బాలీవుడ్ నటుడు కునాల్ ఠాకూర్ తాజాగా వివాహం చేసుకున్నాడు. హిందీ చిత్రసీమకు చెందిన ముక్తి మోహన్‌ను ఆయన పెళ్లి చేసుకున్నాడు. బాలీవుడ్‌లో ముక్తి మోహన్ మంచి డ్యాన్సర్‌గా గుర్తింపు పొందింది. ఇన్‌స్టాగ్రామ్‌లో వారిద్దరూ ఆ ఫోటోలను షేర్ చేశారు. అభిమానుల ఆశీస్సులు కోరారు. పలువురు సినీ ప్రముఖులు ఈ నూతన వధూవరులకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు.
కబీర్ సింగ్, యానిమల్ తదితర చిత్రాల్లో కునాల్ ఠాకూర్ నటించాడు. సందీప్ రెడ్డి వంగా డైరెక్షన్‌లో వచ్చిన యానిమల్ సినిమాలో హీరోయిన్‌గా నటించిన రష్మిక మందన్నతో నిశ్చితార్థం చేసుకునే అబ్బాయిగా కునాల్ కనిపించాడు. ముక్తి మోహన్ కూడా బాలీవుడ్‌లో నటనతోపాటు ఆమె మంచి డ్యాన్సర్‌గా గుర్తింపు తెచ్చుకుంది. తెలుగులో రవితేజ 'దరువు' చిత్రంలో ఓ ఐటెం సాంగ్‌లో ఆమె కనిపించింది. లస్ట్ స్టోరీస్ 2, థార్ వంటి సినిమాల్లో కూడా ఆమె మెప్పించింది. దిల్ హై హిందుస్తానీ 2 బుల్లితెర ప్రోగ్రామ్‌లో ఆమె హోస్ట్‌గా కనిపించింది.
రణ్‌బీర్ కపూర్, రష్మిక మందన్నా జంటగా నటించిన చిత్రం యానిమల్. తెలుగు దర్శకుడు సందీప్ రెడ్డి వంగా తెరకెక్కించిన ఈ చిత్రం బాక్సాఫీస్ ప్రభంజనం సృష్టిస్తోంది. విడుదలైన రోజే వంద కోట్లకు పైగా వసూళ్లు సాధించిన ఈ చిత్రం.. తొమ్మిది రోజుల్లో ప్రపంచవ్యాప్తంగా రూ.660.89 కోట్ల వసూళ్లు రాబట్టింది.
Comments
Please login to add a commentAdd a comment