‘యానిమల్‌’లో హీరో బ్రహ్మానందం అయితే.. వీడియో వైరల్‌ | Brahmanandam In And As Animal Movie, Spoof Video Goes Viral | Sakshi
Sakshi News home page

‘యానిమల్‌’లో హీరో బ్రహ్మానందం అయితే.. వీడియో వైరల్‌

Published Sat, Dec 9 2023 6:50 PM | Last Updated on Sat, Dec 9 2023 7:13 PM

Brahmanandam In And As Animal Movie, Spoof Video Goes Viral - Sakshi

సోషల్‌ మీడియాలో కమెడియన్‌ బ్రహ్మానందానికి ఉన్న క్రేజ్‌ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఆయన నెట్టింట యాక్టివ్‌గా ఉండరు కానీ..ఆయన మీమ్స్‌ మాత్రం వైరల్‌ అవుతుంటాయి. సినిమాపైనే కాదు ట్రెండింగ్‌లో ఏ అంశం ఉన్నా..బ్రహ్మానందంపై మీమ్స్‌ రెడీ అయిపోతుంటాయి. అవి చూస్తే చాలు.. సీరియస్‌ అంశం అయినా సరే..పగలబడి నవ్వేస్తాం.

తాజాగా బ్రహ్మానందంకు సంబంధించిన ఓ స్ఫూప్‌ వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతుంది. అది ‘యానిమల్‌’సినిమాపై చేసిన స్ఫూప్‌ వీడియా. రణ్‌బీర్ కపూర్, రష్మిక జంటగా నటించిన ఈ చిత్రం డిసెంబర్‌ 1న విడుదలైంది. మొదటి రోజే పాజిటివ్ రావడంతో పాటు విమర్శకులు ప్రశంసలు అందుకుంది. ప్రస్తుతం ఈ సినిమా బాక్సాఫీస్‌ని షేక్‌ చేస్తుంది. ఇప్పటికే రూ. 600 కోట్లకు పైగా వసూళ్లను రాబట్టింది.

ఈ చిత్రంలో రణ్‌బీర్‌ కపూర్‌, అనిల్‌ కపూర్‌ తండ్రి కొడుకులుగా నటించారు. ఈ సినిమా ట్రైలర్ లో రణబీర్‌కు బదులుగా బ్రహ్మీని పెట్టి ఓ వీడియోని రూపొందించారు. అందులో బ్రహ్మానందం నటించిన పలు సినిమాల్లోని సీన్లతో వాడేశారు. ఇక అనిల్‌ కపూర్‌ పాత్రకి బదులుగా నాజర్‌ని చూపించారు. బ్రహ్మానందం, నాజర్‌ తండ్రి కొడుకులైతే..యానిమల్‌ మూవీ ఇలా ఉంటుందంటూ ఆ వీడియోని సోషల్‌ మీడియాలో షేర్‌ చేశారు. ‘యానిమల్‌’ లోని కొన్ని సీన్లకి సరిగ్గా సూట్‌ అయ్యేలా బ్రహ్మానందం సినిమాల సీన్లను పెట్టారు. ఇది ఎవరు క్రియేట్‌ చేశారో తెలియదు కానీ.. అందరిని కడుపుబ్బా నవ్విస్తోంది.  మీరు కూడా ఈ వీడియో చూసి నవ్వుకోండి. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement