బహ్రెయిన్ గ్రాండ్‌ప్రికి సచిన్
దుబాయ్: భారత క్రికెట్ దిగ్గజం సచిన్ కెరీర్ ఆసాంతం బిజీ బిజీ... ఊపిరి సలపని షెడ్యూలుతో ఇంటా బయట 24 ఏళ్లు ఆటను ఆస్వాదించిన ఈ ‘భారతరత్న’ం... ఇప్పుడు రిటైర్మెంట్‌తో బాధ్యతల నుంచి బంధవిముక్తుడవడంతో ఎంచక్కా కుటుంబ జీవితాన్ని ఆస్వాదిస్తున్నాడు. భార్యాపిల్లలతో కలిసి అడవుల్ని, ఆలయాల్ని చుట్టివస్తున్నాడు.
మొన్న గుజరాత్‌లోని గిర్ అడవుల్ని, నిన్నేమో సుప్రసిద్ధ సోమనాథ్ ఆలయాన్ని సందర్శించిన సచిన్ తనకెంతో ఇష్టమైన ఫార్ములావన్‌ను కూడా ప్రత్యక్షంగా చూసేందుకు ఫ్యామిలీ, బ్యాగేజ్‌తో సిద్ధమయ్యాడు. బహ్రెయిన్ గ్రాండ్‌ప్రిని చూసేందుకు మనామాకు వెళ్లనున్నాడు. వచ్చేనెల 4 నుంచి 6వ తేదీ వరకు జరిగే ప్రాక్టీస్, క్వాలిఫయింగ్, ప్రధాన రేసుల్ని ప్రత్యక్షంగా వీక్షించేందుకు రావాలని ఆ దేశ రాజు ప్రిన్స్ సల్మాన్ బిన్ హమద్ అల్ ఖలీఫా ఆహ్వానించారు.
ఈ ఆహ్వానాన్ని మన్నించిన సచిన్ త్వరలోనే తమ దేశానికి వస్తున్నాడని బహ్రెయిన్‌కు చెందిన వ్యాపారవేత్త, ‘మాస్టర్’ మిత్రుడైన మహ్మద్ దాదాభాయ్ వెల్లడించారు. అతని రాక తమ గ్రాండ్‌ప్రికే ప్రత్యేక ఆకర్షణ కానుందని ఆయన తెలిపార.