
లండన్: ఎడమచేతి వాటం కలిగిన వాళ్లు నాస్తికులుగా మారే అవకాశాలు ఎక్కువని తాజా పరిశోధనల్లో తేలింది. జన్యుపరమైన మార్పుల కారణంగా ఎడమచేతి వాటం అబ్బుతుందని, ఇదే నాస్తికత్వానికి దారి తీయవచ్చని గుర్తించారు. ఆస్తికుల్లోనూ కొన్ని జన్యుపరమైన ప్రభావాలు ఉంటాయని కూడా తేల్చారు. ప్రపంచం పారిశ్రామికంగా అభివృద్ధి చెందకముందు మనుషుల్లో మత ప్రభావం అధికంగా ఉండేదని ఫిన్లాండ్‌లోని ఓలూ యూనివర్సిటీ పరిశోధకులు పేర్కొన్నారు. మత నియమాలు పాటించడం వల్ల సత్ప్రవర్తన అలవడటం, మానసిక ఆరోగ్యం లభిస్తుంది కాబ ట్టే ప్రతి ఒక్కరూ ఆధ్యాత్మికంగా చురుగ్గా ఉండేవారని తెలిపారు. దాదాపు 40 శాతం మందిలో ఆధ్మాత్మిక జన్యుపరంగానే అలవడుతుందని ఇది వరకటి అధ్యయనాలు కూడా తేల్చాయి.