
సచిన్‌కన్నా కాంబ్లీ ఎక్కువ ప్రతిభావంతుడు!
క్రీడల్లో ఎదిగేందుకు ప్రతిభ ఒక్కటే సరిపోదని, సరైన కుటుంబ వాతావరణం, మంచి స్నేహితులు వంటివి కూడా ప్రభావం చూపిస్తాయని క్రికెట్ దిగ్గజం కపిల్‌దేవ్ అభిప్రాయపడ్డారు. వాస్తవానికి సచిన్‌కంటే వినోద్ కాంబ్లీ ప్రతిభావంతుడే అయినా అతనికి సరైన మార్గదర్శనం లభించక వెనుకబడిపోగా, అందరి ప్రోత్సాహంతో సచిన్ 24 ఏళ్లు భారత్‌కు ఆడగలిగాడని గుర్తు చేశారు. అతని విజయాల్లో కుటుంబం కీలకపాత్ర పోషించిందన్నారు.