బాలీవుడ్‌లో నెపోటిజం దగ్గర నుంచి చాలారకాల దందాలు నడుస్తుంటాయి. స్టార్ హీరోలు, వాళ్ల పిల్లలకు మాత్రమే ఛాన్సుల్లాంటివి వస్తుంటాయి. ఇక కొందరు రివ్యూయర్స్ కూడా సౌత్ సినిమాలు, దర్శకుల్ని కావాలనే టార్గెట్ చేస్తుంటారు. ప్రస్తుతం 'సలార్' మీద కూడా అలాంటి దాడే జరుగుతోంది. అయితే బాలీవుడ్ సెలబ్రిటీలు, రివ్యూయర్లకు వంగా బ్రదర్స్ ఇచ్చిపడేస్తున్నారు. మొన్నీ మధ్య సందీప్ రెడ్డి వంగా రెచ్చిపోగా.. తాజాగా ఇతడి అన్న, 'యానిమల్' నిర్మాత ప్రణయ్ రెడ్డి.. బాలీవుడ్‌లోని మరో స్కామ్ గురించి రివీల్ చేశాడు.
తాజాగా తెలుగులో ఓ మీడియా ఛానెల్‌కి ఇచ్చిన ఇంటర్వ్యూలో నిర్మాత ప్రణయ్ రెడ్డి వంగా.. 'కార్పొరేట్ బుకింగ్స్' స్కామ్ అనేది బాలీవుడ్‌లో ఉంటుందని, దాన్ని ఫాలో అయ్యుంటే తమ 'యానిమల్' మూవీ.. ఎప్పుడో రూ.1000 కోట్ల కలెక్షన్స్ దాటేసి ఉండేదని చెప్పుకొచ్చాడు. కానీ మేం అలా చేయలేదని.. 'యానిమల్' సినిమా వసూళ్లన్నీ పూర్తిగా నిజమని క్లారిటీ ఇచ్చాడు. దీంతో అసలేంటి 'కార్పొరేట్ బుకింగ్స్' స్కామ్ అని అందరూ అనుకుంటున్నారు.
(ఇదీ చదవండి: 'సలార్' వీకెండ్ కలెక్షన్స్.. ఏకంగా రూ.400 కోట్ల దాటేసి..!)
'కార్పొరేట్ బుకింగ్ స్కామ్' అంటే.. బాలీవుడ్‌లో స్టార్ హీరో సినిమా ఏదైనా రిలీజ్ అయిందనుకోండి. దానికి బజ్ తక్కువగా ఉన్నా లేదంటే ఓపెనింగ్స్ పెద్దగా రావనే డౌట్ ఉంటే.. నిర్మాతలు బల్క్ బుకింగ్స్‌పై ఆసక్తి చూపిస్తారు. అంటే.. ఓ పెద్ద సంస్థలో పనిచేసే ఉద్యోగులు అందరికీ సదరు కంపెనీనే ఫ్రీగా టికెట్స్ ఇస్తుంది. ఈ సంస్థకు నిర్మాత లేదా హీరోకి సంబంధించిన ఎవరో ఒకరి నుంచి టికెట్స్‌కి సంబంధించిన డబ్బు వస్తుంది. దీంతో బుకింగ్ యాప్స్‌లో షోలన్నీ ఫుల్ అయినట్లు కనిపిస్తాయి. సినిమా నిజంగా హిట్ ఏమో అని సగటు ప్రేక్షకుడు అనుకుంటాడు.
ఇలా బాలీవుడ్‌లో పలువురు స్టార్ హీరోలు.. ఈ రకంగా పలు కంపెనీలతో మాట్లాడుకుని ఎక్కువ టికెట్స్ అమ్ముడయ్యేలా చూస్తారు. తద్వారా రూ.1000 కోట్ల మార్క్ అనేది చాలా సులభంగా రీచ్ అవుతారు. ఇండస్ట్రీలో ఉండేవాళ్లకు ఇది తెలియొచ్చు కానీ బయటవాళ్లకు ఇది తెలిసే ఛాన్స్ లేదు. తాజాగా నిర్మాత ప్రణయ్ రెడ్డి వంగా చెప్పడంతో దీని బండారం బయటపడింది. ఇదే ఇంటర్వ్యూలో ప‍్రణయ్ మాట్లాడుతూ.. 'కార్పొరేట్ స్టార్' అని కూడా అన్నాడు. ఇది షారుక్‌ని ఉద్దేశించి అన్నట్లే అనిపించింది.
(ఇదీ చదవండి: Bigg Boss 7 విన్నర్ పల్లవి ప్రశాంత్ షాకింగ్ డెసిషన్.. వాళ్లపై రివేంజ్!?)
Comments
Please login to add a commentAdd a comment