
శీతల్ దేవి.. ఈ పేరుకు ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. రెండు చేతులు లేనప్పటకి ప్యారిస్ పారాలింపిక్స్‌లో పతకం సాధించి చరిత్ర సృష్టించింది. పట్టుదల ఉంటే ఎదైనా సాధించవచ్చు అని శీతల్ నిరూపించింది.
తన సంకల్పాన్ని, ప్రతిభను వైక్యల్యం ఏ మాత్రం ఆడ్డుకోలేకపోయింది. ఆర్చరీ మహిళల వ్యక్తిగత విభాగంలో శీతల్ గురితప్పినప్పటకి.. డబుల్స్‌లో మాత్రం పతకంతో మెరిసింది. జమ్ముకాశ్మీర్‌లోని మారుమూల ప్రాంతానికి చెందిన శీతల్.. విశ్వవేదికపై సత్తాచాటి ఎంతో మందికి ఆదర్శంగా నిలిచింది.
మరో శీతల్..
ఇప్పుడు మరో శీతల్ ప్రపంచానికి పరిచయం అవ్వడానికి సిద్దమవుతోంది. జమ్మూ కాశ్మీర్‌లోని కిష్త్వార్ ప్రాంతంలోని లోయిదార్ గ్రామానికి చెందిన ఓ వికలాంగ యువతి ఆర్చర్‌గా తన ప్రాక్టీస్ మొదలు పెట్టింది.
సదరు యువతి శీతల్ సొంత గ్రామానికి చెందిన ఆమె కావడం విశేషం. ఆ 13 ఏళ్ల అమ్మాయి కోచ్ కుల్దీప్ వెద్వాన్ మార్గదర్శకత్వంలో విలువిద్యలో శిక్షణ పొందుతోంది. అయితే ఈ అమ్మాయికి పూర్తిగా కాళ్లు చేతులు కూడా లేకపోవడం గమనార్హం.
అయినప్పటకి తన సదరు యువతి పారాలింపిక్సే లక్ష్యంగా పెట్టుకుంది. పారా-ఆర్చరీ కోసం రూపొందించబడిన కృత్రిమ విల్లు సాయంతో ఆమె ప్రాక్టీస్ చేస్తోంది. కృత్రిమ కాలితోనే విల్లును పట్టి.. భుజంతో తాడును లాగి బాణం విసిరి అందరిని ఆమె ఆకట్టుకుంటుంది.త ఆమె టాలెంట్‌కు నెటిజన్లు పిధా అవుతున్నారు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరలవుతోంది. కాగా శీతల్ కోచ్ కూడా కుల్దీప్ వెద్వాన్ కావడం విశేషం.
After taking Inspiration from Sheetal Devi 🏹
A 13 Year old girl without arms or legs has started chasing her dreams through Archery 🥹 pic.twitter.com/BNczd7Jhc6— The Khel India (@TheKhelIndia) September 8, 2024