'సచిన్, లారా, పాంటింగ్ గ్రేట్ బ్యాట్స్మన్లు కాదు' | Inzamam-ul-Haq is the best batsman, says Shoaib Akhtar | Sakshi
Sakshi News home page

'సచిన్, లారా, పాంటింగ్ గ్రేట్ బ్యాట్స్మన్లు కాదు'

Published Wed, Aug 31 2016 1:29 PM | Last Updated on Mon, Sep 4 2017 11:44 AM

'సచిన్, లారా, పాంటింగ్ గ్రేట్ బ్యాట్స్మన్లు కాదు'

'సచిన్, లారా, పాంటింగ్ గ్రేట్ బ్యాట్స్మన్లు కాదు'

న్యూఢిల్లీ: పాకిస్తాన్ మాజీ క్రికెటర్ షోయబ్ అక్తర్ సంచలన వ్యాఖ్యలు చేశాడు. క్రికెట్ దేవుడు, భారత క్రికెటర్ సచిన్ టెండూల్కర్, వెస్టిండీస్ దిగ్గజం బ్రియాన్ లారా, ఆస్ట్రేలియా గ్రేట్ రికీ పాంటింగ్ తన దృష్టిలో అంత గొప్ప ఆటగాళ్లు కారని పేర్కొన్నాడు. తాను క్రికెట్ ఆడిన దశకంలో ప్రపంచంలో అత్యుత్తమ బౌలర్లలో ఒకడిగా పేరున్న షోయబ్ అక్తర్ బెస్ట్ బ్యాట్స్ మన్ ఈ ముగ్గురిలో ఎవరూ కాదని అభిప్రాయపడ్డాడు. పాక్ మాజీ క్రికెటర్ వసీం అక్రమ్ టాక్ షో లో పాల్గొన్న సందర్భంగా షోయబ్ ఈ విషయాలను వెల్లడించాడు.

'ప్రపంచంలో చాలా మంది గొప్ప బ్యాట్స్ మన్లు ఉన్నప్పటికీ చాలా కష్టమైనా సరే వారిని ఏదో విధంగా ఔట్ చేయగలిగాను. కానీ, తన సహచరుడు, అప్పట్లో జట్టు కెప్టెన్ అయిన ఇంజమామ్ ఉల్ హక్ ను ఔట్ చేయడం చాలా కష్టం. కనీసం నెట్స్ లో ఒక్కసారి కూడా  ఇంజీని ఔట్ చేయలేకపోయాను' అని అక్తర్ వెల్లడించాడు. అతడి ఫుట్ వర్క్ చాలా అద్భుతంగా ఉండటంతో తన బంతిని కచ్చితంగా అంచనా వేసేవాడన్నాడు. అందుకే తన బౌలింగ్ ఎదుర్కొన్న వారిలో ఇంజమామ్ అత్యుత్తమ బ్యాట్స్ మన్ అని, అతడితో సరితూగే బ్యాట్స్ లేడని.. ఎవరితోనూ అతడిని పోల్చలేమని అక్తర్ కొనియాడాడు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement