మా ఆయన బంగారం - అంజలి
ఇప్పటికీ అంతే!
సచిన్ బయట ఎంత పెద్ద క్రికెట్‌స్టార్ అయినా... ఇంట్లో మాత్రం పిల్లాడిలా ఉంటారు. మాటల్లో ఎక్కడా అహంభావం కనిపించదు. ఆయన ఒక బాధ్యతను తలకెత్తుకుంటే దానికి న్యాయం చేసే వరకు విశ్రమించరు. ఇప్పుడు కూడా ఆయనకు శారీరక క్రమ శిక్షణ ఎక్కువ. క్రికెట్ ఆడుతున్న సమయంలో శారీరక క్రమశిక్షణను ఎలా పాటించేవారో ఇప్పుడు కూడా అంతే.
అప్పట్లో క్రికెట్‌ను కారణంగా చూపిస్తూ... ‘‘కూర రుచిగా ఉంది. అయినప్పటికీ ఎక్కువ తినను’’ అనేవారు. ఇప్పుడు ఆయన క్రికెట్ ఆడకపోయినప్పటికీ, తిండి విషయంలో ‘‘ఇక చాలు’’ అనే దాంట్లో తేడా లేదు. అలాగే, ఆయనెప్పుడూ ‘ఇలా చేయాలి’, ‘అలా చేయాలి’ అని గంభీరమైన ఉపాన్యాసాలు ఇవ్వరు. ‘‘నువ్వు చేయ గలవు’’ అనే ధైర్యాన్నిస్తారు. ఎవరినీ తక్కువ చేసి మాట్లాడరు. అదే సమయంలో అందరి అభిప్రాయాలకూ విలువ ఇస్తారు.