
నా సైజ్ ఎంతో తెలుసా?
రకుల్ ప్రీత్ సింగ్ చాలా స్లిమ్‌గా ఉంటుంది. అందుకే, కుర్రాళ్లకు ఈ బ్యూటీ అంటే బోల్డంత క్రేజ్. అందచందాలతో పాటు అభినయం కూడా బాగుంటుంది కాబట్టి ప్రస్తుతం రకుల్ ‘మోస్ట్ వాంటెడ్’ హీరోయిన్ అయిపోయారు. ఒకవైపు సినిమా అవకాశాలు పెరగడంతో పాటు మరోవైపు అభిమానుల సంఖ్య కూడా పెరిగిపోతోంది. అందుకే అభిమానులను ఆనందపరచాలని రకుల్ అనుకున్నారు. ‘కమాన్.. ట్విట్టర్ ద్వారా నన్ను ప్రశ్నలు అడగండి.. సమాధానాలు చెబుతా’ అంటూ అభిమానులకు ఓ మంచి అవకాశం ఇచ్చారు. ఇక చూస్కోండి.. తమ ప్రశ్నలతో అభిమానులు రెచ్చిపోయారు. ఆ ప్రశ్నలు, వాటికి రకుల్ ఇచ్చిన సమాధానాలూ తెలుసుకుందాం..
హాయ్ మీరంటే నాకు లవ్. నాక్కూడా లవ్ యు చెబుతారా?
లవ్ యు టూ
రణ్‌వీర్ సింగ్ సరసన నటించే చాన్స్ వస్తే...?
నేను కళ్లు తిరిగి పడిపోతా
టామ్ క్రూజ్, బ్రాడ్‌పిట్, లియొనార్డో డికాప్రియో.. వీరిలో ఎవరిష్టం?
డికాప్రియొ
ఇప్పటివరకు మీకెంత మంది ప్రపోజ్ చేశారు?
లెక్క పెట్టలేదు. లెక్క పెట్టి, రేపు చెబుతా
జీరో సైజ్ మీద మీ ఒపీనియన్.. అల్రెడీ మీది జీరో సైజే కదా?
జీరో సైజ్ ఆరోగ్యానికి మంచిది కాదు. నా సైజ్ సిక్స్.
మీరిష్టపడే కంప్యూటర్ గేమ్స్?
నాకసలు కంప్యూటర్ గేమ్స్ అంటే ఇష్టం ఉండదు
ఫెయిల్యూర్స్‌ని ఎలా తీసుకుంటారు?
సక్సెస్‌కి పిల్లర్స్ అనుకుంటాను
రాత్రిపూట నా కలలోకి ఎందుకు వస్తున్నారు?
ఎందుకంటే పగటి పూట షూటింగ్‌తో బిజీగా ఉంటాను కాబట్టి.
టాటూస్ అంటే ఇష్టమేనా?
లేదు.
మీ తొలి పారితోషికం ఎంత?
ఒక ఫొటోషూట్‌లో పాల్గొన్నాను. ఐదువేల రూపాయలిచ్చారు.
ఎన్టీఆర్ హీరోగా సుకుమార్ దర్శకత్వంలో చేస్తున్న ‘నాన్నకు ప్రేమతో’ గురించి?
లవ్ ది టీమ్
మీ ఫేవరెట్ కార్?
ఆడి
బాలీవుడ్‌లో మీకు నచ్చిన జంట?
షారూక్ ఖాన్, కాజోల్
వంట చేయడం వచ్చా?
ఓ.. గుడ్లు ఉడకబెడతాను
అభిమానుల నుంచి ఏం ఎదురు చూస్తున్నారు?
ఎప్పటికీ ఇలానే సపోర్ట్ చేస్తూ ఉండాలని.