రెండోరోజు ఆట ప్రారంభించిన టీమిండియా ఆదిలోనే తొలి వికెట్ కోల్పోయింది. షిల్లాంగ్‌ఫోర్డ్ బౌలింగ్లో శిఖర్ ధావన్ (23) అవుట్ అయ్యాడు
కోల్కతా : రెండోరోజు ఆట ప్రారంభించిన టీమిండియా ఆదిలోనే తొలి వికెట్ కోల్పోయింది. గురువారం ఉదయం ప్రారంభించిన జట్టు 42 పరుగుల వద్ద షిల్లాంగ్‌ఫోర్డ్ బౌలింగ్లో శిఖర్ ధావన్ (23) అవుట్ అయ్యాడు. 20 ఓవర్లలో వికెట్ నష్టానికి భారత్ 56 పరుగులు చేసింది. మురళీ విజయ్ 26, చటేశ్వర్ పూజారా 5 పరుగులతో ప్రస్తుతం క్రీజ్లో ఉన్నారు.
ఈడెన్ గార్డెన్లో భారత్-వెస్టిండీస్ జట్ల మధ్య మొదటి టెస్ట్ మ్యాచ్ జరుగుతున్న విషయం తెలిసిందే. తొలి రోజు టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న విండీస్ తొలి ఇన్సింగ్స్లో 234 పరుగులకు ఆల్అవుట్ అయ్యింది. అనంతరం బ్యాటింగ్కు దిగిన భారత్ మొదటి రోజు ఆట ముగిసే సరికి వికెట్ కోల్పోకుండా 37 పరుగులు చేసింది.