ఆరు నెలల తర్వాత అక్కడ అడుగుపెట్టిన రష్మిక.. కారణం ఇదే | After Six Months Rashmika Mandanna Again Returns To Gym | Sakshi
Sakshi News home page

ఆరు నెలల తర్వాత అక్కడ అడుగుపెట్టిన రష్మిక.. కారణం ఇదే

Published Sat, Mar 23 2024 11:20 AM | Last Updated on Sat, Mar 23 2024 11:42 AM

After Six Months Rashmika Mandanna Again In Gym - Sakshi

ఇప్పుడు ఇండియన్‌ సినిమా క్రష్‌ ఎవరంటే..  టక్కున రష్మిక మందన్నా పేరే చెబుతారు. పాన్‌ ఇండియా చిత్రం పుష్ప తరువాత ఈ కన్నడ బ్యూటీ క్రేజ్‌ బాలీవుడ్‌ వరకు పాకింది. 2016లో కన్నడ చిత్రం కిరాక్‌ పార్టీతో కెరీర్‌ను ప్రారంభించిన ఈ బ్యూటీ అక్కడ మరో రెండు చిత్రాలు చేసి, టాలీవుడ్‌కు ఎంట్రీ ఇచ్చింది. తెలుగులో 'ఛలో' చిత్రంలో నటించి, గుర్తింపు పొందిన రష్మిక మందన్నా గీతగోవిందంతో ఒక్కసారిగా స్టార్‌ హీరోయిన్‌ అయిపోయింది. ఇక పుష్ప చిత్రం పాన్‌ ఇండియా స్థాయిలో సంచలన విజయాన్ని సాధించింది. కట్‌ చేస్తే బాలీవుడ్‌లో పాగా వేసేసింది.

అక్కడ తొలుత నటించిన రెండు చిత్రాలు పెద్దగా ఆడకపోయినా, మూడో చిత్రం 'యానిమల్‌' సంచలన విజయాన్ని సాధించింది. ఈ చిత్రంపై విమర్శలు వెల్లువెత్తినా, కలెక్షన్లు మాత్రం దుమ్మురేపాయి. దీంతో రష్మిక మందన్నా పాన్‌ ఇండియన్‌ నటిగా వీర లేవల్‌లో పాపులర్‌ అయింది. తాజాగా చావ అనే  హిందీ చిత్రంలో నటిస్తున్న ఈమె ప్రస్తుతం తనకు అనూహ్య క్రేజ్‌ను తెచ్చి పెట్టిన పుష్ప చిత్ర సీక్వెల్‌ను పూర్తి చేసే పనిలో ఉంది.

దీనితో పాటు రెయిన్‌బో అనే ద్విభాషా( తెలుగు, తమిళం) చిత్రం, ది గర్ల్‌ఫ్రెండ్‌ చిత్రాల్లో కూడా నటిస్తున్న రష్మిక మందన్నా ఇప్పుడు వర్కౌట్స్‌పై పూర్తిగా దృష్టి పెట్టిందట. అదేమిటీ ఇప్పటివరకూ వర్కౌట్స్‌ చేయడం లేదా? అని ఆశ్యర్యపోతున్నారా? నిజమే పని బిజీయో, లేక మరే కారణంగానో ఈ అమ్మడు గత ఆరేడు నెలలుగా వర్కౌట్స్‌ చేయడం లేదట. ఇక నుంచి వర్కౌట్స్‌ విషయంలో జాగ్రత్తగా ఉంటానని చెప్పింది. దీని గురించి రష్మికనే తన ఎక్స్‌ మీడియాలో పేర్కొంది. అంతే కాదు ఇకపై కచ్చితంగా ప్రతి రోజు క్రమం తప్పకుండా వర్కౌట్స్‌ చేస్తానని చెప్పింది. ఈ సందర్భంగా తీవ్రంగా తను వర్కౌట్స్‌ చేస్తున్న వీడియోను పోస్ట్‌ చేశారు. ఈ వీడియో ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో వైరల్‌ అవుతోంది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement