నా సినిమా నన్ను ఆవిష్కరిస్తుంది: సచిన్‌ | My movie will reveal me: Sachin | Sakshi
Sakshi News home page

నా సినిమా నన్ను ఆవిష్కరిస్తుంది: సచిన్‌

Published Mon, May 8 2017 10:39 PM | Last Updated on Tue, Sep 5 2017 10:42 AM

నా సినిమా నన్ను ఆవిష్కరిస్తుంది: సచిన్‌

నా సినిమా నన్ను ఆవిష్కరిస్తుంది: సచిన్‌

లండన్‌: తన జీవితకథ ఆధారంగా తెరకెక్కిన ‘సచిన్‌ ఎ బిలి యన్‌ డ్రీమ్స్‌’ చిత్రం తనను ఆవిష్కరిస్తుందని సచిన్‌ టెండూల్కర్‌ చెప్పారు. సినిమా ప్రచార కార్యక్రమంలో పాల్గొనేందు కు ఇక్కడికి వచ్చిన సచిన్‌ మాట్లాడుతూ ‘నా జీవితంలోని మధురఘట్టాల్ని నేను తిరిగి చూసుకునేందుకు, నా సుదీర్ఘ పయనంలో నాకు మాత్రమే తెలిసిన విశేషాలను అభిమానులతో పంచుకునేందుకు ఈ బయోపిక్చర్‌ ఉపయోగపడుతుం ది.

ఈ సినిమా నా ఇన్నింగ్స్‌ల్లాగే అభిమానుల్ని అలరిస్తుంది. 24 ఏళ్ల కెరీర్‌లో నాపై కురిపించిన ఆదరాభిమానాల్ని ఈ సినిమాపై కూడా చూపిస్తారని ఆశిస్తున్నా’నని అన్నారు. ఈ చిత్రానికి రవి భాగ్‌చంద్క నిర్మాతగా వ్యవహరించగా.. ప్రముఖ డైరెక్టర్‌ జేమ్స్‌ ఎర్స్‌కిన్‌ దర్శకత్వం వహించాడు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement