పుణే: అల్టిమేట్ ఖో–ఖో లీగ్‌లో భాగంగా రాజస్తాన్ వారియర్స్‌తో జరిగిన మ్యాచ్‌లో తెలుగు యోధాస్ 83–45తో నెగ్గింది. ఈ టోర్నీలో తెలుగు యోధాస్‌కిది మూడో విజయం. అటాకర్ సచిన్, డిఫెండింగ్ అరుణ్ తమ ప్రదర్శనతో తెలుగు యోధాస్ విజయంలో కీలకపాత్ర పోషించారు. ప్రస్తుతం తెలుగు యోధాస్ 9 పాయింట్లతో రెండో స్థానంలో ఉంది.
ఇక ఈ మ్యాచ్‌లో 83 పాయింట్లు స్కోరు చేసిన తెలుగు యోధాస్.. అల్టిమేట్ ఖో-ఖో తొలి సీజన్‌లో ఇప్పటి వరకు 80+ పాయింట్లు సాధించిన తొలి జట్టుగా నిలిచింది. ఇదిలా ఉంటే.. ఈ మ్యాచ్‌లో సచిన్ భార్గో బెస్ట్ అటాకర్‌గా నిలిచాడు. అరుణ్ గుంకీకి బెస్ట్ డిఫెండర్ అవార్డు దక్కింది. ఇక మంగళవారం(ఆగష్టు 23) తెలుగు యోధాస్ తమ తదుపరి మ్యాచ్ ఆడనుంది. ముంబై ఖిలాడీస్‌తో తలపడనుంది.
చదవండి: Ned Vs Pak 3rd ODI: పాపం.. జస్ట్ మిస్! ఆ తొమ్మిది పరుగులు చేసి ఉంటే! కనీసం..
IND vs ZIM 3rd ODI: క్లీన్‌స్వీప్‌పై భారత్ గురి
Comments
Please login to add a commentAdd a comment