Left hand
-
ఎడమ చేతి వాటం, ఎన్నో ప్రత్యేకతలు.. తెలివి తేటలు, గ్రహించే శక్తి అన్నీ ఎక్కువే
సాక్షి, కర్నూలు: సమాజంలో అందరూ ఒకేలా ఉండరు. కొందరి ప్రత్యేకతను ఇట్టే గుర్తుపట్టొచ్చు. ప్రపంచ జనాభాలో 10 శాతం మంది ఎడమ చేతి వాటం (లెఫ్ట్ హ్యాండర్స్) కలిగి ఉన్నారు. వీరెక్కడ కనబడినా మనం ప్రత్యేకంగా చూస్తాం. కుడి ఎడమైతే పొరపాటే లేదోయ్ అన్నాడో సినీ కవి. ఎడమ చేతి వాటం కేవలం జన్యుప్రభావం వల్ల ఎర్పడుతుందని పరిశోధనల్లో తేలింది. ఆగస్టు 13న ప్రపంచ లెఫ్ట్‌హ్యాండర్స్ డేగా జరుపుకుంటున్నారు. కుడి చేతి వాటం కలిగిన వారి కన్నా ఎడమ చేతి వాటం వారు ఉన్నత స్థానాల్లో ఉంటారని, వారికి తెలివి తేటలు, గ్రహించే శక్తితో పాటు మంచి అలోచన శక్తి ఉంటుందని అంటారు. అంతేకాదు ప్రపంచంలో గుర్తింపు పొందిన మేధావుల్లో మన దేశ ప్రధాని నరేంద్రమోదీ ఎడమ చేతితోనే రాస్తారు. క్రికెటర్లు సచిన్ టెండూల్కర్, యువరాజ్ సింగ్, అమెరికా మాజీ ప్రెసిడెంట్లు ఒబామా, బిల్‌క్లింటన్, సినీ నటుడు అమితాబ్, సావిత్రి ఇలా ఎందరో లెఫ్ట్‌హ్యాండ్ వాటం వారే. ఎడమ చేతి వాటం ఉన్న వారిలో క్రియేటివిటీ, మ్యూజిక్, ఆర్ట్స్ అధికంగా ఉంటాయి. వీరికి మాట్లడే శక్తి, అర్థం చేసుకునే సామర్థ్యం మెండుగా ఉంటుంది. వీరి ప్రత్యేకతల్లో కొన్ని ►చేతులకు ఉన్నట్లే కాళ్లకు కూడా వాటం ఉంటుంది. కుడి చేతి వాటం ఉన్న వారిలో కుడికాలు వాడకం, ఎడమ చేతి వాటం ఉన్న వారు ఎడమ కాలి వాడకం ఎక్కువగా కనిపిస్తుంది. ఎడమ చేతి వాటం ఉన్న వాళ్లు ఎదైనా చూడాలంటే మొదట ఎడమ కన్నుతోనే చూస్తారు. ►మహిళలకు మాత్రం సృజనాత్మకతో పాటు మెదడు చురుగ్గా పనిచేస్తుందని అధ్యయనాలు చెబుతున్నాయి ►ఎడమ చేతివాటం వారు వేగంగా, సులభంగా పనులు మంచి టెక్నిక్‌తో పూర్తి చేస్తారు. వీరికి మెమొరీ పవర్, ఐక్యూ అధికంగా ఉన్నప్పటికీ చిన్న చిన్న విషయాలు వెంటనే మరచిపోగలరు. వారికీ ఇబ్బందులు.. ఎడమ చేతి వాటం వాళ్లలో టైలర్లు కాస్త ఇబ్బందులు పడుతుంటారు. ఎందుకంటే కత్తెర, సూయింగ్ మిషన్ డిజైన్ పూర్తిగా కుడి చేతి వారికి సరిపోయే విధంగా తయారై ఉంటాయి. కంప్యూటర్ మౌస్, డ్రైవింగ్ చేసేవారు ఇలా ఎందరో ఇబ్బందులు పడుతుంటారు. ప్రస్తుతం వారి కోసం కూడా ప్రత్యేకంగా డిజైన్లు తయారవుతున్నాయి. ►ఈ చిత్రంలో కపిస్తున్న బాలిక పేరు షాజిదాబి (లెఫ్ట్ హ్యాండర్). క్రిష్టిపాడు గ్రామానికి చెందిన హుసేన్‌బాషా, ఉసేన్బీల రెండో కూతురు. బాలిక ప్రస్తుతం ఉయ్యాలవాడ మండలం హరివరం జెడ్పీ ఉన్నత పాఠశాలలో 9వ తరగతి చదువుంది. చదువులో ముందంజలో ఉంటుంది. తెలుగు, ఆంగ్లం కంటే హిందీ రైటింగ్ బాగా రాస్తుందని ఉపాధ్యాయులు చెబుతున్నారు. బాలిక చెల్లెలు రిజ్వానతో పాటు మేనత్త కొడుక్కి ఎడమ చేతివాటం ఉండటం గమనార్హం. ►ఈ చిత్రంలో కనిపిస్తున్న చిన్నోడి పేరు శివకేశవ (లెఫ్ట్ హ్యాండర్). దొర్నిపాడులోని ఎంపీపీ స్పెషల్ స్కూల్లో రెండో తరగతి చదువుతున్నాడు. క్యారమ్స్ క్రీడలో చురుగ్గా రాణిస్తున్నాడు. చదువుతో పాటు క్రీడల్లో ముందుంటాడని టీచర్లు చెబుతున్నారు. ►ఇక్కడ చిత్రలేఖనం చేస్తూ కనిపిస్తున్న బాలిక పేరు మానస (లెఫ్ట్ హ్యాండర్). డబ్ల్యూ.కొత్తపల్లె జెడ్పీ ఉన్నత పాఠశాలలో పదో తరగతి చదువుంది. చదువుతో పాటు చిత్రలేఖనంలో రాణిస్తుంది. తమ కుటుంబంలో ఎవరికీ ఎడమ చేతి వాటం లేదని మానసకు మాత్రమే వచ్చిందని తండ్రి బాలచంద్రుడు పేర్కొన్నాడు. జన్యు మార్పులతోనే ఎడమ చేతివాటం ఒక మనిషి మెదడు కుడి, ఎడమ రెండు అర్ధభాగాలుగా ఉంటుంది. కుడివైపు శరీర భాగాన్ని మెదడు ఎడమవైపు భాగం నియంత్రిస్తుందని పరిశోధనల్లో తేలింది. అంటే కుడి అర్ధభాగం మెదడు బలంగా ఉన్నవారిలో ఎడమ చేతివాటం వస్తుంది. మన ప్రాంతంలో చాలా మంది కుడిచేతితో డబ్బులు ఇవ్వడాన్ని, మంచి పనులు ప్రారంభించడాన్ని సెంటిమెంట్‌గా పరిగణిస్తారు. అందుకే చిన్నప్పుడే తల్లిదండ్రులు ఎడమ చేతివాటం గమనిస్తే మాన్పించే ప్రయత్నం చేస్తారు. వారికి జన్యుపరమైన మార్పులు ఉన్నప్పుడు మనం ఏమీ చేయలేం. అందుకే వారిని ఇబ్బందులకు గురి చేయవద్దు. వయస్సు పెరిగే కొద్ది సాంప్రదాయాలు చెబితే వారు అర్థం చేసుకోని మన పద్ధతులను బట్టి నడుచుకోగలరు. –డాక్టర్ నాగేంద్ర, దొర్నిపాడు పీహెచ్సీ -
మీకు ఎడమచేతివాటం ఉందా?.. ఇవి తప్పక తెలుసుకోండి.!
మీకు ఎడమచేతివాటం అలవాటా? లేదా మీకు తెలిసిన వారిలో ఎవరైన ఉన్నారా? వీరి గురించి శాస్త్రవేత్తలు తెలియజేసే ఆసక్తికర విషయాలు ఏమిటో తెలుసుకోండి.. ►భూమిపై ఉన్న మొత్తం జనాభాలో 5 నుంచి 10 శాతం మాత్రమే ఎడమచేతివాటం వ్యక్తులు ఉన్నారు. ►కుడిచేతివాటం వ్యక్తులతోపాల్చితే వీరికి ఆల్కహాల్ తీసుకునే అలవాటు మూడు రెట్లు ఎక్కువట. ►మెదడులో కుడి భాగాన్ని వీరు ఎక్కువగా వినియోగిస్తారు. ►యుక్తవయసులోకి 4 నుంచి 5 నెలలు ఆలస్యంగా అడుగుపెడతారు. ►ప్రముఖ టెన్నిస్ ఆటగాళ్లలో 40శాతం ఎడమచేతివాటం ఉన్నవారే ఉంటారు. ఎందుకో ఎప్పుడైనా ఆలోచించారా? ఎడమచేయి అలవాటు ఉన్నవాళ్లు బేస్‌బాల్ ఆటల్లో నిష్ణాతులట. టెన్నీస్, స్విమ్మింగ్, బాక్సింగ్ ఆటలు బాగా ఆడతారట. ►మొత్తం 26 అమెరికా అధ్యక్షుల్లో 8 మంది ఎడమచేతి వాటం ఉన్నవాళ్లే. జేమ్స్ ఎ గార్ఫీల్డ్, హెర్బర్ట్ హూవర్, హ్యారీ ఎస్ ట్రూమాన్, గెరాల్డ్ ఫోర్డ్, రోనాల్డ్ రీగన్, జార్జ్ హెచ్‌డబ్యూ బుష్, బిల్ క్లింటన్, బరాక్ ఒబామా. ►గ్రాడ్యుయేషన్ పూర్తిచేసిన లెఫ్ట్ హ్యండ్ వ్యక్తుల్లో 26 శాతం మంది ధనవంతులౌతారు. ►చరిత్రలో మంచికి కానీ చెడుకి కానీ పేరుగాంచిన వారిలో ఎడమచేతివాటం ఉన్నవాళ్లే ఎక్కువగా మంది కనిపిస్తారు. వీరిలో సృజనాత్మకత, సంగీత సామర్ధ్య లక్షణాలు కూడా ఎక్కువేనట. బోస్టన్ స్ట్రాంగ్లర్, ఒసామా బిన్ లాడెన్, జాక్ ది రిప్పర్ అందరూ ఎడమచేతి వాటం గలవారే. ►left అనే ఇంగ్లీష్ పదం ఆంగ్లో సక్సాన్ పదమైన lyft నుంచి వచ్చింది. దీనికి విరిగిన లేదా బలహీణం అని అర్థం. ►20 యేళ్ల మహిళలతో పోల్చితే 40 యేళ్లు దాటిన స్త్రీలు 128 శాతం ఎడమచేతివాటం ఉన్న శిశువులకు జన్మనిస్తున్నారట. ►ఎడమచేతివాటం వ్యక్తులు గణితం, భవన నిర్మాణ (ఆర్కిటెక్చర్), అంతరిక్ష రంగాల్లో మరింత ప్రతిభావంతులని అధ్యయనాలు వెల్లడిస్తున్నాయి. కుడిచేతి వారు మాటలు చెప్పడంలో నిష్ణాతుని కూడా పేర్కొన్నాయి. ►ప్రతి నలుగురు అంతరిక్ష వ్యోమగాముల్లో ఒకరు ఎడమచేతివాటం వారే! ►అమెరికా జనాభాలో 30 లక్షల మంది ఎడమచేతివాటం పౌరులున్నారు. ►వీరికి ఆస్థమా, అలర్జీల సమస్యలు అధికంగా ఉంటాయి. ►ఎడమచేతికి గాయమైతే, కుడిచేత్తో పనులు చేయడం త్వరగానే నేర్చుకుంటారని అధ్యయనాలు చెబుతున్నాయి. ►బ్రిటీష్ రాజ కుటుంబంలో క్వీన్ మదర్, క్వీన్ ఎలిజబెత్ 2, ప్రిన్స్ చార్లెస్, ప్రిన్స్ విలియం వీళ్లంగా ఎడమచేతివాటం వారే. కుటుంబాన్ని ముందుకు నడిపే నైపుణ్యం వీళ్లకి ఎక్కువే. ►వీరు ఇన్సోమ్నియా అనే నిద్రలేమి వ్యధికి ఎక్కువగా గురౌతారు. ►ఆగస్ట్ 13ను ఇంటర్నేషనల్ లెఫ్ట్ హ్యాండర్స్ డేగా జరుపుకుంటారు. ►వీరు పొడవైన పదాలను స్పీడ్‌గా టైప్ చేయగలరట. ►ఎడమ చేతి వాటం ఉన్న వ్యక్తులు కుడిచేతి వాటం వారి కంటే నీటి అడుగున ఉన్నవాటిని స్పష్టంగా చూడగలుగుతారు. ►కుడి చేతివాళ్ల కంటే వీరిలో కొంచెం కోపం ఎక్కువని జర్నల్ ఆఫ్ నెర్వస్ అండ్ మెంటల్ డిసీజ్ నిర్వహించిన అధ్యయనాలు తెలుపుతున్నాయి. ప్రముఖ టెన్నీస్ ఆటగాడు జాన్ మెక్ఎన్రో చాలా కోపిష్టి. ఇతను ఎడమచేతి వాటం ఆటగాడే. ఇవన్నీ పరిశోధనల్లో తేలిన విషయాలు. ఐతే అందరిలో ఇక్కడ ఇచ్చిన అన్ని లక్షణాలు ఉండక పోవచ్చు. సాధారణంగా కనిపించే లక్షణాలను మాత్రమే పేర్కొనడం జరిగింది. చదవండి: ఈ వాటర్ బాటిల్ ధర సీఈవోల జీతం కంటే ఎక్కువే!.. రూ.45 లక్షలు.. -
ఎడమ చేతి అలవాటుకు కారణం ఇదేనా?
International Lefthanders Day 2021: ఈ సమాజంలో అందరూ ఒకేలా ఉండరు. కొందరి ప్రత్యేకతను ఇట్టే గుర్తుపట్టొచ్చు. వందలో 90 మంది కుడి చేతి వాటం వాళ్లే ఉండగా, ఎడమ చేతి వాటం వాళ్లు(లెఫ్ట్ హ్యాండర్స్) చాలా అరుదుగా కనిపిస్తుంటారు. అందుకే వీరెక్కడ కనపడినా మనం ప్రత్యేకంగా చూస్తాం. వాళ్ల గురించి ప్రత్యేకంగా చెప్పుకుంటాం. కుడి ఎడమైతే పొరపాటు లేదోయ్ అన్నడో సినీ కవి. కానీ, లెఫ్ట్ హ్యాండర్స్ గురించి ఇప్పటికీ కొన్ని అపోహలు ప్రచారంలో ఉన్నాయి. అయితే ఈ అపోహలు వాళ్లకే అనుకూలంగా ఉంటున్నాయి కూడా. ఈ తరహా లాభాన్ని సైంటిఫిక్‌గా ‘నెగటివ్ ఫ్రీక్వెన్సీ డిపెండెంట్ సెలక్షన్’ అంటారు. లెఫ్ట్ హ్యాండర్స్ జెనెటిక్ డిజార్డర్ అని చాలా మంది పొరపడుతుంటారు. అంతేకాదు వీళ్లు రోగ నిరోధక శక్తి సంబంధిత వ్యాధులతో త్వరగా చనిపోతారనే ఒక ప్రచారం నడిచేది అప్పట్లో. మనుషుల్లో ఎడమ చేతి వాటం ఎందుకు వస్తుందో శాస్త్రీయమైన కారణాలను నేటికీ కనుగొనలేకపోవడం విశేషం. అది పుట్టుకతోగానీ, బలవంతంగాగానీ వచ్చే అలవాటు ఎంతమాత్రం కాదు. కానీ, శరీర అంతర్నిర్మాణ పనితీరుపై ఆధారపడుతుందన్న ఒక కారణం మాత్రం చెబుతుంటారు సైంటిస్టులు. మనిషి మెదడు కుడి, ఎడమ రెండు అర్థ భాగాలుగా ఉంటుంది. కుడివైపు శరీరాన్ని మెదడు ఎడమ అర్ధ భాగం నియంత్రిస్తుంది. అలాగే ఎడమవైపు ఉండే శరీర భాగాన్ని మెదడులోని కుడి అర్థభాగం నియంత్రిస్తుంది. అంటే మెదడులోని కుడి అర్ధ భాగం బలంగా ఉన్నవారిలో ఎడమ చేతివాటం రావొచ్చనే ఒక అభిప్రాయం మాత్రం చాలామంది సైంటిస్టుల్లో ఉండగా, జెనెటిక్ ఎఫీషియన్సీ మీద కూడా ఆధారపడి ఉండొచ్చని మరికొందరు సైంటిస్టులు భావిస్తున్నారు. వరల్డ్ లెఫ్ట్ హ్యాండర్స్ డే ఈ భూమ్మీద ఏడు నుంచి పది శాతం జనాభా.. ఎడమ చేతి వాటం వాళ్లే ఉన్నారు. అందుకే ఒక స్పెషల్ డే ఉంది. ‘‘ఆగస్టు 13’’న జరుపుతున్నారు. 1976 నుంచి ప్రతీ ఏటా జరుపుతున్నారు. అమెరికా సైన్యంలో పని చేసిన డీన్ ఆర్ క్యాంప్‌బెల్ ఈ దినోత్సవానికి మూలం. ఈయనే లెఫ్ట్హ్యాండర్స్ఇంటర్నేషనల్ కంపెనీని స్థాపించాడు. ఈ రోజున లెఫ్టీస్ ఎదుర్కొంటున్న అసౌకర్యాలపై అవగాహన కార్యక్రమాలు, వాటిని అధిగమించేందుకు అవసరమైన ప్రోత్సాహాన్ని అందిస్తుంటారు. లెఫ్టీస్ క్లబ్‌లు ఈ కార్యక్రమాల్ని నిర్వహిస్తుంటాయి. మాన్పించడం మంచిదేనా? ఏడాదిన్నర నుంచి రెండేళ్ల మధ్య వయస్సులో పిల్లలు వస్తువులను పట్టుకోవడం మొదలుపెట్టినప్పుడు వాళ్లు ఎడమ? కుడి? చేతి వాటం వాళ్లు అన్నది గుర్తించవచ్చు. కానీ, కొందరు తల్లిదండ్రులు ఎడమ చేతి వాటాన్ని ఒక చెడు అలవాటుగా భావిస్తారు. బలవంతంగా ఆ అలవాటును మాన్పించేందుకు ప్రయత్నిస్తుంటారు. అయితే అది పిల్లల మెదడుపై ప్రభావం చూపుతుందంటున్నారు మానసిక వైద్యులు. బ్రెయిన్ డిసీజ్లతోపాటు నత్తి, మానసిక సమస్యలు వచ్చే అవకాశం ఉందని హెచ్చరిస్తున్నారు. అందుకే దీనిని శరీర నిర్మాణ క్రమంలో భాగంగానే భావించాలి తప్పా... కీడుగా పరిగణించాల్సిన అవసరం లేదని సూచిస్తున్నారు. ఎడమచేతి వాటం ఉన్నవారిని కొందరైతే పరిశుభ్రత లేనివారుగా, వింతమనుషులుగానూ చూస్తుంటారు. లెఫ్టీస్లో హోమో సెక్సువల్స్ ఎక్కువనే అపోహ కూడా వెస్ట్రన్ కంట్రీస్‌లో నడుస్తుంటుంది. ఈరోజుల్లో ఫర్వాలేదు కానీ.. ఒకప్పుడు మాత్రం లెఫ్టీస్ పరిస్థితి మరీ దారుణంగా ఉండేది. వాళ్లను తప్పుడు మనుషులుగా పొరపడేవాళ్లు. మంత్రగాళ్లుగా, సైతానుకి ప్రతిరూపాలుగా భావించేవాళ్లట. అదే అనుమానంతో కొందరిని చంపిన సందర్భాలూ చరిత్రలో చాలానే ఉన్నాయి. ఐక్యూ లెవెల్ ఎడమ చేతివాటం వాళ్లను లెఫ్టీ, సినిస్ట్రాల్, సౌత్ పా, లెఫ్ట్ హ్యాండెడ్, లెఫ్ట్ హ్యాండర్ అని రకరకాలుగా పిలుస్తుంటారు. నటుడు చార్లీ చాప్లిన్, యాపిల్ కంపెనీ అధినేత స్టీవ్ జాబ్స్, మైక్రోస్టాఫ్ అధినేత బిల్ గేట్స్, అమెరికా మాజీ ప్రెసిడెంట్ బరాక్ ఒబామా. మన దేశానికొస్తే.. మహాత్మా గాంధీ, ప్రస్తుత ప్రధాని నరేంద్ర మోదీ, నటుడు అమితాబ్ బచ్చాన్, క్రికెట్ గాడ్ సచిన్ టెండూల్కర్, నిర్మాత కరణ్ జోహర్.. అబ్బో ఇలా చెప్పు కుంటూ పోతే లెఫ్ట్ హ్యాండ్ యూజర్ల లిస్ట్ పెద్దదే ఉంది. దీంతో ఎడమ చేతివాటం వాళ్లంతా తెలివిగలవాళ్లనే విషయం ప్రచారంలో ఉంది. అయితే కుడి చేతి వాటం వాళ్లతో పోలిస్తే లెఫ్టీస్లో ఐక్యూ లెవల్ నిజంగానే ఎక్కువగా ఉంటుంది. మాట్లాడే శక్తి, వేగం, సామర్ధ్యం, అర్థం చేసుకోగల శక్తిసామర్థ్యాలు, భావప్రకటనలో స్పష్టత వీరిలోనే బాగుంటాయని సైంటిస్టులు చెప్తున్నారు. మెదడులో కుడి, ఎడమ అర్ధభాగాలను అనుసంధానం చేసే ‘కార్పస్ కల్లోజమ్’ ఎడమ చేతివాళ్లలో ఎక్కువగా ఉంటుంది. వాళ్లలో బ్రెయిన్ చురుగ్గా, సమర్థవంతంగా పని చేయడానికి ఇదొక కారణమని వివరిస్తున్నారు. యాంబీడెక్సాట్రాస్ చేతి అలవాటును పెద్దయ్యాక కూడా కొందరు స్వచ్ఛందంగా మార్చుకుంటారు. ఆ అలవాటు చాలా మంచిదంటున్నారు వైద్యులు. దీని వల్ల ఎడమ బ్రెయిన్, కుడి బ్రెయిన్ల మధ్య సమన్వయం పెరుగుతుందని చెప్తున్నారు. మరింత చాకచక్యంగా తమ పనులను నిర్వహించుకోవడానికి వీలుంటుంది. రెండు చేతుల్ని సమానంగా, సునాయసంగా వినియోగించుకోగలుగుతారు. వీళ్లని ‘యాంబీడెక్సాట్రాస్’ అని పిలుస్తుంటారు. ప్రత్యేకంగా మార్కెట్ ‘లెఫ్టీస్’ కష్టాలు మాములుగా ఉండవు. నిత్యం ఉపయోగించే వస్తువులు అందుబాటులో ఉండవు. కొందరు ఆ సమస్యల్ని అధిగమించేందుకు ప్రయత్నిస్తున్నా.. అది పూర్తి స్థాయిలో ఉండడం లేదు. అందుకే లెఫ్టీస్ కోసం ప్రత్యేకంగా కొన్ని కంపెనీలు వెలిశాయి. అవి ప్రత్యేకంగా ఎడమ చేతి వాటం ఉన్న వాళ్లకి మాత్రమే వస్తువుల్ని అమ్ముతున్నాయి. కత్తెరలూ, కప్పులూ, పెన్నులూ, పెన్సిళ్లూ, నోటు పుస్తకాలూ... ఇంకా చాలా వస్తువుల్ని ఎడమ చేతివాటం వాళ్లకు అనుకూలంగా డిజైన్ చేస్తాయి ఆ కంపెనీలు. వంట గదిలో ఉపయోగించే కప్పులూ, గరిటెలూ, స్పూన్లు కూడా దొరుకుతాయి. పెన్నులు, వాచీలు, గిటార్లు ఇలా రకరకాల వస్తువులు అందుబాటులో ఉంటున్నాయి. ఇంకా కొన్ని.. చేతులకు ఉన్నట్లే.. కాళ్ల వాటం కూడా ఉంటుంది. కుడిచేతి వాటం ఉన్నవారిలో కుడికాలి వాడకం, ఎడమచేతి వాడకం ఉన్నవారిలో ఎడమ కాలి వాడకం ఎక్కువగా కనిపిస్తుంది. ఎడమ చేతి వాటం ఉన్నవాళ్లు ఏదైనా చూడాలంటే మొదట ఎడమ కన్నుతోనే చూస్తారు. అది అసంకల్పిత చర్య. జంతువులూ, పక్షులకు కూడా ఎడమ చేతివాటం ఉంటుంది. కాబట్టి కొన్ని పక్షులకు ఎడమవైపు రెక్కలు బలంగా ఉంటాయి. కుక్కలు, చింపాంజీలు, గుర్రాలు, తిమింగలాల్లో కూడా పిండదశలోనే జన్యుపరంగా ఎడమవాటం రూపుదిద్దుకుంటుంది. -సాక్షి, వెబ్‌డెస్క్ -
ఆ వాటమే తనకు అవకాశాలు తెచ్చిపెట్టింది: నట్టూ
చెన్నై: ఏదో ఒక ఫార్మాట్లో భారత జట్టుకు ప్రాతినిధ్యం వహించే అవకాశం లభిస్తే చాలనుకుంటున్న ప్రస్తుత పరిస్థితుల్లో, నెట్ బౌలర్‌గా ఎంపికై ఏకంగా మూడు క్రికెట్ ఫార్మాట్లలో టీమిండియాకు ప్రాతినిధ్యం వహించే లక్కీ ఛాన్స్‌ను కొట్టేశాడు ఈ సేలం కుర్రాడు. అంతే కాదు తన బౌలింగ్ ప్రతిభతో మూడు ఫార్మట్లలోనూ రాణించి టీమిండియాకు భవిష్యత్తు ఆశా కిరణంలా మారాడు. అతడే తమిళనాడుకు చెందిన టి నటరాజన్. ఎడమ చేతి ఫాస్ట్ బౌలర్ అయిన నట్టూ.. తాను ఎడమ చేతి వాటం బౌలర్‌ను కావడమే కలిసొచ్చిందని అంటున్నాడు. ప్రస్తుతం సీనియర్ జట్టుకు ప్రాతినిధ్యం వహిస్తున్న బౌలర్లలో ఎక్కువ మంది కుడి చేతి వాటం ఫాస్ట్ బౌలర్లు ఉన్నారని, ఎడమ చేతి వాటం బౌలర్‌ని కావడమే తనకు మూడు క్రికెట్ ఫార్మాట్లలో చోటు సంపాదించిపెట్టిందని నట్టూ పేర్కొన్నాడు. మూడు ఫార్మాట్లలో రాణించడానికి తాను ఎంతో కఠోరంగా శ్రమించానని, కేవలం శ్రమను మాత్రమే తాను నమ్ముతానని నట్టూ తెలిపాడు. నెట్స్‌లో తాను శ్రమించడాన్ని గుర్తించిన కోచ్, కెప్టెన్లు తన బౌలింగ్‌పై పూర్తి నమ్మకంతో తనకు మూడు ఫార్మట్లలో ఆడే అవకాశాన్ని కల్పించారన్నారు. అన్ని ఫార్మట్లలో తుది జట్టులోకి తన ఎంపిక మాత్రం కేవలం ఎడమ చేతి వాటం బౌలర్‌ను కావడం వల్లనే జరిగిందని నట్టూ చెప్పుకొచ్చాడు. కాగా, ఆసీస్ పర్యటనకు నట్టూ కేవలం నెట్ బౌలర్‌గా మాత్రమే ఎంపికయ్యాడు. జట్టు సభ్యులు ఒక్కొక్కరిగా గాయాల బారినపడటంతో అతనికి భారత జట్టులో స్థానం లభించింది. ఈ అవకాశాన్ని పూర్తిగా సద్వినియోగం చేసుకున్న నట్టూ..మూడు ఫార్మట్లలో తన స్థానాన్ని సుస్థిరం చేసుకున్నాడు. గబ్బాలో జరిగిన తన తొలి టెస్టు మ్యాచ్ తొలి ఇన్నింగ్స్‌లో లబూషేన్, మాథ్యూ వేడ్‌ల వికెట్లతో సహా మూడు వికెట్లు పడగొట్టి అందరి దృష్టిని ఆకర్శించాడు. తనను ఈ స్థాయికి తీసుకొచ్చిన సేలం క్రికెట్ అసోసియేషన్‌కు తానెంతో రుణపడి ఉన్నానని, భవిష్యత్తులో సేలం క్రికెట్ అసోసియేషన్ అభివృద్ధికి తనవంతు కృషి చేస్తానని నట్టూ హామీ ఇచ్చాడు. -
కుడి ఎడమైతే.. పొరపాటు లేదోయ్!
అవసరం.. దాని నుంచి వచ్చిన ఆలోచన.. కొత్త ఆవిష్కరణలకు దారితీస్తుంది. మిగతా విద్యార్థులకంటే తన కొడుకు ఎందుకు ఆలస్యంగా రాస్తున్నాడనే ఓ తండ్రి ఆవేదన.. ఆలోచన నుంచి వచ్చిందే ‘ది లెఫ్ట్ హ్యాండ్ షాప్’. ఏమిటి దీని ప్రత్యేకత పెన్నో, పెన్సిలో కావాలంటే ఏదైనా స్టేషనరీ దుకాణానికి వెళ్లి ఠక్కున కొనుక్కుంటాం. మరిఎడమ చేతివాటం ఉన్నవారికి..? వారు ఏ పని చేసినా ఎడమ చేతినే ఎక్కువగా ఉపయోగిస్తారు.. అలాంటివారికి అనువైన వస్తువులు చాలా అరుదుగా దొరుకుతాయి. మరి వారి పరిస్థితేంటి.. అడ్జస్ట్ అవాల్సిందేనా.. అవసరం లేదు ‘లెఫ్ట్‌హ్యాండ్’వస్తువులు కూడా ఆన్లైన్లో లభిస్తున్నాయి. లెఫ్ట్‌హ్యాండ్ పెన్, లెఫ్ట్‌హ్యాండ్ పెన్సిల్, లెఫ్ట్‌హ్యాండ్ కత్తెర, స్కేళ్లు ఇలా చాలా వస్తువులు సులువుగా ఆన్లైన్ వేదికగా కొనేసుకోవచ్చు. మొత్తం జనాభాలో 10 శాతం ఎడమచేతి వాటం ఉన్నవారున్నారని ఓ అంచనా. ఇప్పుడిప్పుడే వారికోసం స్టేషనరీ, ఇతర వస్తువులు తయారు చేస్తున్నారు. ఈ వస్తువులకు డిమాండ్ కూడా పెరుగుతోంది. విదేశీ వస్తువులే ఆన్లైన్ మార్కెట్లో ఎక్కువగా ఉండటంతో ధర ఎక్కువగా ఉంటోంది. దీంతో దేశీయంగా ఆయా వస్తువులు తయారు చేస్తున్నారు. ఏమిటి తేడా లెఫ్ట్‌హ్యాండ్ కత్తెరకు బ్లేడ్లు రివర్స్‌లో ఉంటాయి. పైన ఉండే బ్లేడ్ ఎప్పుడూ ఎడమచేతి వైపు ఉంటుంది. పెన్నును ప్రత్యేకంగా డిజైన్ చేశారు. పెన్కు ఉండే నిబ్ చివర రౌండ్‌గా ఉండి మధ్యలో కట్ అయి ఉంటుంది. దీని వల్ల ఇంక్ సులభంగా ఫ్లో అవుతూ రాయడానికి అనువుగా ఉంటుంది. అలాగే షార్ప్‌నర్‌లో పెన్సిల్‌ను ఉంచి అపసవ్వ దిశలో తిప్పాలి. 15 సెం.మీ, ఆరు ఇంచులు ఉన్న స్కేలులో సంఖ్యలు కుడి నుంచి ఎడమకు ఉంటాయి. ఇలా ప్రతీ వస్తువు ఎడమచేతి వాటానికి అనువుగా తయారు చేస్తున్నారు. ఎలా మొదలైంది పుణేకు చెందిన పవిత్తర్ సింగ్ స్కూల్లో మిగతా విద్యార్థులకంటే తన కొడుకు ఆలస్యంగా రాయడాన్ని గమనించాడు. పెన్సిల్‌తోనే కాదు పెన్తోనూ ఇలానే రాస్తున్నాడు. తన కొడుకుది ఎడమ చేతివాటం కాబట్లే ఇలా రాస్తున్నాడని అర్థం చేసుకున్నాడు. అంతే ఆ వస్తువుల కోసం ఆన్లైన్లో వెతికాడు. అయితే ధర ఎక్కువగా ఉంది. ఒక్కో పెన్ను రూ.1,500 , షార్ప్‌నర్ రూ.600 వరకు ధరలు ఉన్నాయి. దీంతో ఎడమచేతి వాటం వారు ఉపయోగించే వస్తువుల కోసం ఆయన‘ది లెఫ్ట్‌హ్యాండ్ షాప్’పేరుతో దేశంలోనే తొలికంపెనీ ప్రారంభించారు. ‘మై లెఫ్ట్’బ్రాండ్ పేరుతో స్కూల్ స్టేషనరీ, క్రికెట్‌కు సంబంధించిన వస్తువులను విక్రయించడం మొదలు పెట్టారు. రూ.99కే స్కూల్ స్టేషనరీ కిట్‌ను అందుబాటులోకి తెచ్చారు. ఆన్లైన్, సోషల్ మీడియా ద్వారా ఈ వస్తువులను విక్రయిస్తున్నారు. ఎడమ, కుడిచేతి వాటం కలిగిన ఇద్దరూ ఉపయోగించేలావస్తువుల తయారీపై తాజాగా దృష్టి పెట్టినట్లు సింగ్ తెలిపారు. ఫ్రాన్స్‌కు చెందిన ఓ కంపెనీ కూడా సింగ్‌తో ఒప్పందం కుదుర్చుకుంది. వాట్సాప్, ఫేస్‌బుక్‌ల ద్వారా ప్రచారం ఈ తరహా వస్తువులపై అవగాహన కలిగించేందుకు మహారాష్ట్రలో ఎడమ చేతి వాటం ఉన్న పిల్లల తల్లిదండ్రులు 160 మంది వరకు కలసివాట్సాప్ గ్రూప్ క్రియేట్ చేసుకున్నారు. ఫేస్బుక్ గ్రూప్‌లు, లెఫ్ట్ హ్యాండర్స్ క్లబ్‌లు ఏర్పాటు చేసుకుని వీటి గురించి విçస్తృతంగా అవగాహన కల్పించే ప్రయత్నం చేస్తున్నారు. -
ఓ తండ్రి ఆవేదన.. ‘ద లెఫ్ట్ హ్యాండ్ షాప్’
చెట్టు నుంచి యాపిల్ కిందకే ఎందుకు పడిందనే దగ్గర మొదలైన ఆలోచన గురుత్వాకర్షణ సిద్ధాంతాన్ని కనుగొనడానికి న్యూటన్‌కు ప్రేరణ అయింది. తన కొడుకు స్కూల్లో మిగతా విద్యార్థులకంటే ఎందుకు ఆలస్యంగా రాస్తున్నాడనే ఓ తండ్రి ఆవేదన కొత్త ఉత్పత్తుల అంకురార్పణకు దారి తీసింది. అదే ‘ద లెఫ్ట్ హ్యాండ్ షాప్’. ఏమిటి దీని ప్రత్యేకత మనకు స్టేషనరీ కావాలంటే షాష్‌కు వెళ్లి ఓ పెన్నో, పెన్సిలో, రబ్బరో, ఎరేజరో కొనుక్కుంటాం..అయితే మీకు ఎడమ చేతి వాటం ఉందా? ప్రతీ పనికి ఎక్కువగా మీరు ఎడమ చేతిని ఉపయోగిస్తారా? మన చేతికనుగుణంగా మనం సులభంగా ఆయా వస్తువులను వాడేందుకు వీలుగా ఇప్పుడు ‘లెఫ్ట్‌హ్యాండ్’ వస్తువులు ఆన్లైన్లో లభిస్తున్నాయి. లెప్ట్‌హ్యాండ్ పెన్, లెఫ్ట్‌హ్యాండ్ పెన్సిల్, లెఫ్ట్‌హ్యాండ్ సిజర్స్, స్కేళ్లు, ఏరేజర్స్, షార్ప్నర్స్...ఆన్లైన్లో కొనుక్కోవచ్చు. మొత్తం జనాభాలో పది శాతం ఎడమచేతి వాటం కలిగిన వారని ఓ అంచనా. అయితే మెజార్టీ కుడిచేతి వాటం కలిగిన వారే కావడంతో మనం ఉపయోగించే వస్తువులన్నీ కుడిచేతితో ఉపయోగించే విధంగానే తయారు చేస్తున్నారు. అయితే ఇప్పుడిప్పుడే ఎడమ చేతి వాటం కలిగిన వారు ఉపయోగించే విధంగా స్టేషనరీ, ఇతర వస్తువులు తయారు చేస్తున్నారు. ఆన్‌లైన్‌లోనూ ఈ వస్తువులకు డిమాండ్ పెరుగుతోంది. అయితే విదేశీ వస్తువులే ఆన్లైన్ మార్కెట్లో ఎక్కువగా ఉండడంతో ధర ఎక్కువగా ఉంటోంది. దీంతో దేశీయంగా ఆయా వస్తువులు తయారు చేస్తున్నారు. అవి కూడా ఇప్పుడు మార్కెట్లోకి అందుబాటులోకి రావడంతో తక్కువ ధరలకే దొరుకుతున్నాయి. ఏమిటి తేడా లెఫ్ట్‌హ్యాండ్ కత్తెరకు బ్లేడ్లు రివర్స్‌లో ఉంటాయి. పైన ఉండే బ్లేడ్ ఎప్పుడూ ఎడమ చేతి వైపు ఉంటుంది. దీని వల్ల కత్తిరించాలనుకున్న భాగాన్ని సులభంగా కట్ చేసే వీలవుతుంది. పెన్నును ప్రత్యేకంగా డిజైన్ చేశారు. పెన్కు ఉండే నిబ్ చివర రౌండ్‌గా ఉండి మధ్యలో కట్ అయి ఉంటుంది. దీని వల్ల ఇంక్ సులభంగా ఫ్లో అవుతూ రాయడానికి అనువుగా ఉంటుంది. అలాగే షార్ప్‌నర్‌లో పెన్సిల్‌ను ఉంచి అపసవ్వ దిశలో తిప్పాలి. 15 సెం.మీ, ఆరు ఇంచులు ఉన్న స్కేలులో సంఖ్యలు కుడి నుంచి ఎడమకు ఉంటాయి. ఇలా ప్రతీ వస్తువు వారి ఎడమ చేతి వాటానికి అనుకూలంగా ఉండేలా తయారు చేయబడ్డాయి. ఎలా మొదలైంది పూణేకు చెందిన పవిత్తర్ సింగ్ తన కొడుకు స్కూల్లో మిగతా విద్యార్థులకంటే ఆలస్యంగా రాయడాన్ని గమనించాడు. పెన్సిల్‌తోనే కాదు పెన్తోనూ ఇలానే రాస్తున్నాడు. దీనికి గల కారణాన్ని అతడు కనిపెట్టాడు. తన కొడుకుది ఎడమ చేతివాటం. అతడు వాడే వస్తువులన్నీ కుడిచేతి వాటం వాళ్లు రాయడానికి, వాడడానికి అనుకూలంగా ఉన్నాయి. దీంతో ఆ వస్తువుల కోసం ఆన్లైన్లో వెతక్కా అందుబాటులో ఉన్నా ధర ఎక్కువగా ఉంది. ఒక్కో పెన్ను రూ. 1500 , షార్ప్‌నర్ రూ. 600 వరకు «దరలు ఉన్నాయి. దీంతో ఎడమచేతి వాటం వారు ఉపయోగించే వస్తువుల కోసం సింగ్ ‘ ద లెఫ్ట్‌హ్యాండ్ షాప్’ పేరుతో దేశంలోనే మొట్టమొదటగా ఓ కంపెనీని ప్రారంభించారు..‘ మై లెఫ్ట్’ బ్రాండ్ పేరుతో స్కూల్ స్టేషనరీ, క్రికెట్‌కు సంబంధించిన వస్తువులను విక్రయించడం మొదలు పెట్టారు. రూ. 99కి స్కూల్ స్టేషనరీ కిట్‌ను అందుబాటులో తెచ్చారు. ఆన్లైన్, సోషల్ మీడియా ద్వారా ఈ వస్తువులను విక్రయిస్తున్నారు. ఎడమ, కుడిచేతి వాటం కలిగిన ఇద్దరూ ఉపయోగించే విధంగా వస్తువుల తయారీపై తాజాగా దృష్టి పెట్టినట్లు సింగ్ తెలిపారు. ఫ్రాన్స్‌కు చెందిన ఓ కంపెనీ కూడా సింగ్‌తో టై అప్ అయింది. అయితే పూర్తిస్థాయిలో మార్కెట్ ఇంకా విస్తరించాల్సి ఉందని చెబుతున్నారు. ఇతర దేశాల్లోనూ ఈ వస్తువులు అమ్మేందుకు ప్రత్యేక స్టోర్లు ఉన్నాయి. వాట్సాప్, ఫేస్‌బుక్‌ల ద్వారా ప్రచారం ఈ తరహా వస్తువులపై అవగాహన కల్గించేందుకు మహారాష్ట్రలో ఎడమ చేతి వాటం కల్గిన పిల్లల తల్లిదండ్రులు 160 మంది వరకు కలిసి ఓ వాట్సాప్ గ్రూప్‌నే క్రియేట్ చేసుకున్నారు. ఫేస్బుక్ గ్రూప్‌లు, లెఫ్ట్ హ్యాండర్స్ క్లబ్‌లు ఏర్పాటు చేసుకుని వీటి గురించి విస్త్రతంగా అవగాహన కల్పించే ప్రయత్నం చేస్తున్నారు. ‘ సాధారణ వస్తువులను వాడుతూ ఎంత ఇబ్బంది పడుతున్నారో మాకు తెలుసు అందుకే వీరికి అవగాహన కల్పించేందుకు సామాజిక మాధ్యమాలను ఉపయోగించుకుంటున్నామని పూణే వాసి ఒకరు తెలిపారు. -
నాస్తికత ఇలా కూడా వస్తుందా?
ఎడమచేతి వాటం ఉంటే తెలివిగల వారు అని చాలా మంది నమ్ముతారు. అయితే ఇప్పటి వరకు తెలియని విషయం ఏంటంటే ఎడమ చేతి వాటం ఉంటే నాస్తికులుగా మారే అవకాశం ఎక్కువని తాజా పరిశోధనల్లో తేలింది. జన్యుపరమైన మార్పుల కారణంగా ఎడమచేతి వాటం వస్తుందని, ఈ కారణం నాస్తిత్వానికి దారి తీస్తుందని గుర్తించారు. దేవుడిని నమ్మే వారిలోనూ కొన్ని జన్యుపరమైన ప్రభావాలు ఉంటాయని కూడా తేల్చారు. పారిశ్రామికంగా ప్రపంచం అభివృద్ధి చెందకముందు మానవుల్లో మత ప్రభావం అధికంగా ఉండేదని ఫిన్లాండ్లోని ఓలూ యూనివర్సిటీ పరిశోధకులు వివరిస్తున్నారు. మత నియమాలు పాటించడం వల్ల సత్ప్రవర్తన అలవడి మానసిక ఆరోగ్యం లభించడం వల్ల ఆధ్యాత్మికంగా చురుగ్గా ఉండేవారని పేర్కొన్నారు. దాదాపు 40 శాతం మందిలో జన్యుపరంగానే ఆధ్యాత్మిక అలవడుతుందని ఓ అధ్యయనంలో తేలింది. -
ఎడమచేతి వాటం ఉంటే అలా మారతారు!
లండన్: ఎడమచేతి వాటం కలిగిన వాళ్లు నాస్తికులుగా మారే అవకాశాలు ఎక్కువని తాజా పరిశోధనల్లో తేలింది. జన్యుపరమైన మార్పుల కారణంగా ఎడమచేతి వాటం అబ్బుతుందని, ఇదే నాస్తికత్వానికి దారి తీయవచ్చని గుర్తించారు. ఆస్తికుల్లోనూ కొన్ని జన్యుపరమైన ప్రభావాలు ఉంటాయని కూడా తేల్చారు. ప్రపంచం పారిశ్రామికంగా అభివృద్ధి చెందకముందు మనుషుల్లో మత ప్రభావం అధికంగా ఉండేదని ఫిన్లాండ్లోని ఓలూ యూనివర్సిటీ పరిశోధకులు పేర్కొన్నారు. మత నియమాలు పాటించడం వల్ల సత్ప్రవర్తన అలవడటం, మానసిక ఆరోగ్యం లభిస్తుంది కాబ ట్టే ప్రతి ఒక్కరూ ఆధ్యాత్మికంగా చురుగ్గా ఉండేవారని తెలిపారు. దాదాపు 40 శాతం మందిలో ఆధ్మాత్మిక జన్యుపరంగానే అలవడుతుందని ఇది వరకటి అధ్యయనాలు కూడా తేల్చాయి. -
మ్యాచ్ మజా మిస్సయితేనేం...
