బాలీవుడ్ హీరో రణ్‌బీర్ కపూర్ నటించిన సూపర్‌హిట్ మూవీ 'యానిమల్'. సందీప్ రెండ్డి వంగా డైరెక్షన్‌లో వచ్చిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద రూ. 900 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టి రికార్డ్ క్రియేట్ చేసింది. తండ్రీ-కుమారుల సెంటిమెంట్‌తో గతేడాదిలో వచ్చిన ఈ సినిమా ఓటీటీ రిలీజ్ కోసం సినీ ప్రియులు ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు. గణతంత్ర దినోత్సవం సందర్భంగా ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫామ్ నెట్‌ఫ్లిక్స్‌లో ఈ చిత్రాన్ని విడుదల చేయాలని మేకర్స్ ప్లాన్‌లో ఉన్నారట. జనవరి 26 నుంచి యానిమల్ స్ట్రీమింగ్ కానుందని నెట్టింట వార్తలు వైరల్ అవుతున్నాయి.
ఓటీటీ కోసం ఆ సీన్స్
యానిమల్ రన్‌టైమ్ మూడున్నర గంటలు ఉండటంతో ప్రేక్షకుల ఇబ్బంది పడుతారని భావించి సుమారు సుమారు తొమ్మిది నిమిషాల సన్నివేశాలను కట్ చేసినట్లు సందీప్ రెడ్డి గతంలో చెప్పాడు. నెట్‌ఫ్లిక్స్ వెర్షన్ కోసం ఎడిటింగ్ చేస్తున్నట్లు కూడా ఆయన తెలిపాడు. థియేటర్ కోసం తొలగించిన కొన్ని షాట్స్‌ను ఓటీటీ వెర్షన్‌కు యాడ్ చేస్తున్నట్లు ఆయన చెప్పాడు. అందులో రష్మికతో రణ్‌బీర్ లిప్‌లాక్ సీన్స్ కూడా ఉన్నట్లు ప్రచారం ఉంది.
యానిమల్ ఓటీటీ రిలీజ్‌కు చిక్కులు
యానిమల్ చిత్రాన్ని టి-సిరీస్ ఫిల్మ్స్, భద్రకాళి పిక్చర్స్, సినీ1 స్టూడియోస్ సంయుక్తంగా కలిసి తెరకెక్కించాయి. ఇందులో సినీ1 స్టూడియోస్ 'యానిమల్' ఓటీటీ రిలీజ్‌ను నిలిపివేయాలని ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించింది. యానిమల్ శాటిలైట్ హక్కుల విషయంలో సూపర్ క్యాసెట్స్ ఇండస్ట్రీస్ ప్రైవేట్ లిమిటెడ్, క్లూవర్ మ్యాక్స్ ఎంటర్‌టైన్‌మెంట్ సంస్థలతో ఒప్పందం జరిగితే.. వారి నుంచి ఇప్పటి వరకు ఒక్క రూపాయి కూడా తనకు చెందలేదని సినీ1 స్టూడియోస్ ఆరోపిస్తూ కోర్టులో దావా వేసింది. దీంతో నెట్‌ఫ్లిక్స్‌తో పాటు చిత్ర నిర్మాణ సంస్థలకు కోర్టు సమన్లు జారీ చేసింది. ఈ అంశంపై నేడు (జనవరి20) వివరణ ఇవ్వాలని న్యాయస్థానం కోరింది. జనవరి 22న ఈ వివాదంపై విచారణ జరగనుంది.
Comments
Please login to add a commentAdd a comment