప్ 2; రహానే ఎల్బీడబ్ల్యు (బి) ప్రదీప్ 4; కోహ్లి (సి) తరంగ (బి) ప్రదీప్ 21; రోహిత్ (సి) ప్రదీప్ (బి) ప్రసాద్ 50; బిన్నీ (సి) తరంగ (బి) ప్రసాద్ 49; నమన్ ఓజా (సి) కరుణరత్నే (బి) హెరాత్ 35; అమిత్ మిశ్రా రనౌట్ 39; అశ్విన్ (సి) పెరీరా (బి) ప్రసాద్ 58; ఉమేశ్ (సి) హెరాత్ (బి) ప్రదీప్ 4; ఇషాంత్ నాటౌట్ 2; ఎక్స్‌ట్రాలు 10; మొత్తం (76 ఓవర్లలో ఆలౌట్) 274. వికెట్ల పతనం: 1-0; 2-2; 3-7; 4-64; 5-118; 6-160; 7-179; 8-234; 9-269; 10-274. బౌలింగ్: ప్రసాద్ 19-3-69-4; ప్రదీప్ 17-2-62-4; హెరాత్ 22-0-89-1; మాథ్యూస్ 6-3-11-0; కౌశల్ 12-2-41-0. శ్రీలంక రెండో ఇన్నింగ్స్: తరంగ (సి) నమన్ (బి) ఇషాంత్ 0; సిల్వ బ్యాటింగ్ 24; కరుణరత్నె (సి) నమన్ (బి) ఉమేశ్ 0; చండీమల్ (సి) కోహ్లి (బి) ఇషాంత్ 18; మ్యాథ్యూస్ బ్యాటింగ్ 22; ఎక్స్‌ట్రాలు 3; మొత్తం (18.1 ఓవర్లలో మూడు వికెట్లకు) 67. వికెట్ల పతనం: 1-1; 2-2; 3-21. బౌలింగ్: ఇషాంత్ 7-2-14-2; ఉమేశ్ 5-1-32-1; బిన్నీ 4-1-13-0; మిశ్రా 2-0-2-0; అశ్విన్ 0.1-0-4-0. -
'వీళ్లేమీ సచిన్‌లు, ద్రావిడ్‌లు కారు'
కొలంబో: ప్రస్తుత టీమిండియా బ్యాట్స్‌మెన్.. సచిన్, ద్రావిడ్‌లు కారని, స్పిన్ బౌలింగ్‌ను ఎదుర్కోవడంలో ఈ దిగ్గజాలతో పోల్చరాదని శ్రీలంక కెప్టెన్ ఏంజిలో మాథ్యూస్ అన్నాడు. సచిన్, ద్రావిడ్‌ల మాదిరిగా భారత ఆటగాళ్లు స్పిన్ బౌలింగ్‌లో ఆడలేరని మాథ్యూస్ చెప్పాడు. తొలి టెస్టులో 176 పరుగుల లక్ష్యసాధనలో టీమిండియా బ్యాట్స్‌మెన్ స్పిన్‌కు తడబడి 63 పరుగుల తేడాతో ఓడిపోయిన సంగతి తెలిసిందే. భారత్, శ్రీలంకల మధ్య గురువారం నుంచి రెండో టెస్టు జరగనుంది. మ్యాచ్ ముందు రోజు బుధవారం మాథ్యూస్ మీడియాతో మాట్లాడుతూ.. భారత్ ఆటగాళ్లు స్పిన్ బౌలింగ్‌లో ఆడటం నేర్చుకోవాలని సూచించాడు. భారత జట్టులో ఏ క్రికెటర్‌నూ సచిన్, ద్రావిడ్‌లతో పోల్చరాదని చెప్పాడు. భారత యువ బ్యాట్స్‌మెన్‌ను సచిన్, ద్రావిడ్‌లతో ఎలా పోల్చరాదో.. తమ జట్టులోని యువ ఆటగాళ్లను మహేల జయవర్ధనె, సంగక్కరలతో పోల్చరాదని మాథ్యూస్ వ్యాఖ్యానించాడు.