
హీరో సచిన్‌తో రిపోర్టర్ రకుల్
రకుల్‌కు ఇంటర్వ్యూ ఇవ్వడం బాగా అలవాటు. కానీ, ఇంటర్వ్యూ చేయడమనేది అస్సలు అలవాటు లేని కొత్త పాత్రే. యాక్టర్స్ పనేంటి? అలవాటు లేని పాత్రలను అవలీలగా చేసుకుంటూ వెళ్లడమే కదా! అలా బోలెడుఇంటర్వ్యూ లు ఇచ్చిన ఎక్స్‌పీరియన్స్‌తో ఇండియన్ క్రికెట్ గాడ్ సచిన్‌నుఇంటర్వ్యూ చేశారీ బ్యూటీ.
అసలే సచిన్ అంటే ఆమెకు బోల్డంత అభిమానమేమో... సచిన్ లైఫ్ గురించి ఎవ్వరికీ తెలియని విషయాలను రాబట్టే ప్రయత్నం చేశారు. భలే భలే ప్రశ్నలు అడిగారు. ఇదంతా ఎందుకు? అంటే... సచిన్ జీవితకథతో ‘సచిన్ ఏ బిలియన్ డ్రీమ్స్’ అనే సినిమా రూపొందింది కదా! ఈ నెల 26న విడుదలవుతోన్న ఆ సినిమా కోసం రియల్ లైఫ్ అండ్ రీల్ లైఫ్ హీరో సచిన్‌ను ఇంటర్వ్యూ చేశానని ట్వీట్ చేశారామె. రకుల్ రిపోర్టర్‌గా మారి, ఇంటర్వ్యూ చేయడం ఇది రెండోసారి. ‘సాక్షి’ పత్రిక కోసం గతంలో ఆమె(రకుల్)ను, ఆమె (ప్రీత్)ఇంటర్వ్యూ చేసుకున్నారు.