సాక్షి, హైదరాబాద్ : నిర్ణయాత్మక టీ-20 మ్యాచ్.. ఉప్పల్ మైదానం అనుకూలించకపోవటంతో రద్దు కావటంతో అభిమానులు తీవ్ర నిరాశ చెందారు. అయితే ఫ్యాన్స్ ను ఊరడించేందుకు టీమిండియా బ్యాట్స్ మెన్లు చేసిన ఓ పని మాత్రం అమితంగా ఆకట్టుకుంది. టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ, ధోనీ, రోహిత్ శర్మ, హర్దిక్ పాండ్యా కలిసి మైదానంలో సరదాగా ప్రాక్టీస్ చేశారు. మాములుగా చేస్తే ఏం కిక్కుంటుందో అనుకున్నారో ఏమో ఎడమ చేతి వాటంను ప్రదర్శించారు. సరదాగా ఎడమ చేతి బ్యాటింగ్‌తో కాసేపు అలరించారు. ముందు మైదానంలోకి దిగిన రోహిత్ శర్మ కాస్త తడబడినప్పటికీ.. తర్వాత వచ్చిన కోహ్లీ మాత్రం ఫర్వాలేదనిపించాడు. ఇక తర్వాత దిగిన హర్దిక్ బ్యాట్‌ను బాగానే ఝుళిపించాడు. అటుపై వచ్చిన ధోనీ కూడా కాస్త కష్టపడ్డాడు. మొత్తానికి నలుగురిలో పాండ్యానే బెటర్ ఫెర్ ఫార్మెన్స్ ఇచ్చాడన్న మాట. బీసీసీఐ తన అధికార ట్విట్టర్ లో ఆ ఫోటోలను పోస్ట్ చేసింది. ఇక పాపం కోహ్లీ ఎడమ చేతి వాటంను చూపించేస్తూ.. డీసెంట్ ప్రదర్శన అంటూ ఓ వీడియోను సోషల్ మీడియాలో వైరల్ చేస్తున్నారు. Some left handed batting practice for the Captain and vice-captain as we wait for a further update on the start of play #INDvAUS pic.twitter.com/pG82JVyZIP — BCCI (@BCCI) October 13, 2017 And @msdhoni joins the party #INDvAUS pic.twitter.com/slN7dJqIdr — BCCI (@BCCI) October 13, 2017 Decent shot that by a left handed @imVkohli ! pic.twitter.com/clMoX4M5SQ — Saurabh Malhotra (@MalhotraSaurabh) September 4, 2017 -
నేడు లెఫ్ట్ హ్యాండర్స్ డే
కుడి ఎడమైతే..పొరపాటు లేదోయ్.. జోగిపేట:చాలామంది కుడిచేత్తోనే పనిచేస్తారు. కానీ కొద్ది మందికి మాత్రం ఎడమ చేతి వాటం ఉంటుంది. చిన్నప్పటి నుంచే వారు ఎడమ చేత్తో పనిచేయడం అలవాటు. లెఫ్ట్ హ్యాండర్స్ తమ పనులన్నింటినీ ఎడమచేత్తోనే చేసుకుంటారు. ఇటువంటి వారిలో పలువురు ప్రముఖులు కూడా ఉన్నారు. వీరిలో ఆల్బర్ట్ ఐన్‌స్టీన్, అలెగ్జాండర్ ది గ్రేట్, అడాల్ఫ్ హిట్లర్, మార్లిన్ మన్రో, చార్లీ చాప్లిన్, వాజ్పాయ్, సౌరభ్‌గంగూలీ, యువరాజ్‌సింగ్ వంటి వారున్నారు. తొలి లెఫ్ట్ హ్యాండర్స్ డే 1976 ఆగస్టు 13న జరిగింది. లెఫ్ట్హ్యాండర్స్ను సౌత్ పాస్ అని అంటారు. వాళ్లు మనకెన్నో జోకులు చెప్తారు. వివిధ సందర్భాల్లో తమ మీద తాము లేదా వారి మీద ఇతరులు పేల్చిన చతురోక్తులు చెప్తారు. ఎదురయ్యే ఇబ్బందులు... సాధారణంగా రైట్హ్యాండర్స్ను దృష్టిలో పెట్టుకొని అన్ని వస్తువులు రూపుదిద్దుకుంటాయి. స్కూల్లో లైఫ్ట్ హ్యాండర్స్ కోసం ఏర్పాటైన డెస్కులు ఎప్పుడైనా చూశారా. ఇక అరుదుగా లభించే ఎడమచేతివాటంగా ఉండే వస్తువులు ఏవైనా చాలా ఖరీదుగా ఉంటాయి. ఇక బ్రాండెడ్ కాఫీ మగ్గులపై కుడిచేత్తో పట్టుకుంటేనే కనిపించేలా బొమ్మ లేదా అక్షరాలు ఉంటాయి. కత్తెరలు కుడిచేత్తో పట్టుకుంటే నే అనువుగా ఉంటాయి. కంప్యూటర్ మౌస్ కూడా అంతే.. కుడిచేత్తో పనిచేసేందుకు వీలుగా రూపొందింది. ఇలా దాదాపు అన్ని వస్తువులు రైట్హ్యాండర్ను దృష్టిలో ఉంచుకొని రూపుదిద్దుకున్నవే. బిడ్డ ఏ చేతి వాటంతో ఉంటే ఆ చేయి నోటికి దగ్గరగా పెట్టుకుంటుందని పలు పరిశోధనల్లో గుర్తించారు. ఇక ఎడమచేతివాటం ఏర్పడడానికి ఎల్ఆర్ఆర్ఎం-1 అనే జన్యువు కూడా కారణమవుతోందని మరో పరిశోధనలో వెల్లడైంది. చిన్నప్పటి నుంచే అలవాటైంది చిన్నప్పటి నుంచి ఎడమచేతితోనే రాయడం అలవాటైంది. కుడి చేతితో రాసేందుకు ప్రయత్నించినా రావడంలేదు. బోజనం మాత్రం కుడిచేతితోనే చేస్తాను. మొదట్లో తనను ఎడమచేతిని వినియోగించడంపై స్నేహితులు గేలి చేసేవారు. తర్వాత అలా అనడం మానేశారు. దినచర్యలో ఎక్కువగా ఎడమచేతికే ఎక్కువగా పనిచెబుతాను. మా ఇంట్లో ఎవ్వరికీ ఎడమ చేతి వాటం లేకున్నా నాకు రావడంపై మా ఇంట్లో వాళ్లు ఆశ్చర్యపోతుంటారు. ప్రస్తుతం తాను జోగిపేటలోని ఆక్స్ఫర్డ్ పబ్లిక్ స్కూల్లో 8వ తరగతి చదువుతున్నాను. - ఆకుల చండిక, విద్యార్థిని, జోగిపేట ఎడమచేతే అచ్చొచ్చింది తనకు ఎడమచేతే అచ్చొచ్చింది. తన జీవితం అన్ని విధాలు సాఫీగా సాగడానికి అదేకారణమని తాను భావిస్తున్నాను. బీహెచ్ఇఎల్ ఉద్యోగి తనకు జీవితభాగస్వామిగా లభించారు. తనకు తెలియకుండానే ఎక్కువగా ఎడమచేతిని వినియోగించడం అలవాటు చేసుకున్నాను. ప్రస్తుతం డిగ్రీ పూర్తి చేసి గృహిణిగా ఉంటున్నాను. చదువుకునే సమయంలో ఎడమచేతి విషయమై ఎవ్వరూ పట్టించుకోరు. కాని ఏదైనా ఫంక్షన్లకు, ఇతర కార్యక్రమాలకు వెళ్లినప్పుడు ఎడమచేతిని వినియోగిస్తే వింతగా చూస్తుంటారు. తన పెద్ద కుమారుడు ఆకాష్ కూడా ఎడమచేతి వాటం రావడం ఆశ్చర్యం కల్గించింది. ఎవరో ఏమంటున్నారో పట్టించుకోవద్దు మన పని మనం చేసుకోవాలి. - సంగీత, గృహిణి -
ఎడమచేతి వాటం అబ్బాయిలు మేధావులా?
మనిషికి హార్మోనల్ ప్రభావం వల్ల వచ్చేదే ఎడమచేతి వాటం. ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా పది శాతం జనాభా ఎడమచేతి వాటం వారే! ఎడమచేతి వాటం వారి మానసిక, శారీరక పరిస్థితులను కొన్ని సర్వేలు ఇటీవల వెలుగులోకి తెచ్చాయి. ప్రపంచ ఆరోగ్య సంస్థతో పాటు యు.కె.కి చెందిన రీసెర్చ్ సర్వే ఆన్ లెఫ్టీ వంటి సామాజిక పరిశోధన సంస్థలు వివిధ దేశాలలో చేసిన అధ్యయనాల ప్రకారం.. ఎడమచేతి వాటమున్న మహిళలతో పోలిస్తే మగాళ్ల సంఖ్య 50 శాతం ఎక్కువ. 11 శాతం మంది ఎడమచేతి వాటంవారిలో, తల్లిదండ్రులలో ఎవరో ఒకరు మాత్రం లెఫ్ట్ హ్యాండర్లు. కేవలం 1.4 శాతం మంది ఎడమచేతి వాటం వారి తల్లిదండ్రులిద్దరూ ఎడమచేతి వాటం వాళ్లే. మిగతావారికి మాత్రం జన్యు నేపథ్యం లేకుండానే ఎడమచేయి అలవాటుగా మారింది. ఎడమచేతి వాటాన్ని గుర్తించడానికి ప్రధానమైన ఆధారం రాత. లెఫ్ట్ హ్యాండర్స్‌లో 98 శాతంమంది ఎడమచేతితోనే రాస్తున్నారట. మిగతా పనుల్లో మాత్రం వీరు ఎడమచేతికి కొద్దిగా పని తగ్గిస్తున్నారట. టూత్‌బ్రష్, స్పూన్, కత్తెర, కత్తి వంటివి ఎడమ చేతితో ఉపయోగించే వారి శాతం 60 - 70 మధ్యలో ఉంది. మిగతా వారు మాత్రం ఈ పనులను కుడి చేత్తోనే చేసుకొంటున్నారు! ఎడమచేతి వాటం వారిలో ఆత్మవిశ్వాసం పాలు ఎక్కువేనట. 58 శాతం మంది లెఫ్ట్ హ్యాండర్స్ తాము మేధావులమని, ఇతరులకంటే తెలివైనవారమని చెప్పారట. 48 శాతంమంది ఇతరులతో పోల్చుకొన్నప్పుడు తమలో సృజనాత్మకత ఎక్కువ స్థాయి లో ఉందని, ఇతరులకంటే భిన్నంగా ఉన్నందున అందరూ తమను విచిత్రంగా చూశారని 71 శాతం లెఫ్ట్ హ్యాండర్స్ అన్నారట. అయితే తమ చేత కుడిచేత్తో రాయించాలని చాలామంది ప్రయత్నించారని లెఫ్ట్ హ్యాండర్స్ చెప్పారు. ఇక కంప్యూటర్ మౌస్ వంటివి ఎడమచేతి వాటం వారికి ప్రత్యేకంగా అందుబాటులోకి వచ్చాయి. అయితే కేవలం 38 శాతంమంది మాత్రమే వాటిని ఉపయోగిస్తున్నారని సర్వేలో పేర్కొన్నారు. 40 శాతంమంది లెఫ్ట్ హ్యాండర్స్ ‘ఆర్ట్’పై ఆసక్తిని చూపుతున్నారట. కొన్ని హారర్ సినిమాలను ఎడమచేతి, కుడి చేతి వాటాల వారికి ఒకేసారి చూపించగా... ఎడమచేతి వాటం వారిలో ఎక్కువ భీతి కనిపించిందని అధ్యయనకర్తలు అన్నారు. 17 శాతం మంది కవలలు ఎడమచేతి వాటంవారే! ఇక ఎడమచేతి వాటం అబ్బాయిలు గర్వించదగ్గ విషయాన్నొకటి చెప్పారు విశ్లేషకులు. ఏ పనికైనా ఎడమచేతిని ఉపయోగించే అబ్బాయిలంటే అమ్మాయిల్లో ఏదో ఆకర్షణ భావం కలుగుతుందని అధ్యయనకర్తలు పేర్కొన్నారు. -
నమ్మకం: ఎడమ చేయి ఏం పాపం చేసింది ?
Left hand ఎడమ చేతితో తినకూడదు, ఎడమ చేతితో ఎవరికీ ఏమీ ఇవ్వకూడదు, ఎడమ చేతితో పూజల వంటి పవిత్ర కార్యాలు చేయకూడదు... ఈ మాటలు మనం తరచుగా వింటూ ఉంటాం. కానీ ఎందుకు ఎడమ చేతితో అవన్నీ చేయకూడదు అని ఎప్పుడైనా ఆలోచించారా? అసలు కుడి కంటే ఎడమ ఎందులో తీసిపోతుంది? కుడి చేతికి ఉన్న ప్రాధాన్యత ఎడమ చేతికి ఎందుకు లేకుండా పోయింది? అసలిది నమ్మకమా... మూఢనమ్మకమా? దీని వెనుక చారి్రత్రక, మత సంబంధిత ఆధారాలు ఏవైనా ఉన్నాయా? ఎడమ చేతితో తినకూడదు అన్నదానికి పరిశుభ్రతే ప్రధాన కారణం. అయితే, ఎడమచేతితో ఎవరికీ ఏమీ ఇవ్వకూడదు అన్నదానికి పెద్ద కారణమే ఉంది. హిందూ మతం ప్రకారం... శరీరాన్ని రెండు భాగాలుగా విభజించారు. నాభి నుంచి శిరస్సు వరకూ ఉన్నదాన్ని పవిత్ర భాగమని, నాభి నుంచి పాదాల వరకూ అపవిత్ర భాగమనీ అంటారు. అలాగే నిలువుగా కూడా రెండు భాగాలుగా విభజించారు. ఎడమవైపు భాగాన్ని చంద్రభాగమని, కుడివైపు భాగాన్ని సూర్యభాగమనీ అంటారు. చంద్రుడు స్వయంప్రకాశకుడు కాని కారణంగా, అతడు ఎప్పుడూ పరిపూర్ణంగా కనిపించడు. కానీ సూర్యుడు ఎల్లప్పుడూ పరిపూర్ణంగా ఉంటాడు. ఎవరికైనా ఏదైనా ఇచ్చేటప్పుడు పూర్ణ మనసుతో ఇవ్వాలని అంటారు కాబట్టి, నిత్యం పరిపూర్ణుడుగా ఉండే సూర్యుడికి ప్రతిరూపమైన కుడిభాగాన్ని మాత్రమే ఉపయోగించాలని వేదాలు చెబుతున్నాయి. క్రైస్తవ మతంలో కూడా ‘ఎడమ’ను చెడుకు ఆపాదించడం కనిపిస్తుంది. దేవుడి రాజ్యం గురించి చెప్పేటప్పుడు పుణ్యాత్ములంతా దేవుడికి కుడివైపు, పాపం చేసినవాళ్లంతా ఎడమవైపు ఉన్నట్టుగా వర్ణించడం చూడొచ్చు. అందువల్లే ‘ఎడమ’కు ప్రాధాన్యత తక్కువైంది. గ్రీకులు, రోమన్లు ఎడమను చెడుగా చూసేవారని చరిత్ర చెబుతోంది. దుష్టశక్తులు ఎడమ వైపుగానే ఉంటాయని వాళ్లు నమ్మేవారట. ఎడమ భుజమ్మీదుగా చీకట్లోకి చూస్తే దెయ్యాలు కనిపిస్తాయని వాళ్లు విశ్వసించేవారట. ఆ నమ్మకం మెల్లగా చాలా దేశాలకు పాకిందని చెబుతారు పరిశోధకులు. దుష్టశక్తుల్ని పారద్రోలేందుకు గ్రీకులు, రోమన్లు ఎడమచేతి వేళ్లకి రకరకాల ఉంగరాలు ధరించేవారట. నవ దంపతుల మీద వాటి ప్రభావం పడకుండా ఉండేందుకే పెళ్లి సమయంలో ఎడమచేతికి ఉంగరం పెట్టించడం మొదలుపెట్టారని, అదే తర్వాత సంప్రదాయమైందనే వాదన కూడా ఉంది. ఇలాంటి వాటన్నిటిని బట్టే ‘ఎడమ’ను చిన్నచూపు చూడటం మొదలైంది. కానీ నిజానికి... ఎడమచేతి వాటం ఉన్నవాళ్లు అన్ని పనులూ ఆ చేత్తోనే చేస్తారు. అయినా వాళ్లేమీ నష్టపోవడం లేదు కదా! వాళ్లకు మంచే జరుగుతోంది కదా! మరి ‘ఎడమ’ అంత చెడ్డది ఎలా అయ్యింది? మొదట్లో రోమన్లు ఎడమ మంచిదని నమ్మేవారట. గ్రీకుల్ని చూశాక వారి అభిప్రాయం మారిందట. మంచం దిగేటప్పుడు ఎడమ కాలు ముందు పెడితే అరిష్ట మని కొందరు నమ్ముతారు. కెన్యాలోని మేరు తెగవారు ఎడమ మంచిదంటారు. ఎందు కంటే తమ దేవుడు తన ఎడమ చేతిలో దుష్టశక్తుల్ని బంధించి ఉంచాడని వాళ్లు నమ్ముతారు.