
అంజలికి లేఖ రాసేందుకు కష్టపడేవాడిని
ఎంతటి క్లిష్టమైన బంతినైనా అలవోకగా బౌండరీ దాటించగల మాస్టర్ బ్లాస్టర్ సచిన్ కూడా భార్యను నొప్పించకుండా నడచుకునేందుకు ఎంతో కష్టపడేవాడట.
ఎంతటి క్లిష్టమైన బంతినైనా అలవోకగా బౌండరీ దాటించగల మాస్టర్ బ్లాస్టర్ సచిన్ కూడా భార్యను నొప్పించకుండా నడచుకునేందుకు ఎంతో కష్టపడేవాడట.
సెల్‌ఫోన్లు అందుబాటులోకి రాని రోజుల్లో తన భార్య అంజలితో లెటర్ల ద్వారానే ఎక్కువగా సంభాషించేవాడట సచిన్. అయితే ఆమెకు నచ్చేవిధంగా లేఖ రాసేందుకు అందమైన వాక్యాల కోసం, గుండ్రని అక్షరాల కోసం ఎంతో శ్రమించాల్సివచ్చేదట. కానీ, అంజలి మాత్రం అందమైన అక్షరాలతో ఆకర్షణీయంగా రాసేదట.
సాధారణంగా డాక్టర్ల చేతిరాత అర్థం చేసుకోవడానికే కష్టంగా ఉంటుందన్నది తెలిసిన విషయమే అయినా.. పిల్లల డాక్టర్ అయిన అంజలి చేతిరాత మాత్రం చూడచక్కగా ఉండేదన్నాడు మాస్టర్. విద్యార్థులు చేతిరాతను మెరుగుపరచుకునేందుకు మెళకువలు నేర్పించే అంశంపై బుధవారం నిర్వహించిన ఓ కార్యక్రమంలో పాల్గొన్న సందర్భంగా సచిన్ తన గత స్మృతులను నెమరువేసుకున్నాడు.
తన సహచరుల్లో అనిల్ కుంబ్లే చేతిరాత ఆకర్షణీయంగా ఉంటుందన్నాడు. తాను కుడిచేతి వాటం బ్యాట్స్‌మన్‌ని అయినా ఎడమ చేత్తో రాయడం అలవాటని మాస్టర్ బ్లాస్టర్ చెప్పాడు.