బాలీవుడ్ స్టార్ రణ్‌బీర్ కపూర్, రష్మికా మందన్నా, అనిల్ కపూర్, బాబీ డియోల్ ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం యానిమల్. ఫస్ట్ లుక్ రిలీజైనప్పటి నుంచి ఈ సినిమాకు బోలెడంత హైప్ వచ్చింది. టీజర్, ట్రైలర్ రిలీజయ్యాక ఆ అంచనాలు ఆకాశాన్నంటాయి. రణ్‌బీర్ యాక్టింగ్ చూసి మెంటలొచ్చేసిందని సూపర్‌స్టార్ మహేశ్‌బాబే చెప్పడం విశేషం. తండ్రీకొడుకుల భావోద్వేగం చుట్టూ తిరిగే ఈ చిత్రం తెలుగు, తమిళం, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో డిసెంబర్ 1న ప్రేక్షకుల ముందుకు వచ్చింది.
మూడుగంటల ఇరవై నిమిషాల నిడివి ఉన్నప్పటికీ ఈ చిత్రానికి పాజిటివ్ స్పందన లభిస్తోంది. అర్జున్ రెడ్డి ఫేమ్ సందీప్ వంగా దర్శకత్వం వహించిన సినిమా కావడంతో టికెట్లు హాట్ కేకుల్లా అమ్ముడవుతున్నాయి. తాజాగా ఈ సినిమా తొలిరోజు ఎంత రాబట్టిందనే విషయాన్ని యానిమల్ మూవీ నిర్మాణ సంస్థ టీ సిరీస్ అధికారికంగా వెల్లడించింది.
మొదటి రోజు ప్రపంచవ్యాప్తంగా రూ.116 కోట్ల కలెక్షన్లు సాధించిందని పోస్టర్ రిలీజ్ చేసింది. ఈ దూకుడు ఇలాగే కొనసాగితే యానిమల్ రూ.500 కోట్ల క్లబ్బులో చేరడం ఖాయమని అభిమానులు ధీమా వ్యక్తం చేస్తున్నారు. మరి యానిమల్ రానున్న రోజుల్లో ఎటువంటి రికార్డులు బద్ధలు కొడుతుందో చూడాలి!
He has come to conquer all the records 🤙🏼🔥🪓#AnimalHuntBegins
— T-Series (@TSeries) December 2, 2023
Book Your Tickets 🎟️ https://t.co/QvCXnEetUb#Animal#AnimalInCinemasNow #AnimalTheFilm @AnimalTheFilm @AnilKapoor #RanbirKapoor @iamRashmika @thedeol @tripti_dimri23@imvangasandeep #BhushanKumar… pic.twitter.com/bF8nV2Nw09
చదవండి: అందుకే నా సినిమా కలెక్షన్స్ తగ్గుతున్నాయి: సల్మాన్ ఖాన్
Comments
Please login to add a commentAdd a comment