యానిమల్ చిత్రంతో ఒక్కసారిగా స్టార్ డమ్ సొంతం చేసుకున్న నటి త్రిప్తి డిమ్రీ. ఈ చిత్రంలో ఆమె నటనకు బాలీవుడ్‌తో పాటు దక్షిణాదిలోనూ ఫ్యాన్స్ ఫిదా అయ‍్యారు. సందీప్ వంగా దర్శకత్వంలో వచ్చిన ఈ సూపర్ హిట్ చిత్రంలో జోయా పాత్రలో అందరి దృష్టిని ఆకర్షించింది. దీంతో త్రిప్తి ఒక్కసారిగా ఓవర్‌నైట్ స్టార్ అయిపోయింది. అంతే కాకుండా రణ్‌బీర్ కపూర్‌తో కెమిస్ట్రీ అదిరిపోయిందంటూ కొందరు నెటిజన్స్ కామెంట్స్ చేశారు.
కొందరైతే ఏకంగా మీరే మాకు నేషనల్ క్రష్ అంటూ పోస్టులు పెడుతున్నారు. అంతలా ఫేమ్ తెచ్చుకున్న భామ తర్వాత ఏ ప్రాజెక్ట్‌లో చేయనుందన్న విషయంపై అభిమానుల్లో ఆసక్తి నెలకొంది. సౌత్ సినిమాల్లో నటించనున్నట్లు వస్తోన్న వార్తలపై తాజా ఇంటర్వ్యూలో స్పందించారు. ఆ వివరాలేంటో తెలుసుకుందాం.
త్రిప్తి మాట్లాడుతూ.. 'నేను ఇప్పటిదాకా సౌత్‌లో ఏ సినిమాకు సంతకం చేయలేదు. నాకు ఇక్కడ కూడా అవకాశాలు వస్తే బాగుంటుందని కోరుకుంటున్నా. దక్షిణాదిలో జూనియర్ ఎన్టీఆర్ సరసన నటించాలని ఉంది' అంటూ మనసులో మాటను బయట పెట్టేసింది ముద్దుగుమ్మ. అని తెలిపారు. ఆ తర్వాత యానిమల్ చిత్రం గురించి పలు ఆసక్తికర విషయాలు పంచుకుంది.
యానిమల్ విడుదలకు ముందు ఎన్నో నిద్రలేని రాత్రులు గడిపినట్లు చెప్పుకొచ్చింది. నా ప్రతిభకు ప్రశంసలు దక్కడం చాలా ఆనందంగా ఉందని తెలిపారు. ఇదిలా ఉండగా యానిమల్ తర్వాత త్రిప్తికి ఇన్‌స్టాలో ఫాలోయింగ్ భారీగా పెరిగింది. కాగా.. ఎన్టీఆర్-ప్రశాంత్ నీల్ కాంబోలో రాబోయే సినిమాలో త్రిప్తి డిమ్రీని ఎంపిక చేయాలంటూ సోషల్ మీడియాలో ఫ్యాన్స్ కామెంట్స్ చేస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment