సాక్షి, హైదరాబాద్: అఖిల భారత టెన్నిస్ సంఘం (ఏఐటీఏ-ఐటా) అండర్-16 సూపర్ సిరీస్ టోర్నమెంట్‌లో హైదరాబాద్ అమ్మాయి యెద్దుల సాయి దేదీప్య ‘డబుల్’ సాధించింది. తమిళనాడులోనూ కరూర్‌లో శుక్రవారం ముగిసిన ఈ టోర్నీలో సాయి దేదీప్య సింగిల్స్‌తోపాటు డబుల్స్ విభాగంలోనూ టైటిల్‌ను సొంతం చేసుకుంది.
సింగిల్స్ ఫైనల్లో సాయి దేదీప్య 6-0, 6-2తో సాన్యా సింగ్ (మహారాష్ట్ర)పై గెలుపొందగా... డబుల్స్ ఫైనల్లో సాయి దేదీప్య-ధరణ ముదలియార్ (ఛత్తీస్‌గఢ్) ద్వయం 6-4, 6-3తో దివ్యవాణి (తమిళనాడు) -లక్ష్మీ సాహితి (ఆంధ్రప్రదేశ్) జోడీపై విజయం సాధించింది.
సాయి దేదీప్య ‘డబుల్’
Published Sat, Jul 30 2016 9:26 AM | Last Updated on Mon, Sep 4 2017 7:04 AM