
నన్ను ‘సార్’ అనొద్దు... ‘ఓకే సార్’!
న్యూఢిల్లీ: క్రికెట్‌లో ఎవరెస్ట్ అంతటోడు సచిన్. తన సుదీర్ఘ ప్రస్థానంలో వేలకొద్దీ పరుగులు... లెక్కలేనన్ని రికార్డులున్నట్లే... ఎన్నో విశేషాలు, గమ్మత్తు అనుభవాలూ ఉన్నాయి. ఇవన్నీ ఇప్పుడు ఈ బ్యాటింగ్ దిగ్గజం చెబుతుంటే సరదాగానే ఉండొచ్చు కానీ... అయనకు అప్పుడు ఎదురైనవి మాత్రం ఇబ్బందికర పరిస్థితులే మరి! బుధవారం ఇక్కడ జరిగిన ఓ కార్యక్రమంలో పాల్గొనేందుకు వచ్చిన ఆయన తను సారథ్యం వహించిన రోజుల్లో హిందీ, ఇంగ్లీష్ భాష రాని సహచరులతో ఎలా వేగాడో ఇలా చెప్పుకొచ్చారు. 1997లో సచిన్ సేన దక్షిణాఫ్రికాలో పర్యటించింది.
ఈ క్రమంలో కర్ణాటక బౌలర్ దొడ్డ గణేష్‌కు కన్నడ తప్ప ఇంకే భాష రాదు. ఇలాంటి సందర్భంలో సచిన్ పడరాని పాట్లే పడ్డారు. అయితే గణేష్ మాత్రం సచిన్ ఏమని అడిగిన... ఏం చెప్పినా... ‘ఓకే సార్’ అనేవాడు. ‘దీంతో నాకు అర్థమైందేమిటంటే... నేనేం చెప్పిన అతనిచ్చే సమాధానం ‘ఓకే సార్’. పదేపదే అలా అనడంతో నేనోసారి... నన్ను సార్ అని పిలవొద్దని చెప్పా. విచిత్రంగా దానిక్కూడా అతనిచ్చిన సమాధానం ‘ఓకే సార్’!
ఏం చేయను.. ఒక దేశానికి చెందిన మేమిద్దరమే భాష అర్థం కాక సతమతమవుతుంటే... ఓ రోజు డొనాల్డ్‌తో పెట్టుకున్నాడు. వెంటనే నేను వెళ్లి నీవు ఎం చెప్పాలనుకున్నా ముందు నాకు అర్థమయ్యేలా చెబితే... నేను డొనాల్డ్‌కు వివరిస్తాను అని చెప్పా! దీనికీ ఓకే సార్ అనే సమాధానమే’ అని సచిన్ వివరించారు.
గణేష్