బ్లాక్‌బస్టర్‌ యానిమల్‌కు సీక్వెల్‌.. ఛాన్స్‌ కొట్టేసిన బ్యూటీ! | Malavika Mohanan to Act in Animal Sequel? | Sakshi
Sakshi News home page

Malavika Mohanan: యానిమల్‌ సీక్వెల్‌.. రష్మిక స్థానంలో మరో హీరోయిన్‌?

Published Fri, Dec 15 2023 9:55 AM | Last Updated on Fri, Dec 15 2023 10:09 AM

Malavika Mohanan to Act in Animal Sequel? - Sakshi

కోలీవుడ్‌లో ఒక ఆసక్తికరమైన ప్రచారం జరుగుతోంది. రష్మిక మందన్నా నటించిన సూపర్‌ హిట్‌ మూవీ యానిమల్‌ సీక్వెల్‌లో మలయాళ బ్యూటీ మాళవిక మోహన్‌ నటించబోతున్నారట! రజనీకాంత్‌ కథానాయకుడిగా నటించిన పేట చిత్రం ద్వారా కోలీవుడ్‌కు పరిచయమయ్యారు మాళవిక మోహన్‌. ఆ చిత్రంలో నటుడు శశి కుమార్‌కు భార్యగా నటించి ప్రశంసలు అందుకున్న ఆమె ఆ తర్వాత విజయ్‌కు జంటగా మాస్టర్‌ చిత్రంలో నటించారు. ధనుష్‌ సరసన మారన్‌ చిత్రంలోనూ మెరిశారు.

మలయాళ బ్యూటీకి బంపరాఫర్‌
ప్రస్తుతం విక్రమ్‌ జంటగా తంగలాన్‌ చిత్రంలో నటించిన మాళవిక ఆ చిత్రం విడుదల కోసం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. పా.రంజిత్‌ దర్శకత్వంలో స్టూడియో గ్రీన్‌ పతాకంపై కేఈ జ్ఞానవేల్‌ నిర్మిస్తున్నారు. నిర్మాణ కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ చిత్రం వచ్చే ఏడాది జనవరి 26వ తేదీన తెరపైకి రావడానికి ముస్తాబవుతోంది. కాగా నటి మాళవిక మోహన్‌ ఇంతకుముందు కొన్ని హిందీ, మలయాళం చిత్రాల్లోనూ నటించారు. తాజాగా ఆమె బాలీవుడ్‌లో మరో బంపరాఫర్‌ చేజిక్కించుకున్నట్లు ఓ వార్త వైరల్‌ అవుతుంది.

బ్లాక్‌బస్టర్‌ మూవీకి సీక్వెల్‌
బాలీవుడ్‌ హీరో రణ్‌బీర్‌ కపూర్‌ హీరోగా నటించిన యానిమల్‌ చిత్రంలో రష్మిక మందన్న హీరోయిన్‌గా నటించిన విషయం తెలిసిందే. టాలీవుడ్‌ దర్శకుడు సందీప్‌ వంగా దర్శకత్వం వహించిన ఈ చిత్రం ఇటీవల విడుదలై రూ.600 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టింది. దీంతో ఈ చిత్రానికి సీక్వెల్‌ రూపొందించడానికి యూనిట్‌ వర్గాలు సన్నాహాలు చేస్తున్నట్లు సమాచారం. ఇందులో మాళవిక మోహన్‌ను హీరోయిన్‌గా సెలక్ట్‌ చేయనున్నట్లు టాక్‌. ఇదే నిజమైతే మరి యానిమల్‌ చిత్రంతో మంచి విజయాన్ని అందుకున్న రష్మిక మందన్నా సీక్వెల్‌లో ఉంటుందా? లేదా? అని అభిమానులు ఆలోచిస్తున్నారు.

చదవండి: అమర్‌ను మళ్లీ టార్గెట్‌ చేసిన శివాజీ.. వెధవ.. ఏం రోగమంటూ..

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement