మ్యాచ్‌ మజా మిస్సయితేనేం... | Team India Batsmen batted with left-handed in Uppal | Sakshi
Sakshi News home page

ఎడమ చేతి వాటంతో సరదాగా...

Published Sat, Oct 14 2017 2:14 PM | Last Updated on Sat, Oct 14 2017 2:16 PM

Team India Batsmen batted with left-handed in Uppal

సాక్షి, హైదరాబాద్‌ : నిర్ణయాత్మక టీ-20 మ్యాచ్‌.. ఉప్పల్ మైదానం అనుకూలించకపోవటంతో రద్దు కావటంతో అభిమానులు తీవ్ర నిరాశ చెందారు. అయితే ఫ్యాన్స్ ను ఊరడించేందుకు టీమిండియా బ్యాట్స్ మెన్లు చేసిన ఓ పని మాత్రం అమితంగా ఆకట్టుకుంది. 

టీమిండియా కెప్టెన్‌ విరాట్ కోహ్లీ, ధోనీ, రోహిత్ శర్మ, హర్దిక్‌ పాండ్యా కలిసి మైదానంలో సరదాగా ప్రాక్టీస్ చేశారు. మాములుగా చేస్తే ఏం కిక్కుంటుందో అనుకున్నారో ఏమో ఎడమ చేతి వాటంను ప్రదర్శించారు. సరదాగా ఎడమ చేతి బ్యాటింగ్‌తో కాసేపు అలరించారు. ముందు మైదానంలోకి దిగిన రోహిత్ శర్మ కాస్త తడబడినప్పటికీ.. తర్వాత వచ్చిన కోహ్లీ మాత్రం ఫర్వాలేదనిపించాడు. 

ఇక తర్వాత దిగిన హర్దిక్ బ్యాట్‌ను బాగానే ఝుళిపించాడు. అటుపై వచ్చిన ధోనీ కూడా కాస్త కష్టపడ్డాడు. మొత్తానికి నలుగురిలో పాండ్యానే బెటర్‌ ఫెర్‌ ఫార్మెన్స్ ఇచ్చాడన్న మాట. బీసీసీఐ తన అధికార ట్విట్టర్‌ లో ఆ ఫోటోలను పోస్ట్‌ చేసింది. ఇక పాపం కోహ్లీ ఎడమ చేతి వాటంను చూపించేస్తూ.. డీసెంట్‌ ప్రదర్శన అంటూ ఓ వీడియోను సోషల్ మీడియాలో వైరల్ చేస్తున్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement