Atheism
-
కమల్.. నాస్తికత్వంతో ఎలా?
సాక్షి, చెన్నై : రాజకీయ అరంగ్రేటంపై ఊరిస్తూ వచ్చిన లోకనాయకుడు ‘మక్కళ్ నీది మయ్యం’ పేరిట పార్టీని ప్రకటించి దేశవ్యాప్తంగా అందరి దృష్టిని తనవైపు తిప్పుకున్నాడు. పార్టీ విధివిధానాల్లో వైవిధ్యత ఉంటుందని చెబుతున్నప్పటికీ.. అది ఎంతవరకు ఆచరణ సాధ్యమో తెలియాలంటే మరింత సమయం పట్టే అవకాశం ఉంది. అయితే ఈ క్రమంలో ద్రవిడ భావజాలాన్ని తన పార్టీ అనుసరించే తీరుతుందన్న సంకేతాలను ఆయన అందించారు. గతాన్ని ఓసారి పరిశీలిస్తే... ద్రవిడ పార్టీలకు ప్రధాన పునాది నాస్తికత్వం. మతం, ఆధ్యాత్మికతను తీవ్రంగా వ్యతిరేకం. బ్రాహ్మణ వాదానికి వ్యతిరేకంగా, కుల వివక్షపై పోరాటం దిశగా అవి పుట్టుకొచ్చాయి. అయితే ఆ క్రమంలో పార్టీలు (డీఎంకే తప్ప) తమిళ రాజకీయాల్లో పెద్దగా రాణించిన దాఖలాలు లేవు. డీకే(ద్రవిడ కగళమ్)ను ఇందుకు ఉదాహరణగా విశ్లేషకులు చూపిస్తుంటారు. డీఎంకే నుంచి అన్నాడీఎంకే ఏర్పడ్డాక ఎంజీఆర్ కొంత ఉదారంగా వ్యవహరించటం మొదలుపెట్టారు. స్వతహాగా దేవుడ్ని నమ్మే ఆయన.. రహస్యంగా ఆయన దేవాలయాలను సందర్శించేవారన్న వార్త బయటకు పొక్కటం.. ఆయన వ్యవహార శైలిపై విమర్శలు వచ్చాయి. పదేళ్ల క్రితం ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో కరుణానిధి శ్రీపురం స్వర్ణ దేవాలయం సందర్శించుకోవటం తీవ్ర విమర్శలకు దారితీసింది. నటుడి నుంచి రాజకీయ నాయకుడిగా ఎదిగే క్రమంలో శివాజీ గణేశన్‌కు ఇలాంటి సమస్యే ఎదురైంది. అస్థికుడు అయినప్పటికీ తొలినాళ్లలో ఆయన డీఎంకే మద్ధతుదారుడిగా ఉన్నారు. ఓసారి తిరుమలకు వెళ్లి దేవుడ్ని దర్శించుకోగా.. డీఎంకే ఆయనను తీవ్రంగా మందలించింది. తర్వాత కాంగ్రెస్‌పార్టీలో చేరి రాజ్యసభ సభ్యుడిగా ఎన్నిక కావటం, 1987లో ‘తమిళ మున్నేట్ర మున్నాని’ పార్టీ స్థాపన, ప్రత్యర్థుల దెబ్బకు అది మనుగడ కొనసాగించలేకపోవటం.. ఇలా అస్తికత్వం మూలంగానే ఆయన విఫలం అయ్యారని చెబుతుంటారు. మరి అలాంటప్పుడు ఆధ్యాత్మిక పాలన నినాదంతో రాజకీయాల్లోకి వస్తున్న రజనీకాంత్ ఎలా రాణిస్తాడో? జయ విషయంలో మాత్రం ... ఇక జయలలిత అయితే మొదటిసారి అధికారం చేపట్టగానే ద్రవిడ సిద్ధాంతాలకు, దాని భావజాలానికి కాస్త దూరంగా ఉన్నారు. దేవాలయాలకు విరాళాలు ఇచ్చారు. దేవుడి సాక్షిగా ప్రమాణం చేశారు. అలాగని ఆమె పూర్తిగా ఆ సిద్ధాంతాన్ని విస్మరించలేదు. దీంతో ఆమె ద్వంద్వ వైఖరిపైనా ద్రవిడ భావజాల పార్టీలు విమర్శలు గుప్పించేవి. కానీ, ప్రజలను ఆకర్షించడమే ధ్యేయంగా పెట్టుకున్న జయలలిత అనేక జనాకర్షక పథకాలు రూపొందించి విజయవంతం అయ్యారు. కాలక్రమేణా ఇప్పుడున్న పరిస్థితుల్లో సిద్ధాంతాల కన్నా.. జనాకర్షణ మీదే ప్రధాన దృష్టి ఆకర్షించాల్సి ఉంటుంది. ఆర్కే నగర్ ఉప ఎన్నికల్లో దినకరన్ గెలుపునకు ఎన్ని కారణాలు ఉన్నా.. ప్రజల్లో దినకరన్ పై సానుభూతి ఒకటి నెలకొందన్న విషయం అర్థమైంది. ఆ క్రమంలో నటుడిగా ఛరిష్మా ఉన్న కమల్ రాజకీయాల్లో సమతుల్యత పాటించాల్సి ఉంటుంది. అలాకానీ పక్షంలో రాజకీయ చదరంగంలో మరో ఫెయిల్యూర్ స్టార్‌గా కమల్ మిగిలిపోవాల్సి వస్తుందన్న అభిప్రాయాన్ని విశ్లేషకులు వ్యక్తం చేస్తున్నారు. -
ఎడమచేతి వాటం ఉంటే అలా మారతారు!
