ప్రేమ కథకు.. పాటే టైటిల్ | Song is title for love story | Sakshi
Sakshi News home page

ప్రేమ కథకు.. పాటే టైటిల్

Published Sat, May 31 2014 11:10 PM | Last Updated on Sat, Oct 20 2018 5:33 PM

ప్రేమ కథకు.. పాటే టైటిల్ - Sakshi

ప్రేమ కథకు.. పాటే టైటిల్

మౌనమేలనోయి, ఒరేయ్ పండు చిత్ర కథానాయకుడు సచిన్ హీరోగా బండ్ల గణేశ్ నిర్మిస్తున్న చిత్రానికి ‘నీ జతగా నేనుండాలి’ అనే టైటిల్‌ని ఖరారు చేశారు. బాలీవుడ్ బ్లాక్‌బస్టర్ ‘ఆషికి-2’ ఆధారంగా తెరకెక్కుతోన్న ఈ చిత్రానికి కె.రవీంద్ర దర్శకుడు. ఈ సినిమా గురించి నిర్మాత మాట్లాడుతూ -‘‘ఈ సినిమా కోసం చాలా టైటిల్స్ అనుకున్నాం. చివరకు రామ్‌చరణ్ ‘ఎవడు’లోని ‘నీ జతగా నేనుండాలి..’ పాట పల్లవిలోని మొదటి పదాన్ని మా సినిమా టైటిల్‌గా ఖరారు చేశాం.
 
 ఈ కథకు ఆ పేరు సరిగ్గా సరిపోతుంది. ఈ నెల 14 నుంచి పోలెండ్‌లో పది రోజుల పాటు జరిగే చిత్రీకరణతో షూటింగ్ పూర్తవుతుంది’’ అని తెలిపారు. ఈ సంగీత భరిత ప్రేమకథను మనసులకు హత్తుకునే రీతిలో దర్శకుడు తెరకెక్కిస్తున్నారని, హిందీలో లాగే ఇక్కడా ఈ చిత్రం పెద్ద హిట్ అవుతుందని సచిన్ నమ్మకం వెలిబుచ్చారు. ‘‘నా కెంతో ఇష్టమైన ‘ఆషికీ-2’ చిత్రాన్ని తెలుగులో తెరకెక్కించే అవకాశం రావడం నా అదృష్టం’’ అని దర్శకుడు చెప్పారు. ఈ చిత్రానికి సంగీతం: అంకిత్ తివారి, మాటలు: మధుసూదన్, కెమెరా: ఎ.వసంత్, సమర్పణ: శివబాబు బండ్ల.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement