సందీప్ వంగా దర్శకత్వంలో వచ్చిన యానిమల్ చిత్రం గతేడాదిలో విడుదలయి సూపర్ హిట్ కొట్టింది. బాక్సాఫీస్ వద్ద భారీగా కలెక్షన్ల వర్షం కురిపించింది. ఈ చిత్రంలోని నటీనటులకూ మంచి గుర్తింపు వచ్చింది. వారిలో త్రిప్తి డిమ్రి బాగా హైలెట్ అయ్యారు. ఈ సినిమా తర్వాత ఆమె పేరు సోషల్ మీడియాలో నేషనల్ క్రష్‌గా కూడా తెగ చక్కర్లు కొట్టింది. సినిమా వచ్చి చాలా రోజులే అయినా.. ప్రస్తుతం ఆమె రెమ్యునరేషన్ గురించి నెట్టింట ఓ వార్త చక్కర్లు కొడుతుంది.
ఈ సినిమాలో రణ్‌బీర్ కపూర్‌తో ఇంటిమేట్ సీన్‌లో నటించి యూత్‌కు దగ్గరైంది త్రిప్తి. యానిమల్ సినిమాలో నటించినందుకు కేవలం రూ.40 లక్షలు మాత్రమే పారితోషకం కింద ఇచ్చారట. ఈ సినిమా చేస్తున్న సమయంలో ఆమె ఎవరో ప్రేక్షకులకు పెద్దగా తెలియదు. అంతే కాకుండా సినిమాలో కూడా ఆమె కొంత సమయం మాత్రమే కనిపిస్తుంది. అందువల్ల ఆమె తక్కువ పారితోషకానికే యానిమల్‌కు ఒప్పుకుంది. కానీ యానిమల్ చిత్రం బిగ్గెస్ట్ హిట్ కావడంతో త్రిప్తి గ్రాఫ్ అమాంతం పెరిగిపోయింది. ప్రస్తుతం ఆమె ఒప్పుకుంటున్న సినిమాలకు భారీగానే డిమాండ్ ఉంది.
తాజాగా ఆమె 'భూల్ భులయా'లో చిత్రంలో నటిస్తుంది. అందులో స్పెషల్ రోల్ నటిస్తున్నందుకు ఆమె కోటి రూపాయలు రెమ్యునరేషన్‌గా తీసుకుంటుందట. ఈ సినిమా హిట్ అయితే త్రిప్తి డుమ్రి మరో కోటి పెంచడం ఖాయం అని చెప్పవచ్చు. మేరే మెహబూబ్ మేరే సనమ్, విక్కీ విద్యా కా వో వాలా వీడియో సినిమాలతో బిజీగా ఉన్నారు. తెలుగులోనూ ఆమెకు అవకాశాలు వస్తున్నట్లు తెలుస్తోంది. విజయ్ దేవరకొండ - గౌతమ్ తిన్ననూరిల స్పై థ్రిల్లర్‌లో త్రిప్తి నటించనున్నట్లు తెలుస్తోంది. రవితేజ హీరోగా అనిల్ రావిపూడి తెరకెక్కించనున్న చిత్రంలోనూ ఆమెను ఎంపిక చేసినట్లు టాక్.
Comments
Please login to add a commentAdd a comment