కోల్కతా : ఈడెన్ గార్డెన్స్ వేదికగా ఇండియా- వెస్టిండీస్ తొలి టెస్టు... మాస్టర్ బ్లాస్టర్ 199 మ్యాచ్ ప్రారంభమైంది. కరీబియన్ జట్టు టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది. క్రిస్‌గేల్, కీరన్ పావెల్‌లు వెస్టిండీస్ ఇన్నింగ్స్‌ను ప్రారంభించారు. ఈ మ్యాచ్ ద్వారా రోహిత్ శర్మ, బౌలర్ మహ్మద్ షమీలు టెస్ట్ అరంగేట్రం చేశారు. కాగా తొలిరోజే సచిన్ బ్యాటింగ్‌ను ఆస్వాదిద్దామనుకున్న అభిమానులకు వెస్టిండీస్ బ్యాటింగ్ కాస్త నిరాశనే కలిగించింది.
మరోవైపు రెండు మ్యాచ్‌లు... నాలుగు ఇన్నింగ్స్... 24 ఏళ్ల కెరీర్‌కు ముగింపు పలికేందుకు క్రికెట్ ‘దేవుడు’ వేయనున్న ఈ రెండు అడుగుల కోసం ప్రపంచం యావత్తూ ఆసక్తిగా ఎదురుచూస్తోంది. ఒకటా, రెండా, వందల కొద్ది మ్యాచ్‌లు ఆడినా... ఒంటిచేత్తో గెలిపించినా... ఎన్నడూ లేని ఉత్కంఠ ప్రస్తుతం రాజ్యమేలుతోంది. కోట్లాది మంది అభిమానులతో పాటు... ప్రపంచ క్రీడాలోకం మొత్తం ఓ దిగ్గజ ఆటగాడి ఆటలో చివరి అంకాన్ని తిలకించేందుకు సిద్ధమయింది.
టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న కరేబియన్లు
Published Wed, Nov 6 2013 9:40 AM | Last Updated on Sat, Sep 2 2017 12:20 AM
Advertisement
Advertisement