కోల్కతా : ఎప్పుడెప్పుడా అని ఆత్రుతగా ఎదురు చూస్తున్న అభిమానుల కల సాకారం అయ్యింది. కోల్కతా ఈడెన్ గార్డెన్స్లో భారత్-విండీస్ మధ్య జరుగుతున్న మొదటి టెస్ట్ రెండో రోజు ఆటలో సచిన్ బ్యాటింగ్ ప్రారంభించాడు. జట్టు స్కోర్ 57 పరుగుల వద్ద మురళీ విజయ్ (26) అవుట్ అవటంతో సచిన్ బ్యాటింగ్కు దిగాడు.
క్రికెట్ దేవుడి చివరి మ్యాచ్ చూసేందుకు అభిమానులు ఎక్కడలేని ఉత్సాహాన్ని చూపిస్తున్నారు. మరోవైపు కోల్కతా అంతా మాస్టర్ ఫీవర్తో ఊగిపోతుంది. ఉద్యోగులు తమ విధులకు సెలవు పెట్టారు.. పాఠశాల, కాలేజీ విద్యార్థులు తరగతులకు డుమ్మా కొట్టారు.. అందరి దారీ ఈడెన్ గార్డెన్స్ వైపే.. దాంతో ఈడెన్ గార్డెన్స్ గ్యాలరీ అభిమానులతో కిక్కిరిసి పోయింది.
స్టేడియానికి వచ్చిన ప్రేక్షకుల చేతుల్లో సచిన్ టెండూల్కర్ భారీ చిత్రపటాలు కనిపించాయి. అందులో ‘ఆటను ఆస్వాదించు.. కలలను ఛేదించు.. స్వప్నాలను సాకారం చేసుకో’ అనే సచిన్ కొటేషన్‌ను కూడా పొందుపరిచారు. కొందరైతే త్రివర్ణ రంగులతో సచిన్ అనే పేరును తమ ముఖాలపై రాయించుకున్నారు.
199వ టెస్ట్లో బ్యాటింగ్కు దిగిన సచిన్
Published Thu, Nov 7 2013 9:53 AM | Last Updated on Sat, Sep 2 2017 12:23 AM
Advertisement
Advertisement