'యానిమల్' సినిమాతో టాలీవుడ్‌లో ఎక్కువగా వినిపిస్తున్న పేరు త్రిప్తి డిమ్రి . ఆ సినిమాలో తన నటనతో యువ హృదయాలను కొల్లగొట్టింది ఈ బ్యూటీ. 'జోయ' పాత్రలో ఆకట్టుకున్న ఈ ముద్దుగుమ్మ ఆ సినిమాతో లక్షల మంది అభిమానులను సొంతం చేసుకుంది. ఐఎండీబీ (ఇండియన్ మూవీ డేటాబేస్) ఇటీవల విడుదల చేసిన మోస్ట్ పాపులర్ హీరోయిన్ల జాబితాలోనూ ఆమె మొదటి స్థానంలో నిలిచింది. అంతలా యానిమల్ సినిమాతో ఆమె కిక్ ఇచ్చింది. ఆమెకు బాలీవుడ్, టాలీవుడ్‌లలో వరుస అవకాశాలు వస్తున్నాయనే వార్తలు కూడా వైరలవుతున్నాయి.
ఫిబ్రవరి 23న త్రిప్తి డిమ్రి 30వ వసంతంలోకి అడుగుపెట్టింది. తన పుట్టినరోజు కావడంతో సోషల్ మీడియా ద్వారా అభిమానులు శుభాకాంక్షలు తెలిపారు. ఈ క్రమంలోనే ఆమె ప్రియుడు సామ్ మర్చంట్ కూడా ఆమెకు బర్త్ డే విషెస్ తెలిపాడు. త్రిప్తితో తీసుకున్న ఒక సెల్ఫీని తన ఇన్‌స్టాగ్రామ్ స్టోరీలో షేర్ చేస్తూ విష్ చేశాడు. 'నా ప్రియమైన త్రిప్తికి శుభాకాంక్షలు’ అంటూ తెలిపాడు సామ్ మర్చంట్. ప్రస్తుతం వీరిద్దరి సెల్ఫీ నెట్టింట తెగ వైరల్ అవుతుంది. దీంతో త్రిప్తి ప్రేమ విషయం మరోసారి తెరపైకి వచ్చింది.
ఇంతకీ సామ్ మర్చంట్ ఎవరు ? అంటూ వివరాల కోసం త్రిప్తి ఫ్యాన్స్ గూగుల్‌లో వెతుకుతున్నారు. సామ్‌మర్చంట్ తొలుత మోడల్‌గా పనిచేసి ప్రస్తుతం వ్యాపారవేత్తగా రాణిస్తున్నారు. గోవాలో అతనికి బీచ్ క్లబ్స్‌తో పాటు పలు హోటల్స్ ఉన్నాయని తెలిసింది. వారిద్దరి మధ్య ఉన్న రిలేషన్ షిప్ గురించి అధికారికంగా ఇద్దరూ ఇప్పటి వరకు తెలుపలేదు.
Comments
Please login to add a commentAdd a comment