under 16
-
న్యూస్ మేకర్: జీవితం ఆమెతో ఫుట్‌బాల్ ఆడింది
మొన్న ఫుట్‌బాల్ వరల్డ్ కప్‌లో మన పురుషుల టీం కనిపించిందా? పురుషుల టీమ్‌ను తయారు చేసుకోలేని మనం స్త్రీల టీమ్‌ను మాత్రం ఏం పట్టించుకుంటాం? అసలు ఫుట్‌బాల్ ఆడే అమ్మాయిలకు మన దేశంలో ఏం మర్యాద, ప్రోత్సాహం ఉన్నాయి? కోల్కటా ఫుట్‌బాల్ క్రీడాకారిణి పౌలమి అధికారి ఒకప్పుడు దేశ జట్టులో ఆడింది. ఇప్పుడు? జరుగుబాటు కోసం జొమాటో డెలివరి గర్ల్‌గా పని చేస్తోంది. గత రెండు మూడు రోజులుగా ఈమె జీవిత అవస్థ గురించి సోషల్ మీడియాలో, మీడియాలో ఆవేదన వ్యక్తం అవుతోంది. జొమాటో అని రాసి ఉన్న ఎర్రటి టీ షర్ట్ తొడుక్కుని కోల్కటాలో సైకిల్ మీద ఫుడ్ డెలివరీ చేస్తున్న 24 ఏళ్ల పౌలమి అధికారి ఒక ఫుట్‌బాల్ క్రీడాకారిణి అని ఎవరూ ఊహించరు. గత కొంతకాలంగా ఇల్లు గడవడానికి పౌలమి ఫుడ్ డెలివరీ చేస్తోంది. కోల్కటాకే చెందిన సంజుక్త చౌధురి అని ట్విటర్ యూజర్ పౌలమి గురించి చిన్న వీడియో తీసి ట్విటర్లో ఉంచడంతో గత రెండు మూడు రోజుల్లోనే చాలా రెస్పాన్స్‌లు వచ్చాయి. విస్తృతంగా కామెంట్స్ కూడా వచ్చాయి. ఒక ఫుట్‌బాల్ క్రీడాకారిణి నిస్సహాయ స్థితిలో ఉండటం ఏ మాత్రం సరికాదనే అభిప్రాయాలు వెల్లడయ్యాయి. అబ్బాయి అనుకునేవారు కోల్‌కటాలోని బెహలా ప్రాంతంలో నివసించే పౌలమి బాల్యంలోనే తల్లిని కోల్పోయింది. తండ్రి టాక్సీ డ్రైవర్‌గా పని చేస్తుంటే మేనత్త పెంచి పెద్ద చేసింది. చిన్నప్పటి నుంచే పౌలమి ఫుట్‌బాల్ ఆడేది. అయితే అబ్బాయిలాగా కనిపించే పౌలమిని చూసి అందరూ అబ్బాయి అనుకుని ఆడించేవారు. ‘ఆ తర్వాత నేను అమ్మాయి అని తెలిశాక ఆటలో రానివ్వలేదు. అమ్మాయిలు ఫుట్‌బాల్ ఆడితే వారికి ఏ మర్యాద లేదు. నేను ఫుట్‌బాల్ మానేసి కొన్నాళ్లు హాకీ ఆడాను. అయితే మా ప్రాంతంలోని అనిత సర్కార్ అనే ఫుట్‌బాల్ కోచ్ నన్ను చూసి ఫుట్‌బాల్‌లో ట్రయినింగ్ ఇచ్చింది. నేను మంచి ప్లేయర్‌ని అయ్యాను’ అంటుంది పౌలమి. పదిహేను ఏళ్లు వచ్చేసరికే పౌలమి మంచి ఫుట్‌బాల్ క్రీడాకారిణి అయ్యింది. దేశం తరఫున అండర్ 16 జట్టుకు ఎంపికయ్యి 2013లో జరిగిన అండర్ 16 ఛాంపియన్షిప్ కోసం శ్రీలంక వెళ్లి ఆడింది. అయితే ఆ సమయంలో తగిలిన గాయాల నుంచి కోలుకోవడం కష్టమైంది. ఇంటివాళ్లుగాని, క్రీడా సంస్థలుగాని సరైన వైద్యం, ఫిట్నెస్ ట్రయినింగ్ ఇప్పించకపోవడంతో వెనుకబడింది. మళ్లీ కోలుకుని 2016లో జరిగిన స్ట్రీట్ ‘హోమ్‌లెస్ ఫుట్‌బాల్ వరల్డ్‌కప్’ కోసం దేశం తరఫున గ్లాస్గో వెళ్లి ఆడింది. ఆ తర్వాత కూడా ఆమెకు ఫుట్‌బాల్ అసోసియేషన్ నుంచి ఎటువంటి మద్దతు, ప్రోత్సాహం లభించలేదు. వెంటాడిన పేదరికం 2017లో తండ్రి చేస్తున్న డ్రైవర్ ఉద్యోగం పోయింది. ఇంకో చెల్లెలు, తను తప్ప సంపాదనకు ఎవరూ లేరు. 2019 నాటికి బతకడం దుర్భరమైంది. ‘అప్పుడే నేను జొమాటోలో చేరారు. ఆ రోజుల్లో రోజుకు 500 సంపాదించేదాన్ని. లాక్డౌన్ ఎత్తేశాక చాలామంది ఈ ఉద్యోగంలోకి వచ్చారు. ఆర్డర్లు తక్కువ. పైగా నాకు సైకిల్ తప్ప బండి లేదు. దాంతో దగ్గరి ఆర్డర్లే తీసుకుంటాను. అందువల్ల రోజుకు 400 వస్తాయి. ఒక్కో ఆర్డర్ మీద 20 లేదా 30 రూపాయలు వస్తాయి. ఒక్కోసారి రోజుకు 300 రూపాయలకు మించి రావు. నాకు వేరే దారి లేదు... ఈ పని తప్ప’ అంది పౌలమి. రోజుకు 12 గంటలు పని చేస్తూ కూడా ఒక్కోసారి ఫుట్‌బాల్‌ను సాధన చేస్తుంటుంది పౌలమి. బి.ఏ ఫైనల్ ఇయర్ చదువుతున్నదిగాని అది కూడా నత్తనడకన సాగుతున్నది. వెల్లువెత్తిన స్పందన పౌలమి కథనానికి స్పందన వెల్లువెత్తింది. దేశంలో ఫుట్‌బాల్ క్రీడాకారుల స్థితి ఆ మాటకొస్తే ఏ కొద్ది మందో తప్ప అందరు క్రీడాకారుల స్థితి ఇలాగే ఉందనే స్పందన వచ్చింది. ఫుట్‌బాల్ ఆటను ఇలా నిర్లక్ష్యం చేయడం వల్ల ఇన్ని కోట్ల మంది భారతీయులు ఉన్నా పురుషులలోగాని, స్త్రీలలోగాని ప్రపంచ దేశాలతో తలపడే మెరుగైన టీమ్‌లు తయారు కావడం లేదనే విమర్శలు వచ్చాయి. ‘నాకు ఇప్పుడు కుదురైన ఉద్యోగం, ప్రాక్టీసు చేయడానికి మంచి స్పైక్స్ కావాలి’ అంటున్న పౌలమిలాంటి వారిని ఆ స్థితిలో ఉంచడం విషాదం. ఇప్పుడు వచ్చిన స్పందనతో ఆమెకు ఎలాంటి సహాయం అందుతుందో చూడాలి. -
ప్రపంచకప్ బెర్త్ గల్లంతు
కౌలాలంపూర్: ‘ఫిఫా’ అండర్–17 ప్రపంచ కప్ బెర్త్ సాధించాలంటే తప్పక గెలవాల్సిన మ్యాచ్‌లో భారత్‌కు నిరాశే ఎదురైంది. ఆసియా ఫుట్‌బాల్ కాన్ఫెడరేషన్ (ఏఎఫ్సీ) అండర్–16 చాంపియన్‌షిప్‌లో భాగంగా సోమవారం జరిగిన క్వార్టర్ ఫైనల్ మ్యాచ్‌లో భారత్ 0–1తో కొరియా చేతిలో పరాజయం పాలైంది. ఈ ఓటమితో యువ భారత్ ప్రపంచకప్‌లో పాల్గొనే గొప్ప అవకాశాన్ని చేజార్చుకుంది. ఇందులో సెమీస్ చేరిన జట్లకు పెరూ వేదికగా 2019లో జరుగనున్న అండర్–17 ప్రపంచకప్ టోర్నీకి అర్హత లభిస్తుంది. 2017లో భారత్ వేదికగా జరిగిన ఫిఫా అండర్–17 ప్రపంచకప్‌లో టీమిండియాకు ఆతిథ్య హోదాలో ఈ మెగా టోర్నీలో తొలిసారి పాల్గొనే అవకాశం దక్కింది. ఈ సారి క్వాలిఫయింగ్ టోర్నీ ద్వారా అర్హత సాధించాల్సిన స్థితిలో భారత్ విఫలమైంది. ఆకట్టుకున్న నీరజ్... 16 ఏళ్ల తర్వాత ఈ టోర్నీలో క్వార్టర్స్ ఆడుతున్న యువభారత్... టైటిల్ ఫేవరెట్లలో ఒకటిగా బరిలోకి దిగిన కొరియాపై తుదికంటా పోరాడింది. మ్యాచ్‌లో నమోదైన ఏకైక గోల్‌ను ఆట 67వ నిమిషంలో జియాంగ్ సాంగ్బిన్ (కొరియా) సాధించాడు. ఈ మ్యాచ్‌లో గోల్‌కీపర్ నీరజ్ అడ్డుగోడలా నిలిచి కొరియన్ల సహనాన్ని పరీక్షించాడు. ఆట 14వ నిమిషంలోనే ప్రత్యర్థి గోల్‌ను అడ్డుకున్న నీరజ్... ఆట 34వ నిమిషంలో, 36వ నిమిషంలో కొరియన్లు చేసిన మెరుపు దాడులను సమర్ధవంతంగా ఎదుర్కొని వారిని నిలువరించాడు. కొద్ది క్షణాల్లో తొలి అర్ధభాగం ముగుస్తుందనగా రవిరాణా షాట్‌ను కొరియన్లు అడ్డుకోవడంతో గోల్ లేకుండానే భారత్ విరామానికెళ్లింది. రెండో అర్ధభాగంలోనూ దూకుడు పెంచిన భారత్ 52వ నిమిషంలో గోల్ చేసినంత పని చేసింది. భారత ఆటగాడు రిడ్గే డి మెలోస్ వ్యాలీని ప్రత్యర్థి రక్షణశ్రేణి అడ్డుకుంది. 2002లోనూ భారత్ 1–3తో కొరియా చేతిలోనే ఓటమి పాలైంది. -
అనంతపురం, కర్నూలు జట్ల విజయం
అనంతపురం న్యూసిటీ : ఏఎస్ఏ అండర్ –16 అంతర్ జిల్లాల పోటీల్లో అనంతపురం, కర్నూలు జట్లు ప్రత్యర్థి జట్లపై గెలుపొందాయి. ఆదివారం అనంతపురం క్రికెట్ స్టేడియంలో కర్నూలు, వైఎస్సార్‌జిల్లా, అనంతపురం, నెల్లూరు జట్ల మధ్య మ్యాచ్‌లు జరిగాయి. అనంతపురంతో జరిగిన మ్యాచ్‌లో నెల్లూరు జట్టు 25 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి 117 పరుగులు చేసింది. జట్టులో సింధూజ 58, అనూష 28 పరుగులు చేసింది. అనంతపురం జట్టు 23.5 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించింది. జట్టులో పల్లవి 34, అనూష 29 పరుగులు చేశారు. దీంతో అనంతపురం జట్టు 5 వికెట్ల తేడాతో నెల్లూరుపై నెగ్గింది. కడప జట్టు బోల్తా.. లక్ష్య ఛేదనలో కడప జట్టు బోల్తాపడింది. తొలుత బ్యాటింగ్ చేసిన కర్నూలు జట్టు నిర్ణీత 25 ఓవర్లలో 147 పరుగులకు ఆలౌట్ అయ్యింది. జట్టులో అనూష 40, సుప్రజ 29 పరుగులు చేశారు. కడప బౌలర్ జ్యోతిక 3/19 వికెట్లు తీసుకున్నారు. 148 పరుగుల విజయలక్ష్యంతో బరిలో దిగిన కడప జట్టు నిర్ణీత ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి 117 పరుగులు మాత్రమే చేసింది. జట్టులో ఓబుళమ్మ 60 పరుగులు చేసింది. కర్నూలు బౌలర్లలో అరుణ, సుప్రజ చెరి రెండు వికెట్లు తీసుకున్నారు. -
నేటి నుంచి అండర్–16 మహిళ క్రికెట్ పోటీలు
అనంతపురం సప్తగిరి సర్కిల్ : ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నిర్వహించే అండర్–16 అంతర్ జిల్లాల క్రికెట్ పోటీలను ఆదివారం నుంచి నిర్వహిస్తున్నట్లు క్రికెట్ సంఘం జిల్లా కార్యదర్శి కేఎస్ షాహబుద్దీన్ తెలిపారు. జిల్లా క్రికెట్ సంఘం ఆధ్వర్యంలో ఆర్డీటీ సహకారంతో ఈ క్రీడా పోటీలను నిర్వహిస్తున్నట్లు ఆయన తెలిపారు. ఈ పోటీలు ఆదివారం నుంచి ఈ నెల 13 వరకు సాగుతాయన్నారు. ఈ పోటీల్లో సౌత్‌జోన్‌కు చెందిన అనంతపురం, వైఎస్సార్ కడప, చిత్తూరు, నెల్లూరు, కర్నూలు జట్లు పోటీల్లో తలపడతాయన్నారు. అండర్–19 మహిళ క్రికెట్ పోటీలు ఈ నెల 15 నుంచి 20 వరకు జరుగుతాయన్నారు. క్రీడా పోటీలను స్థానిక అనంత క్రీడా గ్రామంలోని బీ–గ్రౌండ్లో నిర్వహించేందుకు చర్యలు తీసుకున్నట్లు ఆయన తెలిపారు. అండర్–16 పోటీలు 25 ఓవర్ల ఫార్మాట్లోను, అండర్–19 పోటీలు 50 ఓవర్ల ఫార్మాట్లో జరుగుతాయన్నారు. అండర్–16 మ్యాచ్‌ల వివరాలు తేదీ తలపడే జట్లు 9-07-17 కడప–కర్నూలు ఉదయం 9–07–17 అనంతపురం–నెల్లూరు మధ్యాహ్నం 10–07–17 చిత్తూరు–నెల్లూరు ఉదయం 10–07–17 అనంతపురం–కర్నూలు మధ్యాహ్నం 11–07–17 అనంతపురం–కడప ఉదయం 11–07–17 చిత్తూరు–కర్నూలు మధ్యాహ్నం 12–07–17 నెల్లూరు–కర్నూలు ఉదయం 12–07–17 కడప–చిత్తూరు మధ్యాహ్నం 13–07–17 చిత్తూరు–అనంతపురం ఉదయం 13–07–17 కడప–నెల్లూరు మధ్యాహ్నం అండర్–19 మ్యాచ్‌ల వివరాలు తేదీ తలపడే జట్లు 15–07–17 కడప–కర్నూలు 15–07–17 అనంతపురం–నెల్లూరు 16–07–17 చిత్తూరు–నెల్లూరు 16–07–17 అనంతపురం–కర్నూలు 18–07–17 అనంతపురం–కడప 18–07–17 చిత్తూరు–కర్నూలు 19–07–17 నెల్లూరు–కర్నూలు 19–07–17 కడప–చిత్తూరు 20–07–17 చిత్తూరు–అనంతపురం 20–07–17 కడప–నెల్లూరు -
సెమీస్‌లో సాయి దేదీప్య
సాక్షి, హైదరాబాద్: నేషనల్ సిరీస్ అండర్-16 టెన్నిస్ టోర్నమెంట్లో హైదరాబాద్ అమ్మాయి సాయి దేదీప్య సెమీఫైనల్లోకి దూసుకెళ్లింది. అఖిల భారత టెన్నిస్ సంఘం (ఐటా) ఆధ్వర్యంలో నెల్లూరు జిల్లా కావలిలో జరుగుతోన్న ఈ టోర్నీలో బాలికల సింగిల్స్ క్వార్టర్స్‌లో దేదీప్య 6-1, 6-3తో పూజా ఇంగ్లే (మహారాష్ట్ర)పై విజయం సాధించింది. సెమీస్‌లో తను ఆంధ్రప్రదేశ్‌కు చెందిన జ్ఞానితతో తలపడుతుంది. -
ప్రాబబుల్స్‌లో తెలుగు కుర్రాళ్లు
సాక్షి, హైదరాబాద్: ఇండియా అండర్-16 ప్రాబబుల్స్‌లో తెలుగు కుర్రాళ్లు చోటు దక్కించుకున్నారు. తెలంగాణ క్రికెట్ సంఘానికి చెందిన అంకుర్, శ్రవణ్‌లు సాయ్ ఆధ్వర్యంలో నిర్వహించిన అండర్-16 స్కూల్ క్రికెట్ టోర్నమెంట్లో సత్తా చాటి ఈ అవకాశాన్ని అందిపుచ్చుకున్నారు. ఎస్ఎస్పీఎఫ్ మొత్తం 38 మందితో కూడిన ప్రాబబుల్స్ జాబితాను బుధవారం ప్రకటించింది. ఈ మేరకు వీరిరువురూ అక్టోబర్ మొదటి వారంలో డెహ్రాడూన్‌లో జరిగే క్యాంపుకు హాజరవుతారు. క్యాంపులో శిక్షణానంతరం 16 మందితో కూడిన భారత తుదిజట్టును ఎంపిక చేస్తారు. ఈ జట్టుకు కె. సునీల్ బాబు మేనేజర్‌గా వ్యవహరిస్తారు. -
వెస్ట్ జోన్ జట్టులో అర్జున్ టెండూల్కర్
వడోదర:ఇంటర్ జోనల్ టోర్నమెంట్లో భాగంగా అండర్ -16 వెస్ట్ జోన్ జట్టుకు మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ కుమారుడు అర్జున్ టెండూల్కర్ ఎంపికయ్యాడు. ఈ మేరకు సోమవారం ఆలిండియా జూనియర్ సెలక్షన్ కమిటీ చైర్మన్ రాకేష్ పారిక్ నేతృత్వంలో సెలక్టర్లు అర్జున్ కు అవకాశం కల్పించారు. వెస్ట్ జోన్ జట్టుకు ఓఎమ్ భోసాలే కెప్టెన్ గా వ్యవహరించనున్నాడు. అండర్-16 వెస్ట్ జోన్ జట్టు: ఓఎమ్ భోసాలే(కెప్టెన్), వాసుదేవ్ పాటిల్, సువేద్ పార్కర్, స్మిత్ పటేల్, సన్ ప్రీత్ బగ్గా, యస్వి జైశ్వాల్, దైవాంశ్ సక్సెనా, నీల్ జాదవ్, అర్జన్ టెండూల్కర్, యోగేష్ దోంగ్రే, అంకోల్కర్, సురజ్ సుర్యాల్, సిద్దార్త్ దేశాయ్, అకాశ్ పాండే, ముకుంద సర్దార్ -
జూనియర్లకు సచిన్ న్యూ ఇయర్ సందేశం
ముంబై: ట్వంటీ 20 తరహాలో ప్రతీ బంతిని బలంగా కొట్టాలని భావించకండి. అది మన ప్రతిభకు వెలుగులోకి రానివ్వదు. ప్రత్యేకంగా కాపీ బుక్ క్రికెట్, గేమ్ బేసిక్స్ ను కచ్చితంగా ఫాలో కావాలి. అలా ఆడినప్పుడే మీలో ఆట బయటకొస్తుంది' అని జూనియర్లకు మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ దిశా నిర్దేశం చేశాడు. నూతన సంవత్సరం సందర్భంగా ముంబై అండర్-16 క్రికెటర్లతో సచిన్ ముచ్చటించాడు. ఆ స్క్వాడ్ లో ఉన్న సచిన్ కుమారుడు అర్జున్ కూడా తండ్రి సలహాలను ఆసక్తిగా ఆలకించాడు. సచిన్ ఒక మెంటర్ మాదిరి కాకుండా వారితో ఒక స్నేహితుడిలా కలిసిపోయి సలహాలిచ్చాడు. సుదీర్ఘ ఇన్నింగ్స్ లు ఆడటాన్ని జూనియర్ల స్థాయిలో నేర్చుకోవాలని సచిన్ ఈ సందర్భంగా పేర్కొన్నాడు. ఆ తరహా ఆటే జట్టుకు విజయాలను అందిస్తున్న విషయం గుర్తించాలన్నాడు. అయితే ఫ్లాషీ స్ట్రోక్స్(దిల్ స్కూప్, రివర్స్ స్వీప్, స్విచ్ హిట్) ఆట జూనియర్ స్థాయిలో చాలా ప్రమాదకరమని పేర్కొన్నాడు. ప్రత్యేకంగా ఆటను నేర్చుకునే స్థాయిలో ఉన్న వారు బేసిక్ క్రికెట్ నే అనుసరించాలని తెలిపాడు.