కొందరు మాటకు ముందోసారి, వెనుకోసారి పేరు పెట్టి పిలుస్తూనే ఉంటారు. సినిమాల్లో కూడా ఇది జరుగుతుంది. అందుకు బ్రహ్మాస్త్ర మూవీ నిదర్శనం. ఈ సినిమాలో రియల్ జంట రణ్‌బీర్ కపూర్-ఆలియా భట్ హీరోహీరోయిన్లుగా నటించారు. రణ్‌బీర్.. శివ అనే పాత్రలో కనిపిస్తాడు. ఈ చిత్రంలో ఆలియా.. అతడిని పదేపదే శివ శివ అంటూ పిలిచేది. కొందరు దీన్ని లెక్కగట్టి సోషల్ మీడియాలో వదిలారు. సినిమా మొత్తమ్మీద రణ్‌బీర్‌ను 104 సార్లు శివ అని పిలిచిందని లెక్క తేల్చారు. ఇప్పుడీ రికార్డును బద్ధలు కొట్టాడు రణ్‌బీర్. అదెలాగంటే..
తండ్రీకొడుకుల అనుబంధం నేపథ్యంలో యానిమల్
రణ్‌బీర్ కపూర్ ప్రధాన పాత్రలో నటించిన లేటెస్ట్ బ్లాక్‌బస్టర్ మూవీ యానిమల్. రూ.890 కోట్లకు పైగా రాబట్టిన ఈ సినిమా తండ్రీకొడుకుల అనుబంధం చుట్టూ తిరుగుతుంది. ఈ మూవీలో అనిల్ కపూర్ తండ్రి పాత్రను పోషించాడు. పదేపదే పప్పా (నాన్న).. పప్పా అని తండ్రి గురించి ఆరాటపడతాడు హీరో. సినిమా మొత్తం ఈ తండ్రి ప్రేమ పొందాలన్న హీరో తపన గురించే కథ నడుస్తూ ఉంటుంది.
పప్పా అన్న పదం ఎన్నిసార్లు వచ్చిందంటే?
అలా ఈ సినిమాలో పప్పా అన్న పదం ఏకంగా 196 సార్లు వచ్చిందట. ఒక్క రణ్‌బీర్ నోటి నుంచే 150 కంటే ఎక్కువసార్లు పప్పా అన్న పదం వచ్చినట్లు తెలుస్తోంది. ఇది చూసిన జనాలు మొత్తానికి బ్రహ్మాస్త్ర రికార్డును యానిమల్ బద్ధలు కొట్టిందని కామెంట్లు చేస్తున్నారు. మరీ ముఖ్యంగా భార్య రికార్డును రణ్‌బీర్ బ్రేక్ చేశాడని ఫన్నీగా సెటైర్లు వేస్తున్నారు.
#Animal papa count. pic.twitter.com/ltaaIJzK1l
— LetsCinema (@letscinema) January 27, 2024
Comments
Please login to add a commentAdd a comment