లండన్: ఎడమచేతి వాటం కలిగిన వాళ్లు నాస్తికులుగా మారే అవకాశాలు ఎక్కువని తాజా పరిశోధనల్లో తేలింది. జన్యుపరమైన మార్పుల కారణంగా ఎడమచేతి వాటం అబ్బుతుందని, ఇదే నాస్తికత్వానికి దారి తీయవచ్చని గుర్తించారు. ఆస్తికుల్లోనూ కొన్ని జన్యుపరమైన ప్రభావాలు ఉంటాయని కూడా తేల్చారు. ప్రపంచం పారిశ్రామికంగా అభివృద్ధి చెందకముందు మనుషుల్లో మత ప్రభావం అధికంగా ఉండేదని ఫిన్లాండ్లోని ఓలూ యూనివర్సిటీ పరిశోధకులు పేర్కొన్నారు. మత నియమాలు పాటించడం వల్ల సత్ప్రవర్తన అలవడటం, మానసిక ఆరోగ్యం లభిస్తుంది కాబ ట్టే ప్రతి ఒక్కరూ ఆధ్యాత్మికంగా చురుగ్గా ఉండేవారని తెలిపారు. దాదాపు 40 శాతం మందిలో ఆధ్మాత్మిక జన్యుపరంగానే అలవడుతుందని ఇది వరకటి అధ్యయనాలు కూడా తేల్చాయి. -
నాస్తికుడి మెదడులో తిరునామం తిష్టవేస్తే?!
అక్షర తూణీరం ఆనాడు గాంధీజీ మెదడులో నెహ్రూ నిలువెత్తు కాలుష్యం. పటేల్ తొలి ప్రధాని అయితే మన కథ వేరేలా ఉండేదని మేధావులు అంటూ ఉంటారు. ధృతరాష్ర్టుడికి దుర్యో ధనుడు, ద్రోణుడికి అర్జునుడు, కృష్ణుడికి శకుని అబ్సెషన్స్ అయి, అవే కాలుష్యాలై ఇతిహాసాన్ని కొత్త మలుపు తిప్పాయి. చివరగా మన రాష్ట్రపతికున్న కాంగిరేసుపై వీరాభిమానం వదిలించాల్సిన కాలుష్యం కాదా? భారత రాష్ట్రపతి, ఔను! మన రాష్ట్రపతి ఇటీవల ఒక మంచి మాట అన్నారు. స్వచ్ఛ భారత్ కార్య క్రమంలో మన చుట్టూ చేరిన చెత్తాచెదారం తోపాటు, మన మెదళ్లలో పేరుకుపోయిన మాలిన్యాలను తక్షణం తొలగించుకోవాల న్నారు. ఇది నిజంగా గొప్ప సందేశమే. బుద్ధుడికి బోధి వృక్షం నీడలో జ్ఞానోదయం కాగానే దాదాపు ఇలాంటి ప్రకటనే చేశాడు. నువ్వు నిర్మలంగా ఉంటే లోకమంతా నిర్మలంగా ఉంటుందని పాళీ భాషలో అన్నాడు. మెదడులో మట్టి చేరడం వేరు. కాలుష్యాలు చేరడం వేరు. మట్టిబుర్ర పనిచేతలో మంద కొడిగా ఉంటుంది. కాలు ష్యాలు పేరుకుపోయిన బుర్ర లోపలి రసాయనిక చర్యలను బట్టి అక్రమంగా ప్రవర్తిస్తూ ఉంటుంది. అసలు కల్తీ, కాలుష్యం, వ్యర్థం అనేవి సాపేక్షకాలు. బొగ్గు పులుసు వాయువు మనకు వ్యర్థం. చెట్లకు అదే బతుకు. ప్రధాని నరేంద్ర మోదీ మెదడులో హిందూత్వ మహాలింగం తిష్టవేయడం, మతాతీత లౌకిక రాజ్యాధినేతకది కాలుష్యమే. శివసేనరులకు, తొగాడియాలకు రుద్రాక్షలు మెదళ్లలో కొలువై ఉంటాయి. రుద్రాక్ష పవిత్రమైనదే గాని, ఇక్కడ కాలుష్యం హానికరం. బ్రెయిన్లో కూడా రెండు మూడు హానికరం. వెంకయ్య బ్రెయిన్లో కూడా రెండు మూడు చెంచాల కాలుష్యాలు లేకుండా ఉండవు. అందులో ఒక చెంచా లాల్ కృష్ణ అద్వాణీ. లోహ్ పురుష్‌గా కీర్తించి మరీ నెత్తిన పెట్టుకున్నారు వెంకయ్య. తలమీంచి తలలోకి దూరారాయన. సుష్మాస్వరాజ్ మెదడుని కూడా సంపూర్ణంగా క్షాళన చెయ్యాల్సి ఉందని విశ్లేషకులు భావిస్తున్నారు. లోపల ఏమేమి పేరుకుపోయి ఉన్నాయో తెలియదు. అద్వాణీ బుర్రంతా వ్యర్థాలతో నిండిపోయి ఉందట. అయితే, ఆయన ప్రస్తుతం రాజకీయ రాజవీధిలో లేరు కాబట్టి ఏమీ పర్వాలేదం టున్నారు. కొందరి మెదళ్లలో బొగ్గునుసి చేరిపోయిం దట. మరికొందరిలో సెల్‌టవర్స్ విస్తరించే ధ్వని తరంగాల రజను చేరిందట. ఆంధ్ర పెద్దల బ్రెయిన్స్‌ని స్కాన్ చేస్తే, ఇసుక కుప్పలు తెప్పలుగా కనిపిస్తోందట. లాలూజీ తలమీదికి ‘‘గామా కిరణాలు’’ పంపితే, చిట్టు తవుడు మాత్రమే కనిపిస్తాయి. గొప్పదే అయినా తేనెలో విస్కీ కలవడం కాలుష్యమే. బియ్యంలో గోధుమలు కలిసినా, నీళ్లలో పాలు కలిసినా కాలుష్యమే. ఇదొక పెద్ద సాపేక్ష సిద్ధాంతం. అసలు ఐన్‌స్టీన్ బ్రెయిన్లో పుట్టిన థియరీ ఆఫ్ రెలిటివిటీ ఒక కాలుష్యం. అది ఏ జాతికి చెందిన కాలుష్యమో ఎవ్వరూ నిర్వచించలేకపోతున్నారు. నాస్తికుడి మెదడులో తిరునామం తిష్టవేస్తే అది కొంపలు మునిగేంత కాలుష్యం. ఆస్తికుడు హేతువాదిలా ఆలోచించడం మొదలుపెడితే ఆ బుర్రకి పుచ్చుపట్టినట్టు లెక్క. మనిషి బుర్రకి చెదపడుతుంది. పుచ్చుపడుతుంది. కొన్నిసార్లు బుర్రకి బొజ్జ వస్తుంది. అప్పుడు ఆలోచనలు మందగిస్తాయి. ఈ స్వచ్ఛ విశ్వాసానికి నాంది పలికినవాడు మహాశివుడు. హాలాహలాన్ని గొంతులో పెట్టుకున్నాడు. ఆనాడు గాంధీజీ మెదడులో నెహ్రూ నిలువెత్తు కాలుష్యం. పటేల్ తొలి ప్రధాని అయితే మన కథ వేరేలా ఉండేదని మేధావులు అంటూ ఉంటారు. ధృతరాష్ర్టుడికి దుర్యో ధనుడు, ద్రోణుడికి అర్జునుడు, కృష్ణుడికి శకుని అబ్సెషన్స్ అయి, అవే కాలుష్యాలై ఇతిహాసాన్ని కొత్త మలుపు తిప్పాయి. చివరగా మన రాష్ట్రపతికున్న కాంగిరేసుపై వీరాభిమానం వదిలించాల్సిన కాలుష్యం కాదా? - శ్రీరమణ (వ్యాసకర్త ప్రముఖ కథకుడు)