Lara
-
వేలంలోయువతి కన్యత్వం.. రూ.18 కోట్లకు కొనుగోలు చేసిన హీరో!
'పుర్రెకో బుద్ది.. జిహ్వకో రుచి' అన్నారు పెద్దలు. సమాజంలో కొందరిని చూస్తుంటే ఇది నిజమే అనిపిస్తుంది. నలుగురు ఒకలా ఆలోచిస్తే.. వాళ్లు మరోలా ఆలోచిస్తారు. వారు చేసే పని, చెప్పే మాటలు వింటే..‘ఇలా కూడా ఉంటారా’ అని ఆశ్చర్యపోక తప్పుదు. తాజాగా 22 ఏళ్ల ఓ యువతి తీసుకున్న నిర్ణయం, ఆమె కోసం ఓ హీరో చేసిన ఖర్చు గురించి తెలిస్తే మీరు కూడా షాకవుతారు. డబ్బు కోసం ఓ యువతి ఏకంగా తన కన్యత్వాన్నే వేలానికి పెట్టింది. ఇక్కడ మరో ఆసక్తికర విషయం ఏంటంటే.. వేలంలో వందలాది మంది ధనవంతులు పోటీపడగా.. చివరకు ఓ హాలీవుడ్ హీరో రూ.18 కోట్లకు ఆమె కన్యత్వాన్ని దక్కించుకున్నాడు.వివరాల్లోకి వెళితే.. బ్రిటన్‌లోని మంచెస్టర్‌కు చెందిన 22 ఏళ్ల లారా.. ప్రముఖ ఎస్కార్ట్ ఏజెన్సీ సిండ్రెల్లా వెబ్ సైట్ ద్వారా తన కన్యత్వానికి వేలం నిర్వహించారు. ఈ విషయం తెలియడంతో ఎంతో మంది ఆమెను దక్కించుకునేందుకు పోటీ పడ్డారు. ప్రముఖ వ్యాపారవేత్తలు, సినీ సెలబ్రిటీలో బిడ్లు వేశారు. చివరకు లాస్ ఏంజిల్స్ కు చెందిన హాలీవుడ్ హీరో ఆమె కన్యత్వాన్ని సుమారు 1.7 మిలియన్ డాలర్లకు కొనుగోలు చేశారు. ఇది మన ఇండియన్ కరెన్సీలో రూ.18 కోట్లకు సమానం.కన్యత్వాన్ని అమ్మకానికి పెట్టడంపై లారా స్పందిస్తూ ఈ విషయంలో తనకు ఎలాంటి ఆందోళన, బాధ లేదన్నారు. ‘చాలా మంది అమ్మాయిలు ఎలాంటి ప్రతిఫలం పొందకుండానే తమ కన్యత్వాన్ని కోల్పోతారు. కానీ నేను మాత్రం నా లైఫ్ సెటిల్ చేసుకోవడం కోసం నా కన్యత్వాన్ని వేలం పాట వేయాలని భావించాను. వచ్చిన డబ్బుతో తాను ఆర్థికంగా నిలదొక్కకుంటాను. ఇది పూర్తిగా నా వ్యక్తిగత నిర్ణయం’ అని చెప్పారు. -
సచిన్,లారా రోడ్డు భద్రత పాఠాలు!
-
సచిన్,లారా రోడ్డు భద్రత పాఠాలు!
వాహనాలను నడిపేటప్పుడు హెల్మెట్ ధరించాలని, సీటు బెల్టు పెట్టుకొవాలని ప్రభుత్వాలు అనేక చట్టాలు తెచ్చిన సంగతి తెలిసిందే. దీనిపై , ఇప్పటికి చాలా మంది నిర్లక్ష్యం వహిస్తున్నారు. అయితే, భారతమాజీ క్రికెటర్ సచిన్ టెండుల్కర్, వెస్టిండీస్ ఆటగాడు బ్రియాన్ లారాతో కలిసి రోడ్డు భద్రతపై పలు సూచనలు చేశారు. ప్రస్తుతం ఇది సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. దీనిలో ‘ సచిన్ రోడ్డుపై ప్రయాణించేటప్పుడు హెల్మెట్ ఎంత ముఖ్యమో... మైదానంలో క్రికెట్ ఆడేటప్పుడు కూడా హెల్మెట్ అంతే అవసరమని’ అన్నారు. సరైన హెల్మెట్ ధరించకపోవడంతో చాలామంది తమ ప్రాణాలను కోల్పోతున్నారని తెలిపారు. రోడ్డు భద్రతను ప్రతి ఒక్కరు విధిగా పాటించాలని, సరైన హెల్మెట్ ధరించాలని పేర్కొన్నారు. సచిన్ టెండుల్కర్ చేసిన సూచనలకు బ్రియాన్ లారా ధన్యవాదాలు తెలిపారు. ఈ వీడియోపై భారత మాజీ ఆల్‌రౌండర్ యువరాజ్ సింగ్ స్పందించారు..‘ ఈ వీడియోకు ఆస్కార్ అవార్డు ఇవ్వాలని’ ఫన్నీగా కామెంట్ చేశారు. అయితే, రోడ్‌సెఫ్టీ వరల్డ్ సిరిస్ టీ20 టోర్ని రాయ్‌పూర్‌లో జరుగుతున్న సంగతి తెలిసిందే. ఈ టోర్నిలో ఇండియా లెజెండ్స్, వెస్టిండీస్ లెజెండ్స్‌పై గెలిచి సెమీ ఫైనల్‌కు చేరుకున్నారు. దీనిలో సచిన్ 42 బంతుల్లో 65 పరుగులు చేశాడు. యువరాజ్ సింగ్ 20 బంతులలో 49 పరుగులు చేశారు. అయితే, ఈ మ్యాచ్‌లో భారత్ 20 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 218 పరుగులు చేసింది. తర్వాత బ్యాటింగ్ చేసిన వెస్టిండిస్ 206 పరుగులకే కుప్పకూలింది. చదవండి: రెండు శునకాల బెలూన్ ఆట.. చూస్తే వావ్ అనాల్సిందే! -
లారాను తప్పుగా చిత్రీకరించలేదు
విజయవాడకు చెందిన పవన్ కుమార్ (లారా) కథతో ‘రంగు’ చిత్రం రూపొందింది. తనీష్ ముఖ్య పాత్రలో కార్తికేయ దర్శకత్వం వహించారు. పద్మనాభ రెడ్డి, నల్ల అయ్యన్న నాయుడు నిర్మించారు. ఈ చిత్రంలో లారాను ఎలా చూపించబోతున్నారో మాకు తెలియాలి. మా అనుమతి తీసుకోకుండా సినిమా విడుదల చేస్తే థియేటర్స్‌లో ‘రంగు’ పడనివ్వం అని సోమవారం ప్రెస్‌మీట్ ఏర్పాటు చేశారు లారా బంధువులు. దానికి సమాధానంగా ‘రంగు’ చిత్రబృందం బుధవారం ప్రెస్‌మీట్ నిర్వహించింది. ఈ సందర్భంగా పద్మనాభరెడ్డి మాట్లాడుతూ– ‘‘లారా బంధువుల ఆరోపణలు సబబుగానే అనిపించాయి. కానీ మేం లారాని ఎక్కడా తప్పుగా చూపించలేదు. సినిమా చూస్తే ఆయన మీద మంచి అభిప్రాయమే కలుగుతుంది. ఈ శని, ఆదివారాల్లో లారా కుటుంబ సభ్యులకు షో వేసి చిత్రాన్ని చూపిస్తాం. ఈ నెల 23న సినిమాను రిలీజ్ చేస్తాం’’ అన్నారు. ‘‘మనిషి సమాజంలో ఎలా ఉండకూడదో చెప్పే సినిమా ఇది. లారా పాత్ర, ఐడియాలజీ.. అన్నీ ఈ సినిమాలో ఉంటాయి. సినిమా చూస్తే వాళ్ల కుటుంబ సభ్యులకు కళ్లలో నీళ్లు తిరుగుతాయి’’ అని తనీష్ అన్నారు. ‘‘2011 నుంచి నేను లారాని స్టడీ చేసి ఈ కథ రాసుకున్నాను. ఆయన బావమరిదిని కలవలేదు. కానీ ఆయన స్నేహితులను కలిశాను. సినిమా చూస్తే లారా మన మధ్య ఇంకా తిరుగుతున్నారనే భావన కలుగుతుంది’’ అని కార్తికేయ అన్నారు. చిత్రనిర్మాత నల్ల అయ్యన్న నాయుడు, సహ నిర్మాత వాసు పాల్గొన్నారు. -
'సచిన్, లారా, పాంటింగ్ గ్రేట్ బ్యాట్స్మన్లు కాదు'
న్యూఢిల్లీ: పాకిస్తాన్ మాజీ క్రికెటర్ షోయబ్ అక్తర్ సంచలన వ్యాఖ్యలు చేశాడు. క్రికెట్ దేవుడు, భారత క్రికెటర్ సచిన్ టెండూల్కర్, వెస్టిండీస్ దిగ్గజం బ్రియాన్ లారా, ఆస్ట్రేలియా గ్రేట్ రికీ పాంటింగ్ తన దృష్టిలో అంత గొప్ప ఆటగాళ్లు కారని పేర్కొన్నాడు. తాను క్రికెట్ ఆడిన దశకంలో ప్రపంచంలో అత్యుత్తమ బౌలర్లలో ఒకడిగా పేరున్న షోయబ్ అక్తర్ బెస్ట్ బ్యాట్స్ మన్ ఈ ముగ్గురిలో ఎవరూ కాదని అభిప్రాయపడ్డాడు. పాక్ మాజీ క్రికెటర్ వసీం అక్రమ్ టాక్ షో లో పాల్గొన్న సందర్భంగా షోయబ్ ఈ విషయాలను వెల్లడించాడు. 'ప్రపంచంలో చాలా మంది గొప్ప బ్యాట్స్ మన్లు ఉన్నప్పటికీ చాలా కష్టమైనా సరే వారిని ఏదో విధంగా ఔట్ చేయగలిగాను. కానీ, తన సహచరుడు, అప్పట్లో జట్టు కెప్టెన్ అయిన ఇంజమామ్ ఉల్ హక్ ను ఔట్ చేయడం చాలా కష్టం. కనీసం నెట్స్ లో ఒక్కసారి కూడా ఇంజీని ఔట్ చేయలేకపోయాను' అని అక్తర్ వెల్లడించాడు. అతడి ఫుట్ వర్క్ చాలా అద్భుతంగా ఉండటంతో తన బంతిని కచ్చితంగా అంచనా వేసేవాడన్నాడు. అందుకే తన బౌలింగ్ ఎదుర్కొన్న వారిలో ఇంజమామ్ అత్యుత్తమ బ్యాట్స్ మన్ అని, అతడితో సరితూగే బ్యాట్స్ లేడని.. ఎవరితోనూ అతడిని పోల్చలేమని అక్తర్ కొనియాడాడు.