వెస్ట్ జోన్ జట్టులో అర్జున్ టెండూల్కర్
వడోదర:ఇంటర్ జోనల్ టోర్నమెంట్లో భాగంగా అండర్ -16 వెస్ట్ జోన్ జట్టుకు మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ కుమారుడు అర్జున్ టెండూల్కర్ ఎంపికయ్యాడు. ఈ మేరకు సోమవారం ఆలిండియా జూనియర్ సెలక్షన్ కమిటీ చైర్మన్ రాకేష్ పారిక్ నేతృత్వంలో సెలక్టర్లు అర్జున్ కు అవకాశం కల్పించారు. వెస్ట్ జోన్ జట్టుకు ఓఎమ్ భోసాలే కెప్టెన్ గా వ్యవహరించనున్నాడు.
అండర్-16 వెస్ట్ జోన్ జట్టు: ఓఎమ్ భోసాలే(కెప్టెన్), వాసుదేవ్ పాటిల్, సువేద్ పార్కర్, స్మిత్ పటేల్, సన్ ప్రీత్ బగ్గా, యస్వి జైశ్వాల్, దైవాంశ్ సక్సెనా, నీల్ జాదవ్, అర్జన్ టెండూల్కర్, యోగేష్ దోంగ్రే, అంకోల్కర్, సురజ్ సుర్యాల్, సిద్దార్త్ దేశాయ్, అకాశ్ పాండే, ముకుంద సర్దార్