నేటి నుంచి అండర్‌–16 మహిళ క్రికెట్‌ పోటీలు | today start under 16 woman cricket games | Sakshi
Sakshi News home page

నేటి నుంచి అండర్‌–16 మహిళ క్రికెట్‌ పోటీలు

Published Sat, Jul 8 2017 11:21 PM | Last Updated on Tue, Sep 5 2017 3:34 PM

today start under 16 woman cricket games

అనంతపురం సప్తగిరి సర్కిల్‌ : ఆంధ్ర క్రికెట్‌ అసోసియేషన్‌ ఆధ్వర్యంలో నిర్వహించే అండర్‌–16 అంతర్‌ జిల్లాల క్రికెట్‌ పోటీలను ఆదివారం నుంచి నిర్వహిస్తున్నట్లు  క్రికెట్‌ సంఘం జిల్లా కార్యదర్శి కేఎస్‌ షాహబుద్దీన్‌ తెలిపారు. జిల్లా క్రికెట్‌ సంఘం ఆధ్వర్యంలో ఆర్డీటీ సహకారంతో ఈ క్రీడా పోటీలను నిర్వహిస్తున్నట్లు ఆయన తెలిపారు. ఈ పోటీలు ఆదివారం నుంచి ఈ నెల 13 వరకు సాగుతాయన్నారు. ఈ పోటీల్లో సౌత్‌జోన్‌కు చెందిన అనంతపురం, వైఎస్సార్‌ కడప, చిత్తూరు, నెల్లూరు, కర్నూలు జట్లు పోటీల్లో తలపడతాయన్నారు. అండర్‌–19 మహిళ క్రికెట్‌ పోటీలు ఈ నెల 15 నుంచి 20 వరకు జరుగుతాయన్నారు.  క్రీడా పోటీలను స్థానిక అనంత క్రీడా గ్రామంలోని బీ–గ్రౌండ్‌లో నిర్వహించేందుకు చర్యలు తీసుకున్నట్లు ఆయన తెలిపారు. అండర్‌–16 పోటీలు 25 ఓవర్ల ఫార్మాట్‌లోను, అండర్‌–19 పోటీలు 50 ఓవర్ల ఫార్మాట్‌లో జరుగుతాయన్నారు.  

అండర్‌–16 మ్యాచ్‌ల వివరాలు
తేదీ                తలపడే జట్లు            
9-07-17        కడప–కర్నూలు        ఉదయం
9–07–17        అనంతపురం–నెల్లూరు    మధ్యాహ్నం
10–07–17        చిత్తూరు–నెల్లూరు        ఉదయం
10–07–17        అనంతపురం–కర్నూలు    మధ్యాహ్నం
11–07–17        అనంతపురం–కడప        ఉదయం
11–07–17        చిత్తూరు–కర్నూలు        మధ్యాహ్నం
12–07–17        నెల్లూరు–కర్నూలు        ఉదయం
12–07–17        కడప–చిత్తూరు        మధ్యాహ్నం
13–07–17        చిత్తూరు–అనంతపురం    ఉదయం
13–07–17        కడప–నెల్లూరు        మధ్యాహ్నం

అండర్‌–19 మ్యాచ్‌ల వివరాలు
తేదీ                 తలపడే జట్లు            
15–07–17        కడప–కర్నూలు        
15–07–17        అనంతపురం–నెల్లూరు    
16–07–17        చిత్తూరు–నెల్లూరు
16–07–17        అనంతపురం–కర్నూలు
18–07–17        అనంతపురం–కడప
18–07–17        చిత్తూరు–కర్నూలు
19–07–17        నెల్లూరు–కర్నూలు
19–07–17        కడప–చిత్తూరు
20–07–17        చిత్తూరు–అనంతపురం
20–07–17        కడప–నెల్లూరు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement