ఎడమచేతి వాటం ఉంటే తెలివిగల వారు అని చాలా మంది నమ్ముతారు. అయితే ఇప్పటి వరకు తెలియని విషయం ఏంటంటే ఎడమ చేతి వాటం ఉంటే నాస్తికులుగా మారే అవకాశం ఎక్కువని తాజా పరిశోధనల్లో తేలింది. జన్యుపరమైన మార్పుల కారణంగా ఎడమచేతి వాటం వస్తుందని, ఈ కారణం నాస్తిత్వానికి దారి తీస్తుందని గుర్తించారు.
దేవుడిని నమ్మే వారిలోనూ కొన్ని జన్యుపరమైన ప్రభావాలు ఉంటాయని కూడా తేల్చారు. పారిశ్రామికంగా ప్రపంచం అభివృద్ధి చెందకముందు మానవుల్లో మత ప్రభావం అధికంగా ఉండేదని ఫిన్‌లాండ్‌లోని ఓలూ యూనివర్సిటీ పరిశోధకులు వివరిస్తున్నారు. మత నియమాలు పాటించడం వల్ల సత్ప్రవర్తన అలవడి మానసిక ఆరోగ్యం లభించడం వల్ల ఆధ్యాత్మికంగా చురుగ్గా ఉండేవారని పేర్కొన్నారు. దాదాపు 40 శాతం మందిలో జన్యుపరంగానే ఆధ్యాత్మిక అలవడుతుందని ఓ అధ్యయనంలో తేలింది.
Comments
Please login to add a commentAdd a comment