విజయనగరంలో అర్జున్ టెండూల్కర్ | Arjun Tendulkar in Vizianagaram | Sakshi
Sakshi News home page

విజయనగరంలో అర్జున్ టెండూల్కర్

Published Fri, Oct 30 2015 12:48 AM | Last Updated on Sun, Sep 3 2017 11:41 AM

విజయనగరంలో  అర్జున్ టెండూల్కర్

విజయనగరంలో అర్జున్ టెండూల్కర్

విజయనగరం: బ్యాటింగ్ దిగ్గజం సచిన్ కుమారుడు అర్జున్ అండర్-16 టోర్నీ కోసం విజయనగరం వచ్చాడు. నాలుగు జట్లు పాల్గొంటున్న ఈ సిరీస్‌లో అర్జున్ ముంబై తరఫున బరిలోకి దిగుతున్నాడు. గురువారం విదర్బతో జరిగిన మ్యాచ్ కోసం అర్జున్ స్థానిక విజ్జి స్టేడియానికి రావడంతో అభిమానులు పోటెత్తారు.

అయితే భద్రతా సిబ్బంది ఎవర్నీ అనుమతించలేదు. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచి బ్యాటింగ్‌కు దిగిన ముంబై ఆట ముగిసే సమయానికి 6 వికెట్లకు 229 పరుగులు చేసింది. ఆట చివర్లో అర్జున్ కొద్దిసేపు బ్యాటింగ్ చేశాడు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement