
ఇండియన్ క్రష్ నటి రష్మిక మందన్న. నటిగా ఏడేళ్లలోనే కథానాయకిగా అనూహ్య స్థాయికి చేరుకున్న ఈ బ్యూటీ 2016లో ఓ కన్నడ చిత్రం ద్వారా కథానాయకిగా ఎంట్రీ ఇచ్చారు. ఈ బెంగళూరు భామ ఆ తరువాత మలయాళం, తెలుగు, తమిళం అంటూ బహుభాషల్లో అవకాశాలను అందుకుంది. ముఖ్యంగా టాలీవుడ్ ప్రేక్షకులు ఈమెను మోసేశారు. వరుసగా స్టార్ హీరోలతో జతకట్టి క్రేజీ హీరోయిన్‌గా ఎదిగిపోయారు.
పుష్ప చిత్రం విజయం ఈమె కెరీర్‌ను మార్చేసింది. దెబ్బతో బాలీవుడ్ దృష్టిలో పడింది. అక్కడ తొలి చిత్రం గుడ్‌బై ఆశించిన విజయాన్ని అందుకోలేకపోయినా, ఇటీవల విడుదలైన యానిమల్ చిత్రం విమర్శలను మూటకట్టుకున్నా, భారీ వసూళ్లను రాబట్టుకుంది. దీంతో రష్మిక మందన క్రేజ్ మరింత పెరిగింది. ప్రస్తుతం తెలుగు, తమిళం, హిందీ చిత్రాలతో బిజీగా ఉన్నారు.
సాధారణంగా ఒక్క హిట్ వస్తేనే తారలు తమ పారి తోషికాన్ని పెంచేస్తారు. అలాంటిది ఈ ఇండియా క్రష్ బ్యూటీ, సక్సెస్‌ఫుల్ కథానాయకి పారితోషికాన్ని పెంచకుండా ఉంటారా? ఏకంగా రూ.4 కోట్లు పారితోషికం డిమాండ్ చేస్తుందనే ప్రచారం సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది. ఇది నిజమా, కాదా అన్నది పక్కన పెడితే రష్మిక మాత్రం అంగీకరించడం లేదు. పైగా ఈ వార్త నిజమైతే బాగుండు అంటూ సైటెర్‌లు వేస్తోంది. ఏదేమైనా నిప్పు లేనిదే పొగరాదుగా అంటూ నెటిజన్లు ఆమైపె ట్రోలింగ్ చేస్తున్నారు. మొత్తం మీద రష్మికపై ఈ టాపిక్ ఇప్పుడు సినీ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. రష్మిక మందన్న నటిస్తున్న పుష్ప–2 , ద్విభాషా చిత్రం రెయిన్‌బో చిత్రాలపై ఇప్పటి నుంచే భారీ అంచనాలు ఏర్పడుతున్నాయి.
Says who I wonder 🤦🏻♀️.. after seeing all of this I think I should actually consider it.. and if my producers ask why.. then I’ll just say ‘media out there is saying this sir.. and I think I should live up to their words.. what do I do?’ 🤣🤦🏻♀️
— Rashmika Mandanna (@iamRashmika) February 6, 2024
Comments
Please login to add a commentAdd a comment