
ప్యారిస్ ఒలింపిక్స్ భారత్ పతకాల వేట కొనసాగుతోంది. భారత్ ఖాతాలో మరో గోల్డ్ వచ్చి చేరింది. నవదీప్ సింగ్ పురుషుల జావెలిన్ త్రో ఎఫ్-41 విభాగంలో స్వర్ణ పతకాన్ని దక్కించుకున్నాడు. అయితే నవదీప్ సింగ్‌కి ఈ గోల్డ్ మెడల్ అనూహ్యంగా దక్కింది.
శనివారం ఆర్ధరాత్రి జరిగిన ఫైనల్లో 47.32 మీటర్ల త్రో విసిరిన నవదీప్ సింగ్.. తొలుత రెండో స్ధానంలో నిలిచి రజత పతకంతో సరిపెట్టుకోవలసి వచ్చింది. ఇదే విభాగంలో ఇరాన్ కు చెందిన అథ్లెట్ సదేగ్ బీత్ సయా 47.64 మీటర్ల దూరం విసిరి అగ్రస్ధానంలో నిలిచాడు.
అయితే అంతర్జాతీయ పారాలింపిక్ కమిటీ నిబంధనలు ఉల్లంఘించినందుకు సదేగ్ బీత్‌పై అనర్హత వేటు పడింది. ఈవెంట్‌లో రెండు సార్లు అతడు ఎల్లో కార్డ్ అందుకున్నాడు. ఫలితంగా ఆఖరికి రెండ్ కార్డ్‌తో పతకానికి అనర్హుడయ్యాడు. అనూహ్యంగా అతనిపై వేటు పడటంతో.. ఆ తరువాత స్థానంలోగా నిలిచిన నవదీప్ సింగ్ రజత పతకం కాస్తా స్వర్ణంగా మారింది.
కాగా పారాలింపిక్ కమిటీ 8.1 నియమం ప్రకారం.. క్రీడలో అథ్లెట్ల దురుస ప్రవర్తన, తమ జాతీయ జెండాను తప్పించి మరే ఇతర పతాకాలను ప్రదర్శించకూడదు. ఒకవేళ ఈ నిబంధనలను అథ్లెట్లు ఉల్లంఘిస్తే రెండు పసుపు కార్డులు అందుకుంటారు. ఫ
లితంగా రెడ్ కార్డు(అనర్హత) ఎదుర్కోవాల్సి ఉంటుంది. ఈ ఈవెంట్‌లో సదేగ్ బీత్ సయా తమ జాతీయ జెండా బదులుగా నల్ల జెండాను ప్రదర్శించినట్లు తెలుస్తోంది. ఈ క్రమంలోనే అతడిపై పారాలింపిక్ కమిటీ వేటు వేసినట్లు సమాచారం. ఇక పారాలింపిక్స్ ప్రస్తుతం భారత్ పతకాల సంఖ్య 29కి చేరింది.
చదవండి: రిటైర్మెంట్ ప్రకటించిన ఇంగ్లండ్ స్టార్ క్రికెటర్..