
సాక్షి, హైదరాబాద్: అఖిల భారత టెన్నిస్ సంఘం (ఐటా) మహిళల టోర్నమెంట్‌లో హైదరాబాద్ క్రీడాకారులు సాయిదేదీప్య, మౌలిక రామ్ రాణించారు. బెంగళూరులో జరిగిన ఈ టోర్నీలో వీరిద్దరూ జతగా రన్నరప్‌గా నిలిచారు. గురువారం జరిగిన టైటిల్‌పోరులో సాయిదేదీప్య–మౌలిక రామ్ ద్వయం 6–0, 4–6, 10–8తో సాల్సా అహెర్ (మహారాష్ట్ర)–లిఖిత (తెలంగాణ) జంట చేతిలో ఓడిపోయింది. అంతకుముందు జరిగిన సెమీఫైనల్లో సాయిదేదీప్య–మౌలిక జంట 6–4, 6–2తో ఆర్తి ముణియన్ (తమిళనాడు)–విదుల (కర్ణాటక) జోడీపై గెలుపొందింది.
Comments
Please login to add a commentAdd a comment