ప్రొ కబడ్డీ లీగ్ లో భాగంగా మంగళవారం ఇక్కడ గచ్చిబౌలి ఇండోర్ స్టేడియంలోజైపూర్ పింక్ పాంథర్స్ - తెలుగు టైటాన్స్ ల మధ్య జరిగే మ్యాచ్ ను వీక్షించేందుకు పలువురు ప్రముఖులు హాజరుకానున్నారు.
హైదరాబాద్: ప్రొ కబడ్డీ లీగ్ లో భాగంగా మంగళవారం ఇక్కడ గచ్చిబౌలి ఇండోర్ స్టేడియంలోజైపూర్ పింక్ పాంథర్స్ - తెలుగు టైటాన్స్ ల మధ్య జరిగే మ్యాచ్ ను వీక్షించేందుకు పలువురు ప్రముఖులు హాజరుకానున్నారు. జైపూర్ కబడ్డీ టీమ్ బ్రాండ్ అంబాసిడర్ గా వ్యవహరిస్తున్న మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ రేపటి మ్యాచ్ ను వీక్షించేందుకు నగరానికి రానున్నాడు. తొలుత స్పోర్ట్స్ స్టోర్ ను ప్రారంభిచనున్న సచిన్.. తరువాత మ్యాచ్ ను వీక్షించనున్నాడు. దీంతో పాటు జైపూర్ టీం ఓనర్స్ గా ఉన్న ఐశ్వర్యరాయ్-అభిషేక్ బచ్చన్ లు కూడా మ్యాచ్ చూసేందుకు హైదరాబాద్ కు రానున్నారు. హైదరాబాద్ కబడ్డీ టీమ్ బ్రాండ్ అంబాసిడర్ గా ఉన్న ప్రముఖ హీరో అల్లు అర్జున్ మ్యాచ్ కు హాజరై ప్రేక్షకులను ఉత్సాహపరచనున్నాడు.
ప్రస్తుతం తెలుగు టైటాన్స్ ఐదు విజయాలు, 26 పాయింట్లతో రెండో స్థానంలో కొనసాగుతోంది. గత ఏడాది విశాఖపట్నంను హోం గ్రౌండ్‌గా ఉంచుకున్న టీమ్, ఈసారి తమ కేంద్రాన్ని హైదరాబాద్‌కు మార్చింది. మంగళవారం నుంచి గచ్చిబౌలి ఇండోర్ స్టేడియంలో తెలుగు టీమ్ వరుసగా నాలుగు రోజుల పాటు మ్యాచ్‌లు ఆడనుంది.