Odia Actress Sheetal Patra Accused Filmmaker Dayanidhi Dahima Over Leaked MMS Video - Sakshi
Sakshi News home page

Sheetal Patra: నా ప్రైవేట్‌ వీడియోలు లీక్‌ చేశాడు.. నిర్మాతపై నటి సంచలన ఆరోపణలు!

Published Tue, Aug 1 2023 5:12 PM | Last Updated on Tue, Aug 1 2023 5:38 PM

Sheetal Patra accused filmmaker dayanidhi dahima leaked video of actress - Sakshi

సినీ ఇండస్ట్రీ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ముఖ్యంగా సినీ ఇండస్ట్రీలో క్యాస్టింగ్ కౌచ్‌ ఎప్పుడు ఏదో ఒక సందర్భంలో వినిపిస్తూనే ఉంటుంది. అవకాశాల కోసం కొందరు అడ్డదారులు తొక్కితే.. మరికొందరు తన టాలెంట్‌పైనే నమ్మకంతో ఉంటారు. అలా సినీ ఇండస్ట్రీలోనూ లైంగిక వేధింపుల బారిన పడిన వారు కూడా ఉన్నారు. తాజాగా ఒడిషా నటి శీతల్ పాత్ర ఓ నిర్మాత తనను మోసం చేశాడంటూ పోలీసులను ఆశ్రయించింది. అంతే కాకుండా తన ప్రైవేట్ వీడియోలు, ఫోటోలు సోషల్ మీడియాలో లీక్ చేశాడని ఆరోపించింది. నటి ఫిర్యాదుతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. 

(ఇది చదవండి: శరీరమంతా స్క్రూలు, రాడ్‌లు.. బతకడం కష్టమేనన్నారు: నటి)

ఒడియా నటి శీతల్ పాత్రా చిత్రనిర్మాత దయానిధి దహిమాపై సంచలన ఆరోపణలు చేశారు. జూలై 28న భువనేశ్వర్‌లోని లక్ష్మీసాగర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. దయానిధి ఎంటర్‌టైన్‌మెంట్ యజమానిగా ఉన్న దయానిధి తనపై లైంగిక, మానసిక వేధింపులకు పాల్పడ్డారని ఫిర్యాదులో పేర్కొంది. తనను బ్లాక్‌మెయిల్‌ చేస్తున్నాడని.. తనకు ఇచ్చిన అన్ని రెమ్యునరేషన్‌లను తిరిగి ఇవ్వాలని డిమాండ్ చేశారని నటి ఆరోపించింది. అంతేకాకుండా తన ఫోటోలు, వీడియోలను నెట్టింట్లో పెడతానని బెదిరించాడని తెలిపింది.

భౌతిక దాడి
 దయానిధి తనపై భౌతిక దాడికి పాల్పడ్డారని శీతల్ పాత్ర పోలీసులకు వివరించింది. తాను చదివే కళాశాలలో విద్యార్థుల ముందే తనపై  తన యూనిఫామ్‌ను చించేశాడని.. తనకు తీవ్రమైన అవమానానికి గురి చేశాడని పేర్కొంది. తన ప్రతిష్టను దిగజార్చడానికి సోషల్ మీడియాలో అసభ్యకరమైన పోస్టులు పెడుతున్నాడని.. అంతే కాకుండా తన కుటుంబ సభ్యులను కూడా లక్ష్యంగా చేసుకుని కించపరిచేందుకు చిత్రనిర్మాత తప్పుడు సమాచారాన్ని ఉపయోగించారని నటి పేర్కొంది. అయితే తాను గత కొన్నేళ్లుగా నిర్మాతతో లివ్ ఇన్‌ రిలేషన్ ఉన్నట్లు తెలిపింది. అందుకే తనను మోసం చేశాడని నటి ఫిర్యాదులో పేర్కొంది. 

శీతల్ పాత్ర మాట్లాడుతూ..'మొదట అతను నాతో సన్నిహితంగా ఉన్నప్పుడు మా ఫోటోలు, వీడియోలను రికార్డ్ చేసేవాడు. అప్పుడు వాటిని నేనేమీ పట్టించుకోలేదు. అతను ఉద్దేశపూర్వకంగా ఇలా చేస్తున్నాడని నేను అనుకోలేదు. నేను అతనిని పూర్తిగా నమ్మాను. ఆయనతో సినిమా కూడా చేశాను. అంతేకాకుండా సినిమాకి రెమ్యునరేషన్ కూడా ఇవ్వలేదు. అప్పటి నుంచి మా మధ్య సంబంధాలు తెగిపోయాయి. ఆ తర్వాత నన్ను చాలా అసభ్యకరంగా దూషించేవాడు. ఇప్పుడు ఏకంగా నా ప్రైవేట్ వీడియో, ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేశాడు.' అంటూ వాపోయింది. ఈ ఫిర్యాదు ఆధారంగా నిర్మాత దయానిధి దాహిమాపై కేసు నమోదు చేసి దర్యాప్తు కొనసాగిస్తున్నారు. 

నిర్మాతతో లివ్ ఇన్‌ రిలేషన్
కాగా.. నటనతో పాటు ఈ జంట కొన్నేళ్లుగా ఒకే ఇంట్లో ఉంటున్నారు. చాలా సినిమాల్లో కలిసి పనిచేశారు. ఆ తర్వాత కూడా నటి మరో సినిమా నిర్మాతతో సినిమా చేయబోతుండడంతో దయానిధి కళ్లు ఎర్రబడ్డాయి. వేరే నిర్మాతలతో సినిమా తీయడం తనకు ఇష్టం లేదని.. నా ప్రొడక్షన్‌లో మాత్రమే నటించాలని ఆమెను బెదిరించాడు. దీనికి అంగీకరించక పోవడంతో నటిని వేధించడం ప్రారంభించాడు. గత రెండేళ్లుగా ఇదే తంతు జరుగుతోంది. తాజాగా ప్రైవేట్ వీడియోలు లీక్ కావడం ఒడిశా సినీ ఇండస్ట్రీలో సంచలనంగా మారింది. 

(ఇది చదవండి: మీరు నా జీవితంలోకి రావడం నా ప్రయాణానికి నాంది: మంచు మనోజ్ )


 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement