బాలీవుడ్ స్టార్ రణ్‍బీర్ కపూర్- రష్మిక మందన్న నటించిన యానిమల్ సినిమా కలెక్షన్లతో పాటు సోషల్ మీడియాలో కూడా ట్రెండింగ్‌లో ఉంది. టాలీవుడ్ డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా తెరకెక్కించిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద ఏ మాత్రం తగ్గడం లేదు. డిసెంబర్ 1న విడుదలైన ఈ చిత్రం మొదటి రోజు నుంచే కలెక్షన్స్ విషయంలో జోరు కొనసాగిస్తుంది. ఇప్పుటికే పలు రికార్డులు బద్దలు కొట్టంది. యానిమల్ సినిమా 15 రోజుల్లో ప్రపంచవ్యాప్తంగా రూ.797.6 కోట్ల గ్రాస్ కలెక్షన్లను సాధించింది.
డిసెంబర్ 16న ఎంత కలెక్ట్ చేసింది ఇంకా ప్రకటించలేదు. కానీ రూ. 800 కోట్ల క్లబ్‌లో యానిమల్ చేరిపోయింది అని చెప్పవచ్చు. ఈ సినిమా ఎంత హిట్ అయిందో తెలిసిందే కానీ యానిమల్‌లోని పాటలు కూడా ట్రెండింగ్‌లో నిలిచాయి. తాజాగా ఈ సినిమా నుంచి 'జమాల్ కుడు' అనే పాటకు సంబంధించిన వీడియోను మేకర్స్ విడుదల చేశారు. బాబీ డియోల్ ఈ పాటతోనే ఎంట్రీ ఇస్తాడు. ఆ పాట ప్రస్తుతం సోషల్ మీడియాలో చాలా పాపులర్ అయింది.
బాబీ డియోల్ మాదిరి అందరూ తలపై ఒక గ్లాసు పెట్టుకుని డ్యాన్సులు చేస్తున్నారు. ఇందుకు సంబంధించిన షార్ట్ వీడియోలు ఇంటర్నెట్‌లో దుమ్మురేపుతున్నాయి. ఈ పాటకు సంబంధించిన వీడియో తాజాగా యూట్యూబ్‌లో విడుదలైంది. కొన్ని గంటల్లోనే 1 మిలియన్‌కు పైగానే వ్యూస్‌తో దూసుకుపోతుంది.
Comments
Please login to add a commentAdd a comment