
తిరుమలలో సచిన్
తిరుపతి అర్బన్: భారత క్రికెట్ దిగ్గజం సచిన్ టెండుల్కర్ బుధవారం రాత్రి తిరుమలకు చేరుకున్నారు. గురువారం వేకువజామున స్వామివారిని దర్శించుకోనున్నారు. సచిన్‌తో పాటు పారిశ్రామికవేత్త నిమ్మగడ్డ ప్రసాద్, హైదరాబాద్ జిల్లా బ్యాడ్మింటన్ సంఘం అధ్యక్షుడు చాముండేశ్వరీనాథ్ కూడా తిరుమలకు చేరుకున్నారు.