Under-16 tournament
-
Vijay Merchant Trophy: అండర్–16 టోర్నీలో ద్రవిడ్ vs సెహ్వాగ్
సాక్షి, మంగళగిరి: సడెన్‌గా చూస్తే అండర్–16 టోర్నీ ఏంటి? ద్రవిడ్, సెహ్వాగ్‌లు ముఖాముఖిగా తలపడటం ఏంటనే సందేహాలు రావడం ఖాయం. కానీ ఇది దిగ్గజాల మధ్య సమరం కాదు. వారి తర్వాతి తరం పోటీపడుతున్న టోర్నీ సంగతి! టీమిండియాకు ఏళ్ల తరబడి రాహుల్ ద్రవిడ్, వీరేంద్ర సెహ్వాగ్ కలిసి టాపార్డర్‌ను నడిపించారు. గెలిపించారు. ఇప్పుడు బీసీసీఐ దేశవాళీ జూనియర్ టోర్నీ అయిన విజయ్ మర్చంట్ ట్రోఫీలో కర్ణాటక అండర్–16 జట్టు కెపె్టన్‌గా అన్వయ్ ద్రవిడ్ (ద్రవిడ్ రెండో కుమారుడు), ఢిల్లీ అండర్–16 జట్టు ఓపెనర్‌గా ఆర్యవీర్ సెహ్వాగ్ (సెహ్వాగ్ పెద్ద కుమారుడు) బరిలోకి దిగారు. దీంతో మంగళగిరిలోని ఏసీఏ స్టేడియంలో జరుగుతున్న ఈ మ్యాచ్ వార్తల్లో విశేషంగా నిలిచింది. మూడు రోజుల ఈ మ్యాచ్‌లో ముందుగా బ్యాటింగ్‌కు దిగిన కర్ణాటక తొలి ఇన్నింగ్స్‌లో 56.3 ఓవర్లలో 144 పరుగుల వద్ద ఆలౌటైంది. అయితే వికెట్ కీపర్, కెపె్టన్ అన్వయ్ (0) డకౌటయ్యాడు. అనంతరం తొలి ఇన్నింగ్స్ ఆరంభించిన ఢిల్లీ 30 ఓవర్లలో వికెట్ నష్టానికి 107 పరుగులు చేసింది. ఆర్యవీర్ సెహ్వాగ్ (98 బంతుల్లో 50 బ్యాటింగ్; 7 ఫోర్లు, 1 సిక్స్) అజేయ అర్ధసెంచరీ చేశాడు. తొలిరోజు ఆటను పరిశీలిస్తే... ఒక విధంగా టీనేజ్ ద్రవిడ్ టీమ్‌పై కుర్ర సెహ్వాగ్ పైచేయి సాధించాడు. -
సాయి దేదీప్య ‘డబుల్’
సాక్షి, హైదరాబాద్: అఖిల భారత టెన్నిస్ సంఘం (ఏఐటీఏ-ఐటా) అండర్-16 సూపర్ సిరీస్ టోర్నమెంట్లో హైదరాబాద్ అమ్మాయి యెద్దుల సాయి దేదీప్య ‘డబుల్’ సాధించింది. తమిళనాడులోనూ కరూర్‌లో శుక్రవారం ముగిసిన ఈ టోర్నీలో సాయి దేదీప్య సింగిల్స్‌తోపాటు డబుల్స్ విభాగంలోనూ టైటిల్‌ను సొంతం చేసుకుంది. సింగిల్స్ ఫైనల్లో సాయి దేదీప్య 6-0, 6-2తో సాన్యా సింగ్ (మహారాష్ట్ర)పై గెలుపొందగా... డబుల్స్ ఫైనల్లో సాయి దేదీప్య-ధరణ ముదలియార్ (ఛత్తీస్‌గఢ్) ద్వయం 6-4, 6-3తో దివ్యవాణి (తమిళనాడు) -లక్ష్మీ సాహితి (ఆంధ్రప్రదేశ్) జోడీపై విజయం సాధించింది. -
విజయనగరంలో అర్జున్ టెండూల్కర్
విజయనగరం: బ్యాటింగ్ దిగ్గజం సచిన్ కుమారుడు అర్జున్ అండర్-16 టోర్నీ కోసం విజయనగరం వచ్చాడు. నాలుగు జట్లు పాల్గొంటున్న ఈ సిరీస్‌లో అర్జున్ ముంబై తరఫున బరిలోకి దిగుతున్నాడు. గురువారం విదర్బతో జరిగిన మ్యాచ్ కోసం అర్జున్ స్థానిక విజ్జి స్టేడియానికి రావడంతో అభిమానులు పోటెత్తారు. అయితే భద్రతా సిబ్బంది ఎవర్నీ అనుమతించలేదు. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచి బ్యాటింగ్‌కు దిగిన ముంబై ఆట ముగిసే సమయానికి 6 వికెట్లకు 229 పరుగులు చేసింది. ఆట చివర్లో అర్జున్ కొద్దిసేపు బ్యాటింగ్ చేశాడు. -
బీసీసీఐ వయసు నిర్ధారణ పరీక్షలో జోక్యం చేసుకోం
ఢిల్లీ హైకోర్టు న్యూఢిల్లీ : అండర్-16 ఆటగాళ్ల వయసును నిర్ధారించేందుకు బీసీసీఐ అనుసరిస్తున్న పద్ధతిలో జోక్యం చేసుకోలేమని ఢిల్లీ హైకోర్టు తోసిపుచ్చింది. బోర్డు పాలసీ, పరీక్ష ప్రామాణికత సహేతుకంగానే ఉందని వెల్లడించింది. ‘బీసీసీఐ అనుసరిస్తున్న టన్నర్ వైట్‌హౌస్ (టీడబ్ల్యు-3) పరీక్ష వల్ల ఆటగాళ్ల వయసులో ఉన్న హెచ్చు తగ్గులు బాగా తెలుస్తున్నాయి. ఆటగాళ్ల మధ్య వివక్ష లేకుండా చూడటానికి కూడా ఇది దోహదపడుతుంది’ అని చీఫ్ జస్టిస్ జి.రోహిణి, జస్టిస్ జయంత్ నాథ్‌లతో కూడిన ద్విసభ్య బెంచ్ తమ ఆదేశాల్లో పేర్కొంది. రెండేళ్ల కిందట యష్, ఆర్యన్ అనే ఇద్దరు క్రికెటర్లు వయసు అధికంగా ఉండటంతో అండర్-16 టోర్నీలో ఆడకుండా బీసీసీఐ అడ్డుకుంది. దీంతో ఆ ఇద్దరు కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.