నేటి నుంచి అండర్‌–16 సెమీస్‌ మ్యాచులు | today start under - 16 semies matches | Sakshi
Sakshi News home page

నేటి నుంచి అండర్‌–16 సెమీస్‌ మ్యాచులు

Published Thu, Aug 31 2017 9:50 PM | Last Updated on Tue, Sep 12 2017 1:29 AM

today start under - 16 semies matches

అనంతపురం సప్తగిరిసర్కిల్‌: ఆంధ్ర క్రికెట్‌ అసోసియేషన్‌ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న అండర్‌–16 సెమీఫైనల్‌ మ్యాచులు శుక్రవారం నుంచి ప్రారంభం కానున్నాయి. వెంకటగిరిలో అనంతపురం, తూర్పుగోదావరి జట్ల మధ్య సెమీస్‌ మ్యాచ్‌లో తలపడనుంది. కడపలోని ఏసీఏ గ్రౌండ్‌లో కడప, వైజాగ్‌ జట్ల మధ్య సెప్టెంబర్‌ 1 నుంచి 3 వరకు సెమీస్‌ మ్యాచులు జరగనున్నాయి. గ్రూప్‌–ఏ విభాగంలో వైజాగ్, తూర్పుగోదావరి జట్లు ప్రథమ, ద్వితీయ స్థానాల్లో నిలవగా, గ్రూప్‌–బీలో అనంతపురం, కడప జట్లు ప్రథమ, ద్వితీయ స్థానాల్లో నిలిచాయి. దీంతో ఆయా జట్లను సెమీస్‌లో తలపడనున్నాయి. ఈ పోటీల్లో విజేతలుగా నిలిచిన జట్లు సెప్టెంబర్‌ 5 నుంచి 7 వరకు వెంకటగిరిలో జరిగే ఫైనల్‌ పోటీల్లో తలపడనున్నాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement