బాలీవుడ్ హీరో రణ్‌బీర్ కపూర్, నేషనల్ క్రష్ రష్మిక మందన్నా నటించిన సూపర్‌హిట్ మూవీ 'యానిమల్'. సందీప్ రెండ్డి వంగా డైరెక్షన్‌లో వచ్చిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద రూ.900 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టి రికార్డ్ క్రియేట్ చేసింది. తండ్రీ-కుమారుల సెంటిమెంట్‌తో గతేడాదిలో వచ్చిన ఈ సినిమా బ్లాక్ బస్టర్‌గా నిలిచింది. అయితే ఈ చిత్రం అంతేస్థాయిలో విమర్శలు ఎదుర్కొంది. స్త్రీలను కించపరిచేలా కొన్ని సన్నివేశాలు ఉన్నాయంటూ పలువురు ఈ చిత్రాన్ని తప్పుబట్టారు.
అయితే బాక్సాఫీస్ సూపర్‌హిట్‌గా నిలిచిన ఈ మూవీ ఓటీటీకి రిలీజ్‌పై సస్పెన్ష్ కొనసాగుతోంది. ఈ చిత్రాన్ని జనవరి 26న ఓటీటీలో రిలీజ్ చేసేందుకు మేకర్స్ ప్లాన్ చేశారు. అయితే ఊహించని విధంగా యానిమల్ మూవీపై వివాదం తలెత్తింది. ఓటీటీ రిలీజ్‌ను నిలిపివేయాలని కోర్టులో దావా వేసింది చిత్ర నిర్మాణ సంస్థల్లో ఒకరైన సినీ1 స్టూడియోస్. దీంతో రిపబ్లిక్ డే రోజున ఓటీటీ రిలీజ్‌పై సందిగ్ధత ఇంకా కొనసాగుతోంది.
(ఇది చదవండి: చెంపదెబ్బ వల్ల చాలా గట్టిగా ఏడ్చేశాను: హీరోయిన్ రష్మిక)
అసలేం జరిగిందంటే..
కాగా.. యానిమల్ చిత్రాన్ని టి-సిరీస్ ఫిల్మ్స్, భద్రకాళి పిక్చర్స్, సినీ1 స్టూడియోస్ సంయుక్తంగా కలిసి తెరకెక్కించాయి. ఇందులో సినీ1 స్టూడియోస్ 'యానిమల్' ఓటీటీ రిలీజ్‌ను నిలిపివేయాలని ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించింది. యానిమల్ శాటిలైట్ హక్కుల విషయంలో సూపర్ క్యాసెట్స్ ఇండస్ట్రీస్ ప్రైవేట్ లిమిటెడ్, క్లూవర్ మ్యాక్స్ ఎంటర్‌టైన్‌మెంట్ సంస్థలతో ఒప్పందం జరిగితే.. వారి నుంచి ఇప్పటి వరకు ఒక్క రూపాయి కూడా తనకు చెందలేదని సినీ1 స్టూడియోస్ ఆరోపిస్తూ కోర్టులో దావా వేసింది. దీంతో నెట్‌ఫ్లిక్స్‌తో పాటు చిత్ర నిర్మాణ సంస్థలకు కోర్టు సమన్లు జారీ చేసింది. దీంతో జనవరి 22న ఈ వివాదంపై విచారణ జరిగింది.
వివాదం తొలగినట్లే..!
ఈ అంశంపై ఈ నెల 22న ఢిల్లీ న్యాయస్థానం విచారణ చేపట్టింది. ఈ విచారణకు హాజరైన సినీ1 స్టూడియోస్, టీ సిరీస్ సంయుక్తంగా ఓ అవగాహన ఒప్పందానికి ఓకే చెప్పినట్లు ఇరు పక్షాల తరపున సీనియర్ న్యాయవాదులు కోర్టుకు వివరించారు. ఈ ఒప్పందాన్ని కోర్టుకు సమర్పించేందుకు అంగీకరించారు. వారి మధ్య అవగాహన ఒప్పందం కుదరడంతో యానిమల్ ఓటీటీ రిలీజ్‌కు మార్గం సుగమం అయినట్లు తెలుస్తోంది. అయితే ఈ కేసును మరోసారి జనవరి 24న విచారించనున్నారు. కాగా.. ఈ సినిమాను ఓటీటీలో 3 గంటల 29 నిమిషాల రన్‌టైమ్ ఉండనుంది. థియేటర్ వర్షన్‌కు అదనంగా మరో 8 నుంచి 10 నిమిషాల పాటు సీన్స్ అదనంగా చేర్చారు.
Comments
Please login to add a commentAdd a comment