యానిమల్‌పై మండిపడ్డ స్టార్‌ హీరోయిన్‌.. ఆ విషయంలో నేనైతే! | Taapsee Pannu Comments On Animal Movie Goes Viral | Sakshi
Sakshi News home page

Taapsee Pannu: యానిమల్‌ మూవీ.. నేను అలా చేయనంటోన్న తాప్సీ!

Published Tue, Jan 30 2024 4:10 PM | Last Updated on Tue, Jan 30 2024 4:21 PM

Taapsee Pannu Comments On Animal Movie Goes Viral - Sakshi

సినీ ఇండస్ట్రీలో డేరింగ్ హీరోయిన్‌ ఎవరంటే తాప్సీనే. తనకు నచ్చకపోయినా.. తనకు తోచింది ఏదైనా బయటకు చెప్పే మనస్తత్వం ఆమెది. టాలీవుడ్‌లో ‘ఝుమ్మంది నాదం’తో ఎంట్రీ ఇచ్చిన హీరోయిన్‌ తాప్సీ.. తొలి సినిమాతోనే తెలుగు ప్రేక్షకుల మనసు దోచుకుంది. ఆ తర్వాత బాలీవుడ్‌లో అడుగుపెట్టి అక్కడ కూడా మంచి గుర్తింపు తెచ్చుకుంది. అయితే గతంలో తెలుగు దర్శకులపై అనుచిత వ్యాఖ్యలు చేసి తీవ్ర వ్యతిరేకత ఎదుర్కొన్నారు. తాజాగా నటి రష్మిక మందన్నను కించపరిచే విధంగా వ్యాఖ్యలు చేసి మరోసారి వార్తల్లో నిలిచారు. ఈసారి ఏకంగా బాలీవుడ్‌లో వసూళ్ల వర్షం కురిపించిన యానిమల్‌ చిత్రంపై  విమర్శించడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. 

తాజాగా తాప్సీ సైతం తనదైన శైలిలో యానిమల్‌ చిత్రంపై విమర్శలు చేశారు. తానైతే ఈ చిత్రంలో నటించేదాన్ని కాదని పేర్కొన్నారు. ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. చిత్ర పరిశ్రమకు చెందిన నటీనటులకు ఒక పవర్‌ ఉంటుందని.. అదే విధంగా సమాజంపై బాధ్యత ఉంటుందని అన్నారు. అలాగని యానిమల్‌ తరహా చిత్రాల్లో నటించే.. ఇతర తారలు ఇలాంటివీ పట్టించుకుంటే బాగుంటుందని తాను చెప్పలేనన్నారు. అది వారి వ్యక్తిగత విషయమని తాప్సీ పేర్కొన్నారు. మనం ప్రజాస్వామ్య దేశంలో ఉన్నామని, నచ్చింది చేసే హక్కు అందరికీ ఉంటుందన్నారు. అయితే తానైతే యానిమల్‌ చిత్రంలో నటించడానికి సమ్మతించేదాన్ని కాదని ఫుల్ క్లారిటీ ఇచ్చారు. 

కాగా.. బాలీవుడ్ స్టార్ హీరో రణ్‌బీర్‌కపూర్‌, రష్మిక మందన్నా జంటగా నటించి చిత్రం యానిమల్‌. అర్జున్‌రెడ్డి ఫేమ్ సందీప్‌రెడ్డి వంగా దర్శకత్వం వహించారు. ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్లు రాబట్టింది. అయినప్పటికీ ఈ చిత్రంపై విమర్శలు సైతం అదేస్థాయిలో వచ్చాయి. మహిళల పట్ల హింసాత్మక సంఘటనలు, వ్యతిరేక సన్నివేశాలు ఉన్నాయంటూ తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. నటి రాధికా శరత్‌కుమార్‌ యానిమల్‌ అసలు చిత్రమే కాదంటూ తీసి పారేశారు. ప్రముఖ గాయకుడు శ్రీనివాస్‌ ఆది జంతువుల కోసం తీసిన చిత్రం అని పేర్కొన్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement