
బ్యాంకాక్: పారిస్ ఒలింపిక్స్‌కు అర్హత సాధించేందుకు ఆఖరి క్వాలిఫయింగ్ టోర్నీలో భారత బాక్సర్లు సచిన్ సివాచ్ (57 కేజీలు) క్వార్టర్ ఫైనల్ చేరగా... అమిత్ పంఘాల్ (51 కేజీలు), సంజీత్ కుమార్ (92 కేజీలు), జైస్మిన్ (57 కేజీలు) ప్రిక్వార్టర్ ఫైనల్లోకి ప్రవేశించారు. గురువారం జరిగిన ప్రిక్వార్టర్ ఫైనల్ బౌట్‌లో సచిన్ 5–0తో బతుహన్ సిఫ్టిసీ (టర్కీ)పై ఏకపక్ష విజయం సాధించాడు.
రెండో రౌండ్ బౌట్‌లలో సంజీత్ 5–0తో లూయిస్ సాంచెజ్ (వెనిజులా)పై, అమిత్ 4–1తో మౌరిసియో రూయిజ్ (మెక్సికో)పై గెలిచారు. మహిళల 57 కేజీల రెండో రౌండ్‌లో జైస్మిన్ 5–0తో మహసతి హమ్‌జయేవా (అజర్‌బైజాన్)పై విజయం సాధించింది. ఈ టోర్నీలో సెమీఫైనల్ చేరిన బాక్సర్లకు పారిస్ ఒలింపిక్స్ బెర్త్‌లు ఖరారవుతాయి.
Comments
Please login to add a commentAdd a